మణిదీప్ అకాల మరణంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని భరోసా.
అధినేత ఆదేశాలతో బందనకల్‌లో అంత్యక్రియలకు హాజరైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్.
స్వయంగా పాడె మోసి, మణిదీప్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న వైనం.
గజ్వేల్ - ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాస కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మణిదీప్ కుమార్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న మణిదీప్ నిన్న తన స్వగ్రామంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వార్త తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనై, ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
విషాద వార్త అందిన వెంటనే స్పందించిన కేసీఆర్, అంత్యక్రియల ఏర్పాట్లన్నింటినీ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించాలని మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను ఆదేశించారు. అధినేత సూచన మేరకు సంతోష్ కుమార్, కేసీఆర్ వ్యక్తిగత సిబ్బందితో కలిసి మణిదీప్ స్వగ్రామమైన బందనకల్‌కు చేరుకున్నారు. మణిదీప్ భౌతికకాయంపై పూలమాల ఉంచి తుది నివాళులర్పించారు. శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం సాగిన అంతిమయాత్రలో సంతోష్ కుమార్ స్వయంగా పాడె మోసి, మణిదీప్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మణిదీప్ కుటుంబాన్ని కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటారని సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. మృతుడికి తండ్రి, చెల్లెలు, నానమ్మ ఉన్నారని, వారి బాగోగులన్నీ అధినేతే చూసుకుంటారని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా మణిదీప్ సోదరి చదువుతో పాటు వివాహ బాధ్యతను కూడా కేసీఆర్ స్వయంగా తీసుకుంటారని, తండ్రి మరియు నానమ్మల ఆరోగ్య సంరక్షణకు పూర్తి అండగా నిలుస్తారని వెల్లడించారు.
ఈ అంత్యక్రియల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు, కేసీఆర్ పీఎస్ నాగేందర్ రెడ్డి, పార్టీ నేతలు అంజిరెడ్డి, జుబేర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని మణిదీప్‌కు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
రాయలసీమ లిఫ్ట్‌పై జీవో రాకముందే అడ్డుకట్ట.. నెలలోనే పనులు ఆపించాం: మాజీ మంత్రి హరీష్ రావు
- జూన్ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్లగానే కేసీఆర్ ఒప్పుకున్నారని, అందుకే మే 5, 2020న రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రయోజనాల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిజాయితీ, నిబద్ధత ఏంటో అధికారిక ఆధారాలతో నిజాలు బయటపెడుతున్నాను.
- రాయలసీమ లిఫ్ట్ జీవో రావడానికి నాలుగు నెలల ముందే, జనవరి 29, 2020న కేఆర్ఎంబీకి మొదటి లేఖ రాశాం. సాక్షి, ఆంధ్రజ్యోతి, వెలుగు వంటి పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని, పనులు చేపట్టకుండా అడ్డుకోవాలని స్పష్టంగా కోరాం.
- మే 5, 2020న ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన వారం రోజుల్లోపే, అంటే మే 12న కేఆర్ఎంబీకి రెండో లేఖ రాశాం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీల నీటిని తరలించే కొత్త పంపింగ్ నిబంధనల ఉల్లంఘన అని పేర్కొంటూ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం.
- జీవో వచ్చిన నెల రోజుల్లోపే జూన్ 4, 2020న జరిగిన 12వ కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ పనులను ఆపేలా ఆదేశాలు ఇప్పించాం. డీపీఆర్ సమర్పించి బోర్డు, సీడబ్ల్యూసీ పరిశీలించి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదించే వరకు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లొద్దని కేఆర్ఎంబీ చైర్మన్ ఆదేశించిన విషయం కేంద్ర ప్రభుత్వ అధికారిక మినిట్స్‌లోనే ఉంది.
- నాగార్జునసాగర్ నుంచి చేపట్టిన పల్నాడు ప్రాజెక్టుకు జనవరిలోనే టెండర్లు పిలిచినా మీ ప్రభుత్వం 11 నెలల పాటు పట్టించుకోలేదు. చివరకు బీఆర్ఎస్ గట్టిగా నిలదీసి ఒత్తిడి తెచ్చాకే నవంబర్ 16న బ్యాక్ డేట్‌తో లేఖ రాశారు.
- నిన్న జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు గురించి కనీసం నోరు కూడా మెదపకుండా మీ గురువు గారికి గురుదక్షిణ చెల్లించుకున్నారు. కానీ మేము మాత్రం జీవో రాకముందే నాలుగు నెలల ముందు లేఖ రాసి, వచ్చిన వారంలోనే అభ్యంతరం తెలిపి, నెలలోనే పనులు ఆపాలని డైరెక్షన్ తీసుకువచ్చాం.
• బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.
తెలంగాణ ప్రయోజనాల కోసం మంత్రి పదవులను తృణప్రాయంగా వదిలేశాం..!
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీగా, అణువణువునా తెలంగాణ తత్వాన్ని నింపుకున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే మేము, ఆనాడు ప్రభుత్వం తీసుకున్న తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలపై క్యాబినెట్ లోపలే గట్టిగా పోరాడాం. ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి కోరాం.
- అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయని కేసీఆర్ గారు ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్, ప్రధానమంత్రి, సోనియా గాంధీలకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఆ తప్పుడు నిర్ణయాల్లో మేము భాగస్వాములం కాలేమని, ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నామని స్పష్టం చేశాం.
- తెలంగాణ ఇస్తామని పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పించడం, ఉమ్మడి కనీస కార్యక్రమం (సీఎంపీ)లో చేర్చడం, సోనియా గాంధీ చేసిన అభ్యర్థన మేరకు కేసీఆర్ ఆదేశాలతోనే మేము క్యాబినెట్లో చేరాం. మేము ఒక స్వతంత్ర పార్టీ. ఆరుగురు మంత్రులమయ్యామంటే అది కేసీఆర్ నిర్ణయం, ఆయన ఇచ్చిన అవకాశం మాత్రమే తప్ప రాజశేఖర్ రెడ్డి వల్ల కాదు.
- తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పార్టీలో చర్చించి, పదవుల నుంచి వైదొలగాలని కేసీఆర్ ఆదేశించిన వెంటనే అర్ధరాత్రి 12 గంటలకు అమెరికా నుంచి ఫ్యాక్స్ ద్వారా రాజీనామాలు పంపాం. రాష్ట్రం కోసం మంత్రి పదవులను గడ్డిపోచల్లా త్యజించిన చరిత్ర మాది.
- మేము రాజీనామా చేసిన తర్వాత తొమ్మిదో నెలలో ఆ వివాదాస్పద జీవోలు జారీ అయ్యాయి. వాటిని ప్రశ్నిస్తే ముందే బడ్జెట్ ఆమోదం జరిగిందంటూ తప్పుడు వాదనలు చేస్తున్నారు. అసలు అలాంటి అంశాలు బడ్జెట్లో ఉండవు, పద్దులు క్యాబినెట్ ముందుకు రానే రావు.
- పులిచింతల, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులు, జీవో 610 అమలు వంటి అనేక తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నందుకే, వాటిలో భాగం కాకూడదని రాజీనామా చేసి బయటకు వచ్చాం.
- మా రాజీనామాలను చాలా రోజుల పాటు ఆమోదించలేదు. స్వయంగా దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ వద్దకు వచ్చి రాజీనామాలు ఉపసంహరించుకోవాలని, వెంటనే ప్రణబ్ ముఖర్జీ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఇస్తామని, మరికొద్ది రోజులు క్యాబినెట్లో కొనసాగాలని బతిమిలాడారు. అయినా పదవుల కంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసి త్యాగాలు చేశాం.
- తెలంగాణ కోసం మేము త్యజించి విసిరేసిన పదవులకు ఆశపడి, మంత్రులుగా చేరి పెదవులు మూసుకున్నది మీరే. అయినా మా త్యాగాల గురించి ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.
• బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.
1
242

చిల్లరగా మాట్లాడేవారికి అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తోంది.
• కృష్ణా జలాల లెక్కల్లో కాంగ్రెస్ ‘జాదా హుషారి’..
• 25 శాతం కనిష్ట వినియోగంపై క్షమాపణ చెప్పాలి!
- ఆ మాట అనకూడదనే అనుకున్నాను కానీ పరిస్థితుల వల్ల తప్పడం లేదు. ‘ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేనా’ అన్నట్లుగా, చిల్లరగా మాట్లాడేవారికి అదే రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తోంది.
- కృష్ణా జలాల వినియోగంపై నిన్న జరిగిన ప్రెస్మీట్లో వాస్తవాలను వక్రీకరించిన తీరు చూసే నేను ‘జాదా హుషారి’ (అతి తెలివితేటలు) అనే పదం వాడాను.
- ఎక్కడైతే మన నీటి వాటా శాతం తక్కువగా ఉందో అక్కడ కేవలం టీఎంసీల సంఖ్యను మాత్రమే చెప్పడం, ఎక్కడైతే శాతం ఎక్కువగా కనిపిస్తుందో అక్కడ పర్సంటేజీలు ప్రస్తావించడం అతి తెలివితేటలు కాక మరేంటి?
