Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు రెండవ రోజు ఏరియల్ సర్వే నిర్వహించారు. అదే విధంగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మొగల్తూరు వెళ్లారు.
#CycloneArnab
#AndhraPradesh
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరియల్ సర్వే చేశారు. అనంతరం నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో నీట మునిగిన వరిపొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. మొగల్తూరు మండలం మాట్రేవు గ్రామంలో పునరావాసకేంద్రానికి వెళ్లి బాధితులతో మాట్లాడి రేషన్ పంపిణీ చేశారు.
#CycloneArnab
#AndhraPradesh
📷 రాష్ట్రంలో వరుస కేంద్ర బృందాల పర్యటన
శని, ఆదివారాల్లో అర్నబ్ తుపాను నష్టాల్ని పరిశీలించనున్న బృందం
కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటన
సోమ, మంగళవారాల్లో ఖరీఫ్ - 2026 కరువు పరిస్థితులను పరిశీలించనున్న బృందం
శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటన
పర్యటనల అనంతరం గౌరవ ముఖ్యమంత్రితో సమావేశం అయ్యే అవకాశం : ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల సంస్థ
#AndhraPradesh #NaraChandrababuNaidu #ArnabCyclone #CycloneArnabUpdates #APSDMA #AndhraPradesh #RTGS #CycloneReliefMeasuresInAP
అండమాన్ సముద్రంలో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారి ఆతదుపరి 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందని #APSDMA తెలిపింది.
దీని ప్రభావంతో
• రానున్న 3 రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.
శనివారం (31-10-2026): మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం
⚠️పైన పేర్కొన్న ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.
#APWeather #RainAlert #AndhraPradesh #WeatherUpdate #CycloneAlert #APRain #andamanseafoodvillage
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
• ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నరసాపురం ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.
• మధ్యాహ్నం 12 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి.
• మొగల్తూరు చేరుకున్న అనంతరం నవరసపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సీఎం చంద్రబాబు.
• రైతులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి.
• తుఫాన్ ప్రభావిత మాట్రేవు గ్రామానికి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.
• తుఫాన్ పునరావాస శిబిరాన్ని సందర్శించనున్న సీఎం.
• నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.
#AndhraPradesh #NaraChandrababuNaidu #CMChandrababuNaidu #CBN #CycloneArnab #ArnabCyclone #APSDMA #AndhraPradesh #RTGS #CycloneReliefMeasuresInAP
Andhra Pradesh State Disaster Management Authority retweeted
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అర్నబ్ తుఫాన్ సంబంధిత అంశాలపై హైబ్రిడ్ విధానంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది.
#AndhraPradesh
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు పర్యటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని చెయ్యేరు, వేట్లపాలెం, గచ్చకాయలపొర గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ధైర్యం చెప్పారు. పునరావాసకేంద్రాల్లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు.
#CycloneArnab
#AndhraPradesh
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో చెయ్యేరు వద్ద అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ పునరుద్ధరణ పనులను ఎంతో అంకితభావంతో చేస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులను అభినందించారు.
#CycloneArnab
#AndhraPradesh
Andhra Pradesh State Disaster Management Authority retweeted
అర్నబ్ తుఫాను సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో విద్యుత్ సరఫరా దెబ్బతిన్న 5,400 గ్రామాల్లో 4,771 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 629 గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది.
ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని కృష్ణా జిల్లాలో ప్రభావితమైన 915 గ్రామాల్లో 835 గ్రామాలకు సరఫరా పునరుద్ధరించారు. మరో 80 గ్రామాలకు పునరుద్ధరించాల్సి ఉంది.
రహదారులు–రవాణా పునరుద్ధరణ
ఆర్ అండ్ బీ పరిధిలో ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులపై 2,396 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి
అత్యధికంగా పశ్చిమగోదావరిలో 552 కి.మీ.; కోనసీమలో 396 కి.మీ.; తూర్పుగోదావరిలో 372 కి.మీ.; శ్రీకాకుళంలో 309 కి.మీ.; అనకాపల్లిలో 236 కి.మీ.; విజయనగరంలో 211 కి.మీ. మేర ఉపరితలం రోడ్లు దెబ్బతిన్నాయి
రహదారులపై ఏర్పడిన 62 కోతల్లో 22, 34 గండ్లలో 13 పునరుద్ధరించారు. మరో 40 కోతలు, 21 గండ్లు పునరుద్ధరించాల్సి ఉంది.
