Nagarjuna Yadav (@ImYanamala) header
Nagarjuna Yadav (@ImYanamala) profile picture

Indian 🇮🇳, Engineer by education, Politician by choice, Socialist by conviction, Voice for People,Official Spokesperson @YSRCParty Ex-Chairman APEWIDC

Joined February 2015
Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)Photo by Nagarjuna Yadav (@ImYanamala)
అచంచల స్థిరత్వ సిద్ధాంతాల చేత శిఖరమై ఎదిగి, అఖండ లక్ష్యపు మార్తండ జ్యోతిలా ఆకాశపు ఎత్తుకు వెలిగి, అసందర్బమైన ఈ ఓటమి మిమ్మల్ని నైతికంగా ఇబ్బందులు పెట్టొచ్చు.
రాబోయే దారివెంట దిగులు
వాయుగుండమై వణికిస్తున్నా, నడిచే నడక నిప్పుల కొలిమైనా, మీ చేతిని విడువను, మీ మార్గం వదలను.
586
340
64
2,690
525,951
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు. దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య జయంతికి ఆ గౌరవం ఇవ్వలేదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించలేదు. సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహ ఉద్యమకర్త కందుకూరి వీరేశలింగం జయంతికి గుర్తింపు ఇవ్వలేదు. ఆంధ్రకేసరి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా వంటి మహనీయుల జయంతులకు ఈ గౌరవం దక్కలేదు. ఇక తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతిని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించలేదు! మరి వీరందరి కంటే రామోజీరావు గారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయన జయంతిని మాత్రమే రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి చంద్రబాబు గారికి ఉన్న ప్రాతిపదిక ఏమిటి? రాష్ట్ర గౌరవాలు… వ్యక్తిగత అభిమానం, రాజకీయ అనుబంధాల ఆధారంగా నిర్ణయించాలా? లేక చరిత్రలో వారి సేవలు, త్యాగాలు, ప్రజలకు చేసిన కృషి ఆధారంగా నిర్ణయించాలా? చంద్రబాబు గారూ… ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి!
1
20
1
86
1,663
నారా కుటుంబం… క్విడ్ ప్రోకో కుంభకోణం! సీఎం కోడలు నారా బ్రాహ్మణి గారికి భూములు అమ్మితే, అందుకు ప్రతిఫలంగా విక్రేతలకు ప్రభుత్వం నుంచి గ్రామకంఠం భూముల కేటాయింపులా? ఇదే కదా మీ నీకిది–నాకిది రాజకీయం? అమరావతిలో నారా బ్రాహ్మణి గారికి భూములు విక్రయించిన సాంబశివరావు, గద్దె నితీష్‌లకు ప్రతిఫలంగా గ్రామకంఠం భూములు కట్టబెట్టారన్నది నిజమో కాదో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇక 25 వేల గజాల స్థలంలో చంద్రబాబు నిర్మిస్తున్న భవనం “అవినీతి అంతఃపురం” అని చెప్పడానికి ఇంతకంటే ఏం సాక్ష్యాలు కావాలి? సాక్షి లింక్: youtu.be/d7DIpF5EZrE?si=zIp1…
5
43
1
209
3,124
జనసైకో మూకలతో బూతులు తిట్టిస్తూ, రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలకు ప్రోత్సహించింది స్వయంగా చంద్రబాబు గారే అంటూ నిందితులే అంగీకరించారు. చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఈ దూషణల పర్వం సాగుతోందని నిందితులే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులతో ఈ సైకో మూకలకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే వారిపై కేసులు నమోదు చేయడానికి పోలీసు యంత్రాంగం వెనుకడుగు వేస్తోంది. సాక్షి వీడియో: youtu.be/4QREw4XwkfE
17
19
149
2,150
