ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక.
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగం ఈ చారిత్రక ఉద్యమంలో కీలక మలుపుగా నిలిచింది. ఆయన త్యాగం తెలుగు ప్రజల ఆకాంక్షలకు బలమైన స్వరమై, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, మన రాష్ట్ర గౌరవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా అభివృద్ధి, సంక్షేమం, ప్రజల శ్రేయస్సు దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఘటనలు ఎప్పటికీ గుర్తుంటాయి. నిత్యం ప్రజల కోసం శ్రమించే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు ఘటనతో పాటు...ఆ కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి ప్రజలు ఇచ్చిన మద్దతు కూడా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చంద్రబాబు గారు నిర్బంధంలో ఉన్న ఆ 53 రోజులు ప్రజలు చూపిన మద్దతు జీవితాంతం గుర్తుంటుంది. నాటి పాలకుల అక్రమ నిర్బంధం అనంతరం మూడేళ్ల క్రితం ఇదే రోజున చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా నాడు ప్రజలు పలికిన మద్దతును, ఇచ్చిన సహకారాన్ని, అండగా నిలిచిన విధానాన్ని గర్తుచేసుకుని వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండే నేను ‘నిజం గెలవాలి’ అంటూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై మీ వద్దకు వచ్చినప్పుడు....నా కష్టాన్ని మీ కష్టంగా భావించి నిజాన్ని గెలిపించారు. పల్లెల్లోని ఆడబిడ్డల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి వరకు...స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలిపిన సంఘీభావం మా కుటుంబాన్ని నిలబెట్టింది. గచ్చిబౌలిలో ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ పేరుతో వేలాదిగా తరలివచ్చిన యువత, ఉద్యోగులు, వివిధ రంగాల నిపుణులు చూపిన అభిమానం.... చంద్రబాబు గారు ప్రజల కోసం పడిన దశాబ్దాల కష్టం వృధా కాలేదని నిరూపించింది. ముఖ్యంగా ఆడబిడ్డలు, మహిళలు నాటి పాలకుల అణిచివేతను ధిక్కరించి రోడ్డెక్కి మరీ గళం విప్పారు. ప్రజలు చూపిన ఆత్మీయతకు, మద్దతుకు, నమ్మకానికి జీవితాంతం కృతజ్ఞురాలిని అని ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాను.
#3yrsSinceCBNreleased
నాడు 53 రోజుల అక్రమ నిర్బంధంలో కోట్లాది హృదయాల స్పందన నా జీవితాంతం మర్చిపోలేను. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు...53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చాను. నాడు విధ్వంస పాలనను ప్రశ్నిస్తుంటే సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాలను అణిచివేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో నన్ను అర్ధరాత్రి అన్యాయంగా అరెస్టు చేశారు. అది అక్రమ నిర్బంధమని, కుట్రపూరిత అరెస్టు అని అందరికీ తెలిసింది. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆ 53 రోజులూ నా జీవితంలో అత్యంత కఠినమైనవి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఇదే రోజున మళ్లీ ప్రజల్లోకి వచ్చాను. నేను జైల్లో ఉన్న సమయంలో నాకు అండగా నిలిచిన కోట్లాది తెలుగు ప్రజల మద్దతును నా జీవితంలో మర్చిపోలేను. నిర్బంధంతో నన్ను ఒంటరిని చేయాలనుకున్న కుట్రలు...యావత్ తెలుగుజాతి తిరుగుబాటుతో బద్దలయ్యాయి. గ్రాటిట్యూడ్ పేరుతో మద్దతుగా నిలిచిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నియంతల అణిచివేతను ధిక్కరించి తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాలతో ప్రజలకు మంచి చేస్తే ఎలా గుర్తు పెట్టుకుంటారో, ఎలా మద్దతుగా నిలుస్తారో ప్రజాస్పందన నిరూపించింది. ముఖ్యంగా ఎంత నిర్భందం ఉన్నా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కార్యక్రమంలో వేలాదిగా తరలివచ్చిన యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ నా కోసం నినదించిన ఘటన నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది. నేను తెచ్చిన సంస్కరణలు, కల్పించిన అవకాశాలతో మంచి ఉద్యోగాలు పొందిన వారు గ్రాటిట్యూడ్ పేరుతో స్వచ్ఛందంగా రోడ్డెక్కడం ఎంతో గొప్ప విషయం. రాష్ట్రంలో, దేశంలో....ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగువారు, ప్రజాస్వామ్యవాదులు బయటకు వచ్చి స్వచ్ఛందంగా సంఘీభావం తెలిపారు. రోడ్డెక్కి నాటి పాలకుల కుట్రలపై నిరసనలు తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. పల్లెల్లో సామాన్య మహిళల నుంచి ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీల సీఈవోల వరకు... రైతుల నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు...విద్యార్థుల నుంచి ప్రవాసాంధ్రుల వరకు...సమాజంలోని ప్రతి వర్గం నుంచి వెల్లువెత్తిన మద్దతు అపూర్వం. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా సతీమణి, నా కుటుంబ సభ్యులు సైతం 'నిజం గెలవాలి' అని మీ వద్దకు వస్తే....వారితో కలిసి అడుగేసి నిజాన్ని గెలిపించారు. ధర్మాన్ని నిలబెట్టారు.
నాకు మద్దతు పలికిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి , ప్రజాస్వామ్యవాదికి, ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాడు నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన, మంచికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం నిలబెట్టుకుంటాను. నా కోసం నిలిచిన మీకోసం చివరి వరకు నిలబడతాను. మీ నమ్మకం, అభిమానం నా బలం. మీ భవిష్యత్తు నా సంకల్పం. మీ అందరి మద్దతు, సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 చేస్తానని పునరుద్ఘాటిస్తున్నాను.

Unity is the strength that binds our nation.
On National Unity Day, we remember Sardar Vallabhbhai Patel, whose vision, courage and determination played a defining role in uniting India.
Let us honour his legacy by embracing diversity, strengthening the bonds of togetherness and working collectively towards a united and stronger India.
#NationalUnityDay #SardarVallabhbhaiPatel #UnityInDiversity #NTRMemorialTrust #NTRTrust
A 4.5-foot skull. Massive back spines. Backward-bending claws. Think you could survive Acrocanthosaurus? Think again! And did you know, scientists walked past a hidden river monster for 162 years thinking it was just a regular croc. Find out more from Devaansh on #DinosaurDeets!
Youtube - youtu.be/1R2vVe9wUPg
Facebook - facebook.com/reel/9617171665…
Instagram - instagram.com/p/DfHeyKTCU4C/
#Acrocanthosaurus #Suchosaurus #DevaanshNara #Dinosaurs #Prehistoric #ApexPredator #Spinosaurus #Paleontology #Cretaceous #Fossils #DinoFacts #RichardOwen #Theropods
Meet Megalosaurus, the "Great Lizard" of Jurassic England and the very first non-avian dinosaur ever scientifically named! Long before the word "dinosaur" even existed, people thought its giant fossilized bones belonged to Roman war elephants, giant humans, or even dragons!
Youtube - youtu.be/obJuJPs3yJA
Facebook - facebook.com/reel/3078629172…
Instagram - instagram.com/p/De1dgeTDbJy/
#Megalosaurus #DinosaurDeets #DevaanshNara #Dinosaurs #Prehistoric #Paleontology #WilliamBuckland #Fossils #DinoFacts #Jurassic #FirstDinosaur #ScienceForKids
విజయదశమి సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో కుప్పంలో కుప్పం చెరువు కట్ట వద్ద జరిగిన శ్రీ మహాలక్ష్మీ దీప పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అమ్మవారి పూజకు మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించే ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం నాకెంతో సంతృప్తినిస్తుంది.
#vijayadashami
#Kuppam
సమస్త శక్తులకు మూలమైన ఆదిశక్తిగా దుర్గమ్మ గురించి చెబుతారు. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయం మాత్రమే కాదు, లోకాలను కాపాడగలిగిన స్త్రీశక్తి నిరూపితమైన రోజు కూడా ఇదే. ఆ జగన్మాత అనుగ్రహం మీ కుటుంబ సభ్యులందరి పైనా ఎల్లప్పుడూ ఉండాలని... మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
#Vijayadashami
దసరా నవరాత్రులలో మూలా నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సమస్త సృష్టికి మూలమైన శక్తిగా మనం భావించే అమ్మవారు ఈరోజు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఇటువంటి పర్వదినాన చంద్రబాబు గారితో కలిసి విజయవాడ లోని శ్రీ కనకదుర్గ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉంది.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనం మరియు బ్లడ్ సెంటర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరంలలో పనిచేస్తున్న బ్లడ్ సెంటర్లు ఇకపై విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా సేవలందించనున్నాయి.
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభమైన మరుసటి ఏడాది నుంచే ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించేలా ఎన్టీఆర్ ఆరోగ్య రథాల ద్వారా మొబైల్ క్లినిక్‌లను నిర్వహిస్తున్నాం. అలాగే, గత ఏడాది హైదరాబాద్‌లో తలసీమియా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం.
ప్రతి ఆపదలోనూ ప్రజలకు అండగా నిలుస్తూ, మరెన్నో కుటుంబాల్లో ఆశను నింపుతూ మా సేవా ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
#NTRMemorialTrust
#AndhraPradesh
Massive bite, rock-solid bones, and those classic, helpless tiny arms. Let’s step into the world of the Tyrannotitan with Devaansh on the latest episode of Dino Deets!
Youtube - youtu.be/9R2TDZxzeRs
Facebook - facebook.com/reel/5204955519…
Instagram - instagram.com/p/DejbuSjibyn/
#Tyrannotitan #DinosaurDeets #DevaanshNara #Dinosaurs #Prehistoric #Paleontology #Carcharodontosauridae #Fossils #DinoFacts #JurassicWorld #ApexPredator #ScienceForKids