HomeMinister AP (@HomeMinisterAP) header
HomeMinister AP (@HomeMinisterAP) profile picture

HMO, Room.No-136, Building No-2, AP Secretariat, Amaravathi, AP. Email: [email protected]

Amaravati
Joined October 2024
Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)Photo by HomeMinister AP (@HomeMinisterAP)
విధి నిర్వహణలో అప్రమత్తత, ధైర్యం, మానవత్వానికి అనంతపురం ట్రాఫిక్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీ సురేంద్ర గారి సేవలు నిదర్శనం. రైలు ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తిని సకాలంలో గుర్తించి రక్షించిన ఆయనను అభినందిస్తున్నాను. ప్రజల భద్రత కోసం అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి పోలీస్‌ సిబ్బందికి నా అభినందనలు. #AndhraPradeshPolice #AnantapurPolice #PoliceService #PublicSafety
1
234
శ్రీసిటీలో బాయిలర్ పేలి కార్మికులు మృతిచెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనపై తిరుపతి జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
2
184
విజయవాడ నున్న సీఐ అహ్మద్ అలీ గారి ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విధి నిర్వహణలో అస్వస్థతకు గురై మృతి చెందడం అత్యంత విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలుస్తుంది. అహ్మద్ అలీ గారి సేవలను గౌరవంగా స్మరించుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
1
5
9
560
నా సొంతూరు సబ్బవరంలో ₹1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారితో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణలో అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలు అత్యంత కీలకం. అత్యవసర సమయాల్లో మరింత వేగంగా స్పందించి ప్రజలకు భద్రత కల్పించేలా అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తాను. #Sabbavaram #Pendurthi #FireStation #HomeMinister #AndhraPradesh #NDA
1
1
135
టెక్కలి సమీపంలో రైలు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన సాల్మన్‌రాజ్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
1
1
3
150
వాయుగుండం ప్రభావంతో రానున్న మూడు రోజులు కీలకం. అధికారులతో సమీక్షించి, ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, SDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించాను. ఉత్తరాంధ్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దు. అత్యవసర సహాయం కోసం 112, 1070, 18004250101 నంబర్లను సంప్రదించండి. #CycloneAlert #AndhraPradesh #DisasterManagement #HomeMinister #AndhraPradesh
1
3
160
వాయుగుండం ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోంది. కంట్రోల్ రూమ్‌లు 24 గంటలు అందుబాటులో ఉండేలా, వాతావరణ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ, అవసరమైన సహాయక చర్యలకు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించాను. ప్రజలు చెట్లు, భారీ హోర్డింగ్స్, శిథిలావస్థలో ఉన్న ఇళ్లకు దూరంగా ఉండి, ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను తప్పక పాటించాలి. ప్రజల భద్రతే మా తొలి ప్రాధాన్యత.
107
బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించాను. ప్రభావిత జిల్లాల్లో SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచి, ఒడిశా సరిహద్దు జిల్లాలతో సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, వాతావరణ హెచ్చరికలను పాటించాలి. #AndhraPradesh #RainAlert
1
123
కష్టకాలంలో పుణ్యవతిగారికి అండగా నిలిచి, ఆమె భర్తకు గౌరవప్రదమైన అంతిమ వీడ్కోలు అందేలా చేసిన సీఐ నవీన్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. ప్రజల సమస్యలకు సత్వరమే స్పందిస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సేవా స్ఫూర్తిని అభినందిస్తున్నాను. @APPOLICE100
3
155
తుని రైల్వే స్టేషన్‌లో ప్రమాదవశాత్తు రైలు కింద పడిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన ఎలమంచిలి రూరల్ హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు గారి ధైర్యసాహసాలు, మానవత్వం అభినందనీయం. బాధ్యతతో పాటు ఆపదలో ఉన్నవారిని కాపాడే స్ఫూర్తిని చాటిన చంద్రరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి పోలీసు సిబ్బంది మన శాఖకు గర్వకారణం.