దెబ్బతిన్న 102 కల్వర్టులు, ఇతర క్రాస్ డ్రైనేజీ నిర్మాణాల్లో 83 పునరుద్ధరించారు. మరో 19 పెండింగ్‌లో ఉన్నాయి.
రహదారులపై కూలిన 2,264 చెట్లను పూర్తిగా తొలగించారు. సాయంత్రం 6–8 గంటల మధ్యే 183 చెట్లను, అందులో కాకినాడలో 127, తూర్పుగోదావరిలో 56 చెట్లను తొలగించారు.
రాకపోకలకు అంతరాయం ఏర్పడిన 133 చోట్లలో 99 చోట్ల రవాణా పునరుద్ధరించారు. మరో 34 చోట్ల అంతరాయాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 3,33,268 హెక్టార్ల వ్యవసాయ పంటల విస్తీర్ణం తుఫాను ప్రభావానికి గురైనట్లు ప్రాథమిక నివేదిక. తుది పంటనష్టం అంచనా ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 76,752 హెక్టార్లు; కాకినాడలో 52,253; తూర్పుగోదావరిలో 49,959; కోనసీమలో 46,845; కృష్ణాలో 44,836 హెక్టార్లు ప్రభావితమయ్యాయి
చాలా పంటలు కీలకమైన పూత, పంట ఏర్పడే దశల్లో ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. పొలాల్లో అదనపు నీరు క్రమంగా తగ్గుతుండటంతో ముంపులోని పంటలు బయటపడుతున్నాయి అని వివరించారు.
ఉద్యాన పంటల పరిస్థితి
15 జిల్లాల్లో 22,452 హెక్టార్ల ఉద్యాన పంటలపై తుఫాన్ ప్రభావం
అత్యధికంగా కోనసీమలో 11,229 హెక్టార్లు, తూర్పుగోదావరిలో 4,423 హెక్టార్లు ప్రభావితమయ్యాయి. మొత్తం ప్రభావిత ఉద్యాన విస్తీర్ణంలో సుమారు సగం కోనసీమలోనే ఉంది.
ఇతర జిల్లాల్లో ప్రభావిత విస్తీర్ణం: కృష్ణా 1,350; బాపట్ల 1,182; కాకినాడ 1,048; పశ్చిమగోదావరి 903; ఏలూరు 415; గుంటూరు 415 హెక్టార్లు.
#CycloneArnab
#AndhraPradesh
అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని #APSDMA తెలిపింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
శుక్రవారం (30-10-2026) అల్లూరి, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
#Andhrapradesh #APSDMA #lowpressure #rain #depression #APRains #weather
మరోవైపు భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందు నదీ పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పొంగిపొర్లే కాలువలు, వాగులు దాటే ప్రయత్నం, నది ఈతకు వెళ్ళడం లాంటివి చేయరాదని హెచ్చరించింది.
#Flood #Nagavali #Vamsadhara
• అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయికి పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
• అమరావతి -కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చేరుకున్న ముఖ్యమంత్రి
• మార్గం మధ్యలో ఏరియల్ వ్యూ ద్వారా అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు, ఆక్వా చెరువులను పరిశీలించిన సీఎం
• ఏరియల్ వ్యూ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• నిమ్మకూరు, పామర్రు, బంటుమిల్లి, నరసాపురం, పాలకొల్లు, అమలాపురం, కాట్రేనికోన ప్రాంతాల్లో నీట మునిగిన పొలాలను, కూలిన కొబ్బరి చెట్లు పరిశీలన
• ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందనే అంశాలను సీఎంకు వివరించిన సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న
#AndhraPradesh #NaraChandrababuNaidu #aerialview #CMChandrababuNaidu #CBN #CycloneArnab #ArnabCyclone #CycloneArnabUpdates #APSDMA #AndhraPradesh #RTGS #CycloneReliefMeasuresInAP
