- 2024–25లో 286 టీఎంసీలు, 2025–26లో 267 టీఎంసీలు వాడామని లెక్కలు చెప్పిన వీళ్లు, 2026–27కి వచ్చేసరికి మాత్రం 110 టీఎంసీలను 45 శాతంగా చూపుతూ రికార్డు స్థాయిలో నీళ్లు వాడామని గొప్పలు చెప్పుకుంటున్నారు.
- నా దగ్గర ఉన్న అధికారిక లెక్కలు, శాతాల ప్రకారం 2024–25లో ఆంధ్రప్రదేశ్ 718 టీఎంసీలు వాడుకుంటే, తెలంగాణ వినియోగించుకున్నది కేవలం 286 టీఎంసీలు మాత్రమే. అంటే అది 28 శాతం మాత్రమే..
- మన తాత్కాలిక కేటాయింపు 34 శాతం ఉండగా, కేవలం 28 శాతమే వాడి ఫెయిల్ అయ్యారు. 34 శాతానికి గానూ 28 శాతమే ఎందుకు వాడారని విలేకరులు నిలదీస్తారన్న భయంతోనే ఆ పర్సంటేజీని దాచిపెట్టి కేవలం 286 టీఎంసీలు అని మాత్రమే చెప్పారు.
- ఇక 2025–26లో ఆంధ్రప్రదేశ్ 771 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటే, తెలంగాణ వాడింది కేవలం 267 టీఎంసీలే. శాతంలో లెక్కిస్తే ఇది కేవలం 25 శాతం మాత్రమే.
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదిలో ఇదే అత్యంత కనిష్ట నీటి వినియోగం (ఎవర్ లోయెస్ట్). ఈ ఏడాది 45 శాతం వాడామని డబ్బా కొట్టుకుంటున్న వాళ్లు, గత ఏడాది 25 శాతానికి పడిపోయిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు?
- రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కృష్ణా నదిలో అత్యంత తక్కువ నీటిని వినియోగించుకున్న చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే మా బీఆర్ఎస్ హయాంలో మేము అనేకసార్లు 29%, 30%, 33%, 35% వరకు కృష్ణా జలాలను వినియోగించుకున్నాం.
- గత రెండేళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి 2024–25, 2025–26లలో టీఎంసీల సంఖ్య చెప్పి, 2026–27లో పర్సంటేజ్ చెప్పడమే అసలైన ‘జాదా హుషారి’. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువగా 25 శాతం నీటిని మాత్రమే వాడినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

• వాస్తవానికి ఉరి తీయాల్సింది సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డినే.!
- అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో జగన్ మోహన్ రెడ్డి ముందే కేంద్ర మంత్రిని కేసీఆర్ గారు ఎంతో స్పష్టంగా నిలదీశారు.
- నేను 42 రోజుల్లోనే ఉత్తరం ఇచ్చినా, ఏడేండ్లయినా ఇంతవరకు మీరు ట్రిబ్యునల్ వేయడం లేదు. ఒక రాష్ట్రంగా నాకు హక్కు ఉంది, కృష్ణా నదిలో నా న్యాయబద్ధమైన నీళ్లు నాకు కావాలి. ఒక సంవత్సరం దాకా ఎదురుచూసినా మీరు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే నేను సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది' అని కేసీఆర్ గారు స్పష్టంగా మాట్లాడారు.
- మరి ఈయన ఏమంటాడు? శాశ్వతంగా రాసిచ్చారు, మరణ శాసనం చేశారు, ఉరి వేయాలి అంటాడు. నిజానికి ఉరి వేయాల్సింది నిన్ను రేవంత్ రెడ్డి... నిన్ను, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే వేయాలి.
- ఆంధ్రప్రదేశ్ నాగార్జునసాగర్‌కు పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోతుంటే, కుంభకర్ణుడిలాగా నిద్రపోయినందుకు నిన్ను ఉరి వేయాలి.
- శ్రీశైలంలో నీళ్లు ఉన్నా కల్వకుర్తిలో 24 గంటలు మోటార్లు నడపకుండా, 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు పారించినందుకు నీకు ఉరి వేయాలి.
- దేవాదులలో నీళ్లు ఉన్నా ఎత్తకుండా, పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీ గురుదక్షిణ చెల్లించి, వరంగల్ జిల్లాను కరువు కాటకాలకు నిలయంగా మార్చినందుకు నిన్ను ఉరి వేయాలి.
- సీతారామ ప్రాజెక్టులో కేసీఆర్ గారు కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ప్రాజెక్టు అప్పగిస్తే, నీళ్లు ఎత్తకుండా ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసినందుకు నీకు ఉరి వేయాలి. నువ్వా మాట్లాడేది? ఇదీ మా నిబద్ధత.