1
2
192
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో పిడుగుపాటుకు నలుగురు మృతి చెందడం తీవ్రంగా బాధించింది. ఈ విషాద ఘటనపై అధికారులతో సమన్వయం చేస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణమే అవసరమైన సహాయ, సహాయక చర్యలు అందించాలని ఆదేశించాను.మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుంది. #AndhraPradesh #Palnadu #Narasaraopet #LightningStrike
1
157
దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. ఇవాళ, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాను. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. #AndhraPradesh #RainAlert #WeatherAlert #HeavyRainfall #APGovt #PublicSafety #StayAlert
1
172
ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతూ పోలీసు శాఖపై మరింత విశ్వాసాన్ని పెంచిన పెదకాకాని పోలీసు అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు. ప్రజల భద్రతతో పాటు దేవాలయాల పవిత్రతను, భద్రతను కాపాడటంలో మన పోలీసులు చూపిన చొరవ అభినందనీయం. @police_guntur పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ ఆభరణాల కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసి చోరీకి గురైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు #TheftCase #PoliceForPeople #IdhiManchiPrabhutvam #Pedakakani
2
192
సైదాపురం మండల కేంద్రంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుండటంతో వాహనాన్ని పక్కకు తీయాలని సూచించిన కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్‌పై దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడిన ఘటన తీవ్రంగా ఖండిస్తున్నాను తన విధులను బాధ్యతగా నిర్వర్తించిన కానిస్టేబుల్ ప్రేమ్ కుమార్ తీరు అభినందనీయం. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడటం ఏమాత్రం సహించేది కాదు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని, తగిన శిక్ష పడేలా చర్యలు చేపడతాం.
1
175
శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డూరు వద్ద బోటు బోల్తాపడి మత్స్యకారుడు వంకా యాదవరావు గారు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. మిగిలిన ముగ్గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడటం ఉపశమనాన్ని కలిగించింది. యాదవరావు గారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.
3
8
375
తిరుపతిలో ₹2.70 కోట్లతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన అత్యాధునిక మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం గర్వంగా ఉంది. మహిళలు, బాలికలకు మరింత భద్రత, గౌరవం, తక్షణ పోలీస్ సహాయం అందించేలా ఈ మోడల్ పోలీస్ స్టేషన్‌ను తీర్చిదిద్దాం. బాధిత మహిళలకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం, చిన్నారులతో వచ్చే మహిళలకు ప్రత్యేక వసతులు, చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్‌తో పాటు వారానికి రెండు రోజుల పాటు సైకియాట్రిస్ట్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. కుటుంబ సమస్యలను వీలైనంత వరకు కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడానికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా, కుటుంబ కలహాలు పిల్లల భవిష్యత్తుపై చూపే ప్రభావం, కుటుంబ సంబంధాలు, పిల్లల పెంపకం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రత్యేక చర్యను ఈ పోలీస్ స్టేషన్‌లో చేపట్టడం అభినందనీయం. 24/7 సైబర్ సహాయ కేంద్రం ద్వారా మహిళలపై సైబర్ నేరాలు, ఆన్‌లైన్ వేధింపులపై వేగంగా స్పందించే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. మహిళలపై నమోదవుతున్న నేరాలు గత ఏడాదితో పోలిస్తే 94 నుంచి 58కి తగ్గడం పోలీస్ శాఖ కృషికి నిదర్శనం. ఈ అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసి మహిళా భద్రతను మరింత బలోపేతం చేసినందుకు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు గారిని, పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మహిళల భద్రతే లక్ష్యం, రక్షణే మన బాధ్యత. #APPolice #WomenSafety #ChildSafety #TirupatiPolice
1
3
19
500
విజయనగరంలో గాజులరేగ కొండపై పోలీసు వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో జరిగిన ప్రమాదం తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ దామోదర్ గారితో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రమణ మృతి చెందడం అత్యంత బాధాకరం. ఎస్సై అశోక్ సహా గాయపడిన పోలీసు సిబ్బందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.
1
1
213
విశాఖ జూపార్క్ వద్ద పోలీస్ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురై పలువురు కానిస్టేబుళ్లు గాయపడిన విషయం తెలిసి వెంటనే అధికారులతో మాట్లాడాను. గాయపడిన కానిస్టేబుళ్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. వారి చికిత్సకు అవసరమైన అన్ని సహాయ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. మన పోలీస్ సిబ్బంది క్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత. #Visakhapatnam #Police #AndhraPradesh #HomeMinister #APPolice
2
227
ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. ప్రసాదం, టీ ఇస్తామని నమ్మించి ఇంట్లోకి పిలిచి దొంగతనానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి, ₹24.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ₹2 లక్షల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ V. హర్షవర్ధన్ రాజు, IPS గారికి, ఆయన బృందానికి అభినందనలు. నేరస్థులు ఎలాంటి కపట పథకం వేసినా, వారి అడుగులను పసిగట్టే పదునైన నిఘాతో ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి తమ సత్తా చాటారు. #PrakasamPolice #APPolice #AndhraPradesh
అద్దె ఇంట్లో నమ్మకంగా ఉంటూ ప్రసాదం మరియు టీ ఇస్తామని పైన ఉన్న ఆమె క్రిందకు పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి దొంగతనానికి పాల్పడిన ముద్దాయిల అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు 👉సుమారు రూ.24,50,000 విలువైన బంగారు ఆభరణాలు, 2 లక్షలు విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం @APPOLICE100
165