తెలుగు పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికి.. టీవీ, సినీ రంగాలలోనూ తనదైన ముద్రవేసి.. అపజయం అన్నది ఎరుగని తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా ఘననివాళులు. రాజీ అన్నది ఎరుగని వ్యక్తిత్వంతో, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలతో వ్యవస్థలకు ధైర్యాన్ని ఇచ్చి మీడియా సంస్థల ద్వారా సమాజంపై అత్యంత ప్రభావం చూపిన దార్శనికుడు రామోజీ రావు గారు. జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుందాం!
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ. ప్రజా గొంతుకగా మారి సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి చాటుతూ, సమాజాన్ని చైతన్యపరుస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ..జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో మేము సైతం అంటూ...భాగస్వామ్యమవుతున్న జర్నలిస్ట్ సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
#NationalPressDay
#AndhraPradesh
4
269
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర పారిశ్రామిక ప్రగతి దిశగా ముందుకు సాగుతోంది. విశాఖపట్నంలో నిర్వహించిన 31వ CII భాగస్వామ్య సదస్సులో రూ.9,02,434 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 109 అవగాహన ఒప్పందాలు కుదరడం విశేషం. ప్రాంతీయ పెట్టుబడుల సదస్సులతో కలిపి రాష్ట్రానికి మొత్తం రూ.9,88,957 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, 3,48,309 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం కావడం శుభపరిణామం.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
చిన్నారుల చిరునవ్వులే దేశ ప్రగతికి నిదర్శనం.. వారి ఉజ్వల భవితకు బంగారు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్న శుభవేళ.. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyChildrensDay
#ChildrensDay
#JawaharlalNehru
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
నేను పారిశ్రామికవేత్తలను ఒక్కటే కోరుతున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడమే కాదు మీ కంపెనీల ప్రధాన కార్యాలయాలను ఏపీకి తీసుకురండి. మంచి జీవన శైలి, ప్రతిభ ఉన్న యువత, పోర్ట్, ఎయిర్ పోర్ట్, రోడ్ కనెక్టివిటీ, భవిష్యత్ సాంకేతికత, సులభమైన యాక్సెస్ మా దగ్గర ఉంది. ఒక ఫోన్ కాల్ లేదా వాట్సాప్ సందేశం దూరంలోనే మేము అందుబాటులో ఉంటాం. ఏపీలో ఇన్వెస్ట్ చేయండి, ఇన్నోవేట్ చేయండి, వృద్ధి చెందండి.
7
414
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను చాటిచెప్పేలా విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర సంస్కృతి నుంచి పెట్టుబడి అవకాశాల వరకు ప్రతి అంశాన్ని ప్రతిబింబించేలా వేదికలను తీర్చిదిద్దారు.
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
6
268
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అంటే అధికశాతం ఉద్యోగుల ఓట్లే అయివుంటాయి. ఇటీవల జరిగిన పట్టణ స్థానిక ఎన్నికల్లోనూ, పరిషత్ ఎన్నికల లోనూ వైసీపీ కంటే ఎన్డీయే దాదాపు 32-39 శాతం ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఎన్డీయే పాలన పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారనడానికి ఇది నిదర్శనం.
#NDAtsunamiInAP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
4
268
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు కృషి చేసిన శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ విద్యార్థులందరికీ "జాతీయ విద్యా దినోత్సవ" శుభాకాంక్షలు...
#NationalEducationDay
#moulanaabulkalamazad
12
333
తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. నాయకులు పార్టీలు మారినా కార్యకర్త మాత్రం జెండా దింపడు. ప్రాణం పోయినా జెండా పట్టుకుని చనిపోతాడు. అలాంటి కార్యకర్తలు ఉండే పార్టీ, అలాంటి కమిట్మెంట్ ఉండే పార్టీ తెలుగుదేశం.
#NDAtsunamiInAP
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
12
338
రాముని అయోధ్యా ప్రవేశం, సత్యభామా శ్రీకృష్ణుల నరకాసుర వధ విజయాలకు ప్రతీకగా పరబ్రహ్మ స్వరూప దీపాలు వెలిగించే పవిత్ర పర్వదినం దీపావళి. ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి దివ్య కటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరి ఇళ్లలోనూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రగతి కాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali
#DiwaliWishes
ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉపయోగించుకున్న ఉద్యోగులు, ప్రభుత్వ డాక్టర్లు, వృద్దులు, ఎన్నికల సిబ్బంది తదితర వర్గాలు సైతం ఎన్డీయేకే ఓట్లు వేశారు. నాలుగింట మూడొంతుల ఓటర్లు ఎన్డీయేకు మద్దతుగా నిలిచారు. జగన్ హయాంలో ఉద్యోగులకు జరిగిన మోసాలు, అవమానాలు దీనికి ఓ కారణం కాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, తమకు అన్ని విధాలుగా అండగా నిలవడంతోనే ఉద్యోగులు ఎన్డీయేపై తమ నమ్మకం చెక్కుచెదరలేదని చాటారు.
#NDAsweepsAP
#APLocalBodyElections
#CheppaamChestunnaam
#ChandrababuNaidu
#AndhraPradesh
‘మురసా’ తుఫాన్ నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట, మాచర్ల రోడ్లలో కల్వర్టుల పూడికతీత పనులను పరిశీలించాను.
తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించాను. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించాను.
ప్రజల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యత. ప్రతి పరిస్థితినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు అండగా ఉంటాం.
#TogetherAgainstCycloneMurasu #cyclonemursu
#KannaLakshmiNarayana #Sattenapalle
#NaraChandrababuNaidu #AndhraPradesh
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరి పులివెందులలో మాత్రమే గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి కారణం జగన్. ఆయనే శాంతిభద్రతల సమస్యను సృష్టించి, ఇప్పుడు తానే బాధితుడినని నాటకాలాడుతున్నారు.
#YCPMarkViolence
#APLocalBodyElections
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#PsychoFekuJagan
#AndhraPradesh
సత్తెనపల్లిలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.
సత్తెనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నా పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి నా ఓటు హక్కును వినియోగించుకున్నాను.
ప్రజాస్వామ్యంలో ఓటు ప్రతి పౌరుడి బాధ్యత, హక్కు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలి.
సత్తెనపల్లి పట్టణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను.
మీ ఓటు – మన పట్టణ భవిష్యత్తుకు పునాది.
#Sattenapalle
#KannaLakshminarayana #LocalBodyElections
ఎన్నికల్లో గెలవలేమనే భయంతో అక్రమ మార్గాలను ఆశ్రయిస్తూ, ఓటర్లను ప్రలోభ పెడుతున్న గొడ్డలి పార్టీ.
#APLocalBodyElections
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
1
4
315
రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి, అనుపాలెం, కొత్తబోధనం, రాజుపాలెం, బ్రాహ్మణపల్లి, గణపవరం గ్రామాల్లో పర్యటించి “చెప్పాం.. చేస్తున్నాం” కార్యక్రమంలో పాల్గొన్నాను.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాను.
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మా ప్రభుత్వ ప్రాధాన్యత. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా సంకల్పం.
ఆత్మీయ స్వాగతం పలికిన రాజుపాలెం మండల ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు!
ప్రజల నమ్మకమే మా బలం.. అభివృద్ధే మా లక్ష్యం!
#NaraChandrababuNaidu #KannaLakshminarayana
#Sattenapalle #LocalBodyElections
#CheppamChestunnam
2
303
సత్తెనపల్లి పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం – ప్రతి వార్డులో కూటమి జెండా ఎగరాలి!
సత్తెనపల్లి పట్టణంలోని ప్రజావేదికలో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశంలో కూటమి నాయకులు, వార్డు ఇన్‌చార్జ్‌లు, కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల కార్యాచరణపై చర్చించాం.
సత్తెనపల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి వార్డులోని సమస్యలను గుర్తించి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేయాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.
ప్రతి వార్డులో బూత్ కమిటీలను బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించాం.
సత్తెనపల్లి సమగ్ర అభివృద్ధే మన లక్ష్యం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు సమష్టిగా కృషి చేద్దాం.
#Sattenapalle #KannaLakshminarayana #TDP #APLocalBodyElections #NaraChandrababuNaidu
రాజుపాలెం మండలంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలకు డిక్లరేషన్ పత్రాల అందజేత
సత్తెనపల్లి నియోజకవర్గం | రాజుపాలెం మండలం
రాజుపాలెం మండలంలో ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశాను.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతకు స్థానిక సంస్థల్లో ప్రజల భాగస్వామ్యం నిదర్శనం. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, గ్రామాలకు నిధులు, విధులు అందించి గ్రామ స్వరాజ్య సాధనకు కృషి చేస్తున్నాం. సూపర్ సిక్స్ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల ప్రగతికి పెద్దపీట వేస్తున్నాం.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ నిధుల మళ్లింపు, స్థానిక సంస్థల నిర్వీర్యం కారణంగా గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. ఆ పరిస్థితులకు భిన్నంగా, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ గ్రామాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజాసేవకు అంకితమై గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు.
#KannaLakshmiNarayana #Sattenapalle #CheppaamChestunnaam #ApLocalBodyElections
#NaraChandrababuNaidu #andhrapradesh
రాష్ట్రానికి మంచి జరిగితే జగన్ రెడ్డి చూడలేకపోతున్నాడు. అభివృద్ధిని సహించలేకపోతున్నాడు. ఓడిపోతామనే భయంతో ఎలాగైనా ఎన్నికలను ఆపాలన్న ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. ఎన్నికలను అడ్డుకునేందుకు ఏకంగా 62 పిటిషన్లు వేయించాడు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి అడ్డుపడేందుకు వెంటనే కోర్టులకు వెళ్లడమే గొడ్డలి పార్టీ పని.
#APLocalBodyElections
#ChandrababuNaidu


