• కృష్ణా జలాల్లో 299 టీఎంసీల పాపం కాంగ్రెస్ దే..
42 రోజుల్లోనే తెలంగాణ హక్కుల కోసం కొట్లాడింది కేసీఆర్.
- కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు మాత్రమే దక్కేలా చేసిన చారిత్రక తప్పిదానికి కర్త, కర్మ, క్రియ నాటి కాంగ్రెస్ పార్టీయే.
- నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన కూర్చున్న దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులే ఆనాటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి తెలంగాణ నీటి ప్రయోజనాలను దెబ్బతీశారు.
- నేను ఎప్పుడూ ఆధారాలు లేకుండా గాలిమాటలు మాట్లాడను. 2013 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పీకే మొహంతి గారు అసెంబ్లీకి, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన అధికారిక నివేదికలే దీనికి సాక్ష్యం.
- ఎమ్మెల్యేగా ఆనాడు అసెంబ్లీలో నేను తీసుకున్న ఆ అధికారిక పత్రంలోనే బచావత్ నివేదిక ప్రకారం ఉన్న 811 టీఎంసీలలో తెలంగాణకు 298.96 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలుగా స్పష్టంగా పొందుపరిచారు. నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి, అసెంబ్లీలో పెట్టిన పునర్విభజన బిల్లులో ఆ అంకెలను చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.
- ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పాలకులు కలిసి తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి మరణశాసనం రాశారు. ఇప్పుడేమో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇచ్చిన జీవోలతో తమకు సంబంధం లేదన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.
- కాంగ్రెస్ చేసిన ఈ అన్యాయాన్ని చూస్తూ మేము మౌనంగా ఊరుకోలేదు. తెలంగాణ ఆవిర్భవించిన కేవలం 42 రోజుల్లోనే అప్పటికి ఇంకా కార్యాలయాలు, ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్ల విభజన కూడా పూర్తి కాకముందే కేసీఆర్ గారు స్వయంగా ఢిల్లీకి వెళ్లారు. నాటి కేంద్ర మంత్రి ఉమాభారతి గారిని కలిసి, నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని స్పష్టం చేస్తూ, సెక్షన్-3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.
- ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో కృష్ణా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాస్తవ నీటి వాడకం 100 నుండి 125 టీఎంసీలు (కేటాయించిన 298.96 టీఎంసీలలో 113 టీఎంసీలు) కూడా దాటలేదని కేసీఆర్ ఆ లేఖలోని 10వ పేజీలో స్పష్టంగా ఎత్తిచూపారు. అంతే కాదు, 298.96 టీఎంసీలకు అదనంగా తెలంగాణకు మరో 581 టీఎంసీల నీరు అవసరమని పక్కా వివరాలతో కేంద్రానికి నివేదించారు. ఇందులో హైదరాబాద్‌కు 70 టీఎంసీలు, ఎస్ఎల్బీసీ (SLBC) విస్తరణ, కల్వకుర్తి ఫేజ్-2, కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల, జూరాల, పాలమూరు ఎత్తిపోతల, మున్నేరు, దిండి ప్రాజెక్టులతో పాటు పరిశ్రమల అవసరాలను కూడా పొందుపరిచారు.
- రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఢిల్లీ వెళ్లి నీటి హక్కుల కోసం కొట్లాడిన చిత్తశుద్ధి కేసీఆర్ గారిది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకోవడానికే మూడేళ్లు పట్టింది. నీళ్ల ఒప్పందం కాదు కదా, కనీసం కలవడానికే మూడేళ్ల సమయం తీసుకున్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ నిబద్ధతను విమర్శించడం హాస్యాస్పదం.

చంద్రబాబుకు గురుదక్షిణ కోసమే కేఆర్ఎంబీ భేటీలో నోరు మెదపలేదా?
- నిన్న జరిగిన కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు ఇద్దరూ హాజరయ్యారు. రాష్ట్రంలో ఇంత రచ్చ జరుగుతున్నా, సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ బయటకు వచ్చి 'పల్నాడు తాగునీటి పథకంపై భేటీలో అసలు చర్చే జరగలేదు, అదొక సమస్యే కాదు' అని స్పష్టంగా చెప్పారు. అంటే మన తెలంగాణ అధికారులు ఆ సమావేశానికి వెళ్లి నోరు మూసుకొని కూర్చున్నారు.
- నిన్న అంతసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పల్నాడు స్కీమ్‌ను ఆపుతానని ఒక్క మాట కూడా అనలేదు. కనీసం కేఆర్ఎంబీ సమావేశంలోనైనా మన ఇంజనీర్లు అభ్యంతరం చెప్పాలా వద్దా? ఈ పథకాన్ని ఎలా పెడతారని, తక్షణమే ఆపాలని కేఆర్ఎంబీకి ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు? ఈ ప్రాజెక్టును ఆపాల్సిన బాధ్యత కేఆర్ఎంబీదే కదా?
- ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇంజనీర్లకు అంత ధైర్యం ఎక్కడిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా చంద్రబాబుకు గురుదక్షిణలో భాగంగా ఈ పథకానికి ఒప్పుకున్నారు కాబట్టే, భేటీలో మాట్లాడొద్దని ఇంజనీర్లకు ఆదేశాలు ఇచ్చి ఉంటారు. 'మీరు నోరు మూసుకొని ఉండండి, ఏమీ మాట్లాడకండి' అని ముందే చెప్పడం వల్లే అధికారులు కనీసం పల్నాడు స్కీమ్ ఊసెత్తలేదు.
- ఒకవైపు కేఆర్ఎంబీ భేటీలో పల్నాడు పథకంపై కనీసం నోరు కూడా మెదపకుండా, మరోవైపు మాపై ఎదురుదాడి చేయడం దొంగే 'దొంగ.. దొంగ' అని అరిచినట్లుగా లేదా రేవంత్ రెడ్డి?
- ఇంకా ఉల్టా మాపై నెపం నెడుతూ 2022లోనే జీవో వచ్చిందని చెబుతున్నారు. అసలు 2022 నాటి జీవోలో నాగార్జున సాగర్ నీళ్ల గురించి ఒక్క ముక్కైనా ఉందా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని ఇంత స్పష్టంగా జీవోలో రాసింది.
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు

పల్నాడు ప్రాజెక్టును ఆపుతానని ఒక్క ముక్కైనా ఎందుకు అనలేదు?
- అసలు పల్నాడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఎప్పుడు మొదలైంది? దానిపై ఎందుకు స్పందించలేదు? నిన్న అంతసేపు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పల్నాడు తాగునీటి పథకాన్ని అడ్డుకుంటానని ఒక్క ముక్కైనా ఎందుకు అనలేదు? పైగా ఉల్టా మాట్లాడుతున్నారు.
- పల్నాడు స్కీమ్‌కు 2025 జనవరి 24నే టెండర్లు పిలిచారు. ఇదిగో టెండర్ డాక్యుమెంట్. జనవరిలో టెండర్లు పిలిస్తే అప్పటి నుంచి కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారా? మీ ఇంటెలిజెన్స్ మా ప్రతిపక్షాల వెంట పడటానికే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి పనిచేయదా?
- నవంబర్ 15, 16 తేదీల్లో పత్రికలు ఈ విషయాన్ని బయటపెట్టి, 18న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే గానీ ప్రభుత్వం కదలలేదు. కృష్ణా బోర్డు రాసిన లేఖ ప్రకారం, తెలంగాణ ఈఎన్సీ 16-11-2026 తేదీతో బ్యాక్ డేట్లో ఉత్తరం రాశారు.
- రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు, రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని ప్రజలు అల్లాడుతున్నా ముఖ్యమంత్రికి గానీ, సొంత జిల్లా నల్గొండకు అన్యాయం జరుగుతున్నా నీటిపారుదల శాఖ మంత్రికి గానీ ఏమాత్రం సోయి లేదు.
- ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ముల్లుగర్ర పట్టి పొడిస్తే తప్ప, మేం పోరాటం చేస్తామంటే తప్ప మీరు కదలరు. గతంలో కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామంటే కేసీఆర్ గారు నల్గొండలో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తర్వాతే అసెంబ్లీ పెట్టి వెనక్కి తగ్గారు.
- గోదావరిపై ఏడు ప్రాజెక్టుల రద్దు అంశమైనా, పోతిరెడ్డిపాడుకు గోదావరి నీళ్లు తీసుకుపోయే గోదావరి–బనకచర్ల అనుసంధానమైనా బీఆర్ఎస్ బయటపెడితేనే బ్యాక్ డేట్ ఉత్తరాలు రాస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మీటింగ్‌లకు వెళ్లి గోదావరి–బనకచర్లకు ఒప్పుకొని సంతకాలు పెట్టి వస్తున్నారు.
- బీఆర్ఎస్ హయాంలోనే జీవో 56 (16-02-2022) వచ్చిందని సీఎం చెబుతున్నారు. ఆ జీవోను జర్నలిస్టు మిత్రులకు పంపిస్తున్నా, చదవండి. అందులో నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామని గానీ, ఎన్ని నీళ్లు తీసుకుంటామని గానీ ఒక్క అక్షరమైనా ఉందా? చూపించగలరా? అది కేవలం ఆయా ఊళ్లలోని స్థానిక కాలువలు, చెరువుల ద్వారా వ్యక్తిగతంగా నీళ్లు తీసుకోవడానికి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక మంజూరు (ఫైనాన్షియల్ శాంక్షన్) మాత్రమే.