పట్టాభి… నీ పైత్యం ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని వైయస్ భారతమ్మ గారిని ఉద్దేశించి ప్రెస్‌మీట్ పెట్టడం ఏమిటి? ఒక హద్దు, సంస్కారం, ఇంగితం లేకుండా రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే బ్రతుకు బ్రతకడం ఎందుకు? నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ కనీసం మీ భార్య, పిల్లలు అయినా హర్షిస్తారా? భువనేశ్వరి గారిని ఉద్దేశించి “మీ ఆయనకు రోజూ మందులు వేయమ్మా” అని మేం మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటావు? బ్రాహ్మణి గారిని ఉద్దేశించి “మీ ఆయనకు కాస్త సంస్కారం నేర్పించమ్మా” అని మేం అంటే మీ బ్రతుకు ఏమవుతుంది? వైయస్ భారతమ్మ గారి పేరును పదేపదే ప్రస్తావిస్తూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ద్వారా నువ్వు సాధించాలనుకుంటున్నదేంటి? ఎవర్ని రెచ్చగొట్టాలని ఈ ప్రెస్ మీట్ పెట్టావ్? మహిళలను రాజకీయ వివాదాల్లోకి లాగి, వ్యక్తిగత విమర్శలకు దిగితే చూస్తూ ఊరుకోవాలనుకుంటున్నారా? మీరు మాట్లాడితే రాజకీయ విమర్శలు… మేం మాట్లాడితే వ్యక్తిగత దూషణలా? ఒకటే గుర్తుంచుకో పట్టాభి… రాజకీయ విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెబుతాం. కానీ మీకు ఒక నీతి, ఎదుటివారికి మరో నీతి అనే ద్వంద్వ వైఖరిని మాత్రం సహించేది లేదు!
18
80
2
476
18,589
వర్రా రవీందర్ రెడ్డి పేరుతో వైఎస్ షర్మిలమ్మ గారిపై, నారా భువనేశ్వరి గారిపై అనుచిత, అసభ్యకర పోస్టులు చేసింది ఉదయ్ భూషణ్ అనే టీడీపీ కార్యకర్త… ఈ విషయంలో పోలీస్ దర్యాప్తులోనే తేలింది. టీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి, అనుచిత పోస్టులు పెట్టి, అనంతరం ఆ పోస్టులను వైసీపీకి ఆపాదిస్తూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసి కుట్రలు చేసిన చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీకే సొంతం.
15
138
1
596
14,366
ఏపీ డీజీపీ ఆఫీసుకు వైయస్ఆర్సీపీ నేతల బృందం.. - జనసేన మూకల అరాచకాలపై ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలు - ట్విట్టర్ స్పేస్ లో వైయస్ జగన్ కుటుంబంపై జుగుప్సాకర వ్యాఖ్యలు - ట్విట్టర్ స్పేస్ లో పాల్గొన్న 350 మందితో కూడిన జనసేన మూక - ఐడీలతో సహా డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వైయస్ఆర్సీపీ నేతలు - జనసేన మూకల అరాచకాలపై డీజీపీ ఆఫీసులో వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
19
40
5
266
10,520
జనసైకో మూకల వెనుక అసలు సూత్రధారి చంద్రబాబేనా? కూటమి పిల్లసైకో “టైసన్” అలియాస్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. ఈ బూతుల పంచాంగానికి కర్త ఎవరు? కర్మ ఎవరు? క్రియ ఎవరు? అన్న ప్రశ్నలకు చంద్రబాబు వైఖరే సమాధానం చెబుతుంది.
11
28
2
148
3,605
#PawanKalyan గారు… త్రినాథ్ కుమార్, రాఘవేంద్రనాయుడు, పృథ్వీ…పై కేసు పెట్టకండని ఎందుకు ఆదేశాలు ఇచ్చారు? ఈ ముగ్గురికీ మీకున్న సంబంధం ఏమిటి? మీతో వారికి ఉన్న సాన్నిహిత్యం ఏమిటి? మీ పేరు చెప్పుకుని తిరిగే వీరు వైయస్ జగన్ గారి కుటుంబంపై అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు కాకుండా తెరవెనుక మీరు చేస్తున్న కుట్రల వెనుక ఆంతర్యం ఏమిటి? మీ వ్యక్తిగత జీవితంపై ఎవరైనా మాట్లాడితే వ్యక్తిగత గోప్యత, మహిళల గౌరవం, సంస్కారం గుర్తుకొస్తాయి. మరి వైయస్ జగన్ కుటుంబానికి ఆ గౌరవం ఇవ్వాలని మీకు తెలియదా? మీరు మాట్లాడే సనాతన ధర్మం, మహిళా గౌరవం, సంస్కారం మీ వ్యక్తిగత రాజకీయాల కోసమేనా? పవన్ గారూ… మైక్ ముందు నీతులు చెప్పడం కాదు… మీకు సన్నిహితులైనా సైకో మూకల వ్యవహారంపై సమాధానం చెప్పండి.