- జీవో 453తోనే నాగార్జున సాగర్‌కు ఎసరు: “నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద పొక్కగొట్టి నీళ్లు తీసుకుంటామని మీ ప్రభుత్వం వచ్చాక వచ్చిన జీవో నంబర్ 453 (04-08-2026)లో రెండు అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
- నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి నేరుగా 1.865 టీఎంసీల ముడి నీటిని (రా వాటర్) తీసుకునేందుకు జలవనరుల శాఖ గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అనుమతి ఇచ్చింది.
- గతంలో నాగార్జున సాగర్ కాలువ వ్యవస్థ, స్థానిక చెరువులు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ద్వారా నీటిని తీసుకునే పాత పథకాలన్నింటినీ నిలిపివేసి (డిస్కనెక్ట్ చేసి), వాటన్నింటినీ నేరుగా నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఇన్‌టేక్ సిస్టమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించింది.
- ఇంత స్పష్టంగా ఆధారాలు కళ్లముందు కనిపిస్తుంటే పాత జీవోను తెచ్చి ముఖ్యమంత్రి ‘జాదా హుషారు’ (అతి తెలివి) చూపిస్తున్నారు. దొంగ దొరికిపోయి, కుడితిలో పడ్డ ఎలక కొట్టుకున్నట్లు.. దొంగే ‘దొంగ.. దొంగ’ అని గట్టిగా అరిచినట్లుగా ఉంది వీరి కథ. ‘ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే’ అన్న చందంగా ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని మాపై బురద జల్లుతున్నారు.
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.

పాలమూరుకు 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం.. మీరు లక్ష ఎకరాలకైనా ఇచ్చారా?
- మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని, కేసీఆర్ గారు జిల్లాను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు సోయి ఉందా? నేను పూర్తి రికార్డులతో సిద్ధంగా ఉన్నాను.
- కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల 30 ఏళ్ల పాలనలో—రేవంత్ రెడ్డి గురువు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్న కాలంతో సహా—శిలాఫలకాలు వేయడం, చెట్లు నాటడం తప్ప కేవలం 30 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. పాలమూరును వలసల జిల్లాగా చేసి, ఆగంపట్టింది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలే.
- మేము రూ. 4,000 కోట్లు ఖర్చు చేసి పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. ఒక్క పాలమూరు జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి జిల్లాను పచ్చబడగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
- ప్రాజెక్టుల వారీగా మేము నీళ్లిచ్చిన ఆయకట్టు: కల్వకుర్తి: 3,07,000 ఎకరాలు నెట్టెంపాడు: 1,42,000 ఎకరాలు భీమా: 1,58,000 ఎకరాలు కోయిల్ సాగర్: 40,000 ఎకరాలు ఆర్డీఎస్ (RDS): 55,000 ఎకరాలు వీటితో పాటు చెరువులు, చెక్ డ్యాంలు, జూరాల మోడరైజేషన్ ద్వారా మొత్తం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.
- ముఖ్యమంత్రి అయి మూడేళ్లు గడుస్తోంది. నా సొంత జిల్లా అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, పాలమూరులో కనీసం లక్ష ఎకరాలకైనా కొత్తగా నీళ్లు ఇచ్చారా? కేవలం మాటలు మాట్లాడటం కాదు, ఇవి రికార్డుల్లో ఉన్న నిజాలు.
- నాడు కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఉన్న కరువు పరిస్థితుల వల్లే మా కవి గోరటి వెంకన్న "పాలమూరులో పల్లేర్లు మొలిసే" అనే పాట రాశారు. ఆ పరిస్థితికి కారకులు ఆ రెండు పార్టీలే కదా? ఆ పల్లేర్లు మొలిసిన పాలమూరులో కృష్ణా జలాలను పారించి, జిల్లాను పచ్చగా మార్చింది బీఆర్ఎస్సే.
- బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు.
తెలంగాణ సాధించడమే కేసీఆర్ చేసిన తప్పా?
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.
- మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉరి తీయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- అసలు కేసీఆర్‌ను ఉరి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ఆయన చేసిన తప్పా?
- సబ్బండ వర్ణాల ప్రజలను ఏకం చేసి, స్వరాష్ట్ర సాధన కోసం మహా ఉద్యమాన్ని నడిపించడం తప్పా?
- ప్రాణాలను సైతం పణంగా పెట్టి 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తప్పా?