79
263
29
960
75,820
పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విడాకుల వివాదంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాటించిన సంయమనం పరస్పర గౌరవం కోసం వేసిన అడుగు… అంతేకానీ మా బలహీనత కాదు! వైఎస్ జగన్ గారి కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు దిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. మా సంయమనాన్ని చేతకానితనంగా… మా సంస్కారాన్ని బలహీనతగా తీసుకోవద్దు! ఈ రోజు మీ వెనుక కూటమి ప్రభుత్వం ఉందనే ధీమాతో హద్దులు దాటవద్దు. ఎల్లకాలం మిమ్మల్ని కాపాడే వాళ్ళే అధికారం ఉంటారని అనుకోవద్దు. రేపు మీరు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తే మిమ్మలని భగవంతుడు కూడా కాపాడలేరు. గుర్తుంచుకోండి… ఇదేమీ విజ్ఞప్తి కాదు.. హెచ్చరిక!
12
55
2
220
6,792
12.11.2026 విజయవాడ: మీడియా ప్రతినిధులకు నమస్కారం... ఈ రోజు (12.11.2026) సాయంత్రం 4:30 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ మల్లాది విష్ణు, శ్రీ దేవినేని అవినాష్, శ్రీ దొడ్డ అంజి రెడ్డి, ఇతర నాయకులు విజయవాడ లోని సైబర్ క్రైమ్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడతారు. కావున, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్తమాన్ని కవర్ చేయవలసిందిగా కోరుతున్నాము.
9
131
5
697
25,804
సందర్భం ఏదైనా కావచ్చు… సంభాషణ ఏదైనా కావచ్చు… సంఘటన ఏదైనా కావచ్చు… రాజకీయ విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు మధ్య స్పష్టమైన గీత ఉండాలనే ఉద్దేశంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ముందడుగు వేసింది. కానీ కొంతమంది జనసేన అభిమానులు వైఎస్ జగన్ గారి కుటుంబంపై అత్యంత హేయమైన వ్యక్తిగత వ్యాఖ్యలను చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. పవన్ కళ్యాణ్ గారి తాజా వ్యక్తిగత పరిణామాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సంయమనం పాటించిన తర్వాత కూడా జనసేనలోని కొంతమంది అభిమానులు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ సంస్కృతిని ప్రజలకు తెలియజేస్తుంది. మాపై ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసినా, ఎదుటివారి కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగకూడదనే సంస్కారాన్ని మేము పాటిస్తున్నాం, అందుకు తాజా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత వివాదమే ఒక ఉదాహరణ.