- తెలంగాణ ఉద్యమ బలోపేతం కోసం ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేయడం తప్పా?
- గోదావరి జలాల్లో 968 టీఎంసీల హక్కులను కాపాడుతూ ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్-3 అమలుకు ప్రయత్నించడం తప్పా?
- తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏమిటి? నాడు సమైక్యవాదుల పక్షాన నిలిచిన మీరు, నేడు తెలంగాణ ఉద్యమకారులపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం?
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేమంతా పదవులకు రాజీనామాలు చేస్తే, మీరు మాత్రం జిరాక్స్ కాగితాలతో రాజీనామా నాటకాలు ఆడలేదా?
- తెలంగాణ ఆవిర్భవించిన కొద్ది నెలలకే నోట్ల కట్టలతో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడం మరిచిపోయారా?
- తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం, రాష్ట్ర సాధన కోసం పోరాడిన నాయకులపై ఉరి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా?

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై రేవంత్ వాదనలో డొల్లతనం!
• 2022లో తాగునీటి పనులకు పరిపాలనా అనుమతులే..
• సాగర్ జలాల తరలింపునకు ప్రత్యేక అనుమతులు 2026లోనే.!
తెలంగాణ జల హక్కుల అంశం మరోసారి రాజకీయ వివాదానికి దారితీస్తోంది. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు 2022లోనే అనుమతులు వచ్చాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2022లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను, తాజాగా నాగార్జునసాగర్ నుంచి నీటిని తరలించేందుకు తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే ఈ రెండింటి మధ్య కీలకమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
2022 జీవోలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 16న జారీ చేసిన G.O.Rt.No.56 ప్రకారం, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా కల్పించేందుకు పలు పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా పల్నాడు ప్రాంత తాగునీటి ప్రాజెక్టుకు రూ.1,200 కోట్ల ప్రతిపాదన కూడా ఉంది. కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్రం రూ.500 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.200 కోట్లు సమకూర్చాలని పేర్కొన్నారు.
అయితే ఈ జీవోలో నాగార్జునసాగర్ నుంచి నీటిని తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, నీటి తరలింపు ఏర్పాట్లు లేదా సాగర్ జలాల వినియోగానికి సంబంధించిన స్పష్టమైన అనుమతుల ప్రస్తావన కనిపించడం లేదు. అంటే గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు ఇచ్చిన పరిపాలనా ఆమోదాన్ని, సాగర్ జలాల తరలింపునకు ఇచ్చిన అనుమతిగా పరిగణించలేమన్నది ఇక్కడ కీలకమైన అంశం.
2026లోనే సాగర్ జలాల తరలింపు అంశం తెరపైకి..
ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల్లో నాగార్జునసాగర్ నుంచి 1.865 టీఎంసీల నీటిని తరలించే అంశం స్పష్టంగా ప్రస్తావనకు వచ్చింది. దీంతో 2022లో పల్నాడు తాగునీటి ప్రాజెక్టుకు ఇచ్చిన ఆమోదానికి, తాజాగా సాగర్ జలాల తరలింపునకు తీసుకున్న నిర్ణయానికి మధ్య తేడా ఉందనే విషయం చర్చనీయాంశమైంది.
2022లోనే పల్నాడు ప్రాంతానికి తాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదన ఉండటం వాస్తవమే అయినప్పటికీ, సాగర్ నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన ప్రత్యేక అనుమతులు అప్పుడే మంజూరయ్యాయని చెప్పడానికి ఆ జీవో ఒక్కటే ఆధారం కాలేదు. ఈ రెండు అంశాలను కలిపి చూపిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తెలంగాణ జల హక్కులపై కాంగ్రెస్ సర్కారు బాధ్యత ఏది?
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించిన నిబంధనలు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులపై స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణకు సంబంధించిన జల హక్కులపై ప్రభావం చూపే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది.
మరోవైపు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే కీలకం. కేఆర్ఎంబీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిందా? అవసరమైన అభ్యంతరాలు నమోదు చేసిందా? సాగర్ జలాల వినియోగంపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు ఎలాంటి న్యాయపరమైన చర్యలు చేపట్టింది? అన్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.
రాజకీయ విమర్శలు కాదు.. జల హక్కుల పరిరక్షణ ముఖ్యం!
2022 నాటి తాగునీటి ప్రాజెక్టుకు ఇచ్చిన పరిపాలనా అనుమతులను, 2026లో సాగర్ జలాల తరలింపునకు ఇచ్చిన ప్రత్యేక అనుమతులతో కలిపి చూడటం సరికాదన్నది ఈ వ్యవహారంలో ప్రధాన అంశం. గత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత తప్పిపోదు. తెలంగాణ జల ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, రాష్ట్ర హక్కులకు భంగం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ మెట్రో రుణంపై మళ్లీ సందిగ్ధత.. టేకోవర్‌కు తప్పని ఎదురుచూపులు!
• ఐఆర్ఎఫ్సీ రుణంపై తనకు తెలియదన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్..
• చర్చలు సానుకూలంగా జరిగాయన్న సీఎం రేవంత్‌రెడ్డి..
• రూ.84 కోట్ల ఫీజు చెల్లించినా ముందుకు సాగని ప్రక్రియ
హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియకు మరోసారి ఆటంకాలు ఎదురవుతున్నాయి. టేకోవర్‌కు కీలకమైన సుమారు రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ రుణం విడుదల కాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి చర్చలోకి తెచ్చాయి.
ఐఆర్ఎఫ్సీ రుణ వ్యవహారం గురించి తనకు తెలియదని, ఇది తన పరిధిలోకి రాదని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే గత జూన్‌లో రైల్వే మంత్రితో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి.. చర్చలు సానుకూలంగా జరిగాయని ప్రకటించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనల మధ్య పొంతన లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మెట్రో రీఫైనాన్సింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ.84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిందని సీఎం గతంలో వెల్లడించారు. ఈ రుణం ద్వారా ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా నిధుల విడుదలలో పురోగతి కనిపించడం లేదు.
మరోవైపు రుణం కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక సంస్థల అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎల్అండ్టీ నుంచి మెట్రో స్వాధీనానికి విధించిన గడువును కూడా 2026 డిసెంబర్ వరకు పొడిగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇక సుమారు 122 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణ కూడా కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. మొదటి దశ టేకోవర్‌లో జాప్యం రెండో దశపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
మొత్తంగా రూ.13,600 కోట్ల రుణం ఎప్పుడు విడుదలవుతుంది? ఐఆర్ఎఫ్సీతో కుదిరిన ఒప్పందం అమలవుతుందా? లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
4
260
నగరంలో మితిమీరుతున్న రౌడీ షీటర్ల ఆగడాలు..
• శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన.
• శంషాబాద్‌లో ఎంఐఎం నేత కిరాతక హత్య.
• సాయంత్రం వేళ బహిరంగంగానే కత్తులు, కత్తెరలతో 8–10 మంది దుండగుల స్వైరవిహారం.
శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయన్న ఆందోళనల నడుమ రాజధాని శివారులో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల భయం లేకుండా దుండగులు బహిరంగ ప్రదేశాల్లోనే రౌడీలు, గూండాలు మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు. తాజాగా శంషాబాద్ పరిధిలో ఎంఐఎం నాయకుడు ముర్తజా అలీ అలియాస్ ముర్తజా పహిల్వాన్‌ను ఓ ముఠా అత్యంత పాశవికంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది.
ప్రత్యక్ష సాక్షి షేక్ మహమ్మద్ అలియాస్ చోటు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6:15 గంటల ప్రాంతంలో హిమాయత్ సాగర్ ఎకో పార్క్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఈ ఘాతుకం జరిగింది. కత్తులు, కత్తెరలతో అక్కడికి చేరుకున్న 8 నుంచి 10 మంది వ్యక్తులు ఒక్కసారిగా ముర్తజాపైకి దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ముర్తజాకు భారీగా రక్తస్రావమైంది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయనను హుటాహుటిన అత్తాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
రాజేంద్రనగర్ ప్రాంత నివాసి అయిన ముర్తజా అలీ స్థానికంగా ఎంఐఎం నేతగా గుర్తింపు పొందారు. ఈ హత్యకు దారితీసిన అసలు కారణాలు ఏమిటనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే, సాయంత్రం వేళలోనే ఓ ముఠా ఇంత నిర్భయంగా మారణాయుధాలతో విరుచుకుపడి ప్రాణాలు తీయడం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.
తెలంగాణలో గాడితప్పుతున్న శాంతిభద్రతలు..
• గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.!
• ఫోన్ చేసి బయటకు పిలిచి కత్తులతో పొడిచి చంపిన నలుగురు దుండగులు
సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఘాతుకం.. నిందితుల కోసం పోలీసుల గాలింపు.
నివాస ప్రాంతాల్లోనే అర్ధరాత్రి వేళ మారణాయుధాలతో స్వైరవిహారంపై స్థానికుల ఆందోళన.
తెలంగాణలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనడానికి నిదర్శనంగా పెద్దపల్లి జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోదావరిఖనిలోని పవర్ హౌస్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఓ సింగరేణి ఉద్యోగిని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్ (30) పవర్ హౌస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. నవంబర్ 23 