31
75
5
422
15,808
మాకు #PawanKalyan గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు… అంత అగత్యమూ లేదు! మాపై పవన్ ఎన్ని వ్యక్తిగత దూషణలు చేసినా, ఎన్ని వ్యక్తిగత కుటుంబ ఆరోపణలు చేసినా మేము సంయమనం పాటిస్తాం. వ్యక్తిగత విమర్శలకు వ్యక్తిగత విమర్శలతో సమాధానం చెప్పకుండా, రాజకీయాల్లో ఒక కొత్త సంస్కారాన్ని తీసుకొచ్చే ప్రయత్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై YSRCP స్పందించదు! 👌👏 #WeYSRCP #YSRCP #PawanKalyan
37
35
9
242
17,870
#PawanKalyan వ్యక్తిగత జీవితం గురించి మాకెందుకు? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై YSRCP స్పందించదు! మాపై పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నప్పటికీ, మేము సంయమనం పాటిస్తున్నాం. ఆయన వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి విమర్శలు చేయాల్సిన అవసరం మాకు లేదు. #WeYSRCP #YSRCP #PawanKalyan
రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలపై వైయస్ఆర్సీపీ స్పందించదు. అలాంటి అంశాలకు దూరంగా ఉంటుంది. మా పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం.. పోరాడుతాం! - @ImYanamala గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. #YSRCP #JaganannaConnects
20
50
2
303
9,104
Dear YS Jagan Soldiers, Don’t lose focus. Don’t get distracted. Don’t deviate from our path. Our target is fixed. Our commitment is unwavering. 2029 is our destination. Bringing YS Jagan Mohan Reddy Garu back to the Chief Minister’s chair is our mission. ఓం నమో వేంకటేశాయ 🙏
57
234
23
1,689
81,700
జగన్ అనే మూడు అక్షరాలకు… వామనుడి మూడు అడుగులకు ఉన్నంత బలం ఉందని స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. బలి చక్రవర్తి ముందు వామనుడు మూడు అడుగులతో విశ్వరూపం చూపించినట్టే…నారా రెడ్ బుక్ అకృత్యాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. సాక్షి లింక్: youtu.be/vZbC54Ofurg?si=la1U…
12
23
1
182
3,806
జగన్ వ్యతిరేకులకు దీపావళి శుభాకాంక్షలు! వైయస్ జగన్‌ గారిని తక్కువ అంచనా వేయడం టీడీపీకి కొత్తేమీ కాదు… కానీ దాని రాజకీయ మూల్యం చెల్లించుకోవడం మాత్రం ప్రతిసారీ కొత్త అనుభవమే! ఇక జగన్ పని అయిపోయిందనే ఆలోచనతో రాజకీయం చేసే వారికి స్థానిక ఎన్నికలు ఒక వేక్ అప్ కాల్.. జగన్ గారికి అధికారం పోయింది కానీ అభిమానం పోలేదు అని ఈ ఎన్నికలు గుర్తు చేసాయి. మరో మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణానికి సిద్ధంగా ఉన్న నాయకుడితో తలపడుతున్నారనే విషయం గుర్తుంచుకోండి. అధికారం తాత్కాలికం… రాజకీయాలు సుదీర్ఘం!
37
39
3
369
10,183
చీకటిపై వెలుగు విజయం సాధించినట్లే, అన్యాయంపై న్యాయం, నిరాశపై ఆశ, అణచివేతపై ప్రజాస్వామ్య స్ఫూర్తి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ… ప్రజల పక్షాన నిలబడే పోరాట స్ఫూర్తితో, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం అనే ఆశయాల వెలుగులు రాష్ట్రమంతా నిండాలని కోరుకుంటూ… మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!
5
88
1,449
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనే! తిరుపతి రూరల్ జడ్పీటీసీగా 700 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి చిన్న కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. అధికార బలం, అడ్డంకులు, అణచివేతలు ఎన్ని ఎదురైనా… ప్రజాభిమానమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం!
9
64
2
649
14,485
Nagarjuna Yadav retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
174
1,304
40
4,402
232,059
1000కు పైగా ఎంపీటీసీ స్థానాలు… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం! మూడు పార్టీల కూటమి అధికార బలం ముందు ప్రజాబలం తలవంచలేదు. బెదిరింపులకు భయపడలేదు. దౌర్జన్యాలకు వెనక్కి తగ్గలేదు. 2 వేలకు పైగా స్థానాల్లో నామినేషన్లు అడ్డుకుని, భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నా… అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజాతీర్పును మాత్రం ఆపలేకపోయారు! 1000కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే అందుకు నిదర్శనం! మూడు పార్టీలు కలిసినా… ప్రజల మద్దతు ముందు నిలవలేకపోయాయి! గుర్తుంచుకోండి… అధికారం మీ చేతుల్లో ఉండొచ్చు… కానీ ప్రజాభిమానం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంది! ఇది సాధారణ విజయం కాదు… ప్రజాబలం చాటిన రాజకీయ హెచ్చరిక!
46
91
6
685
30,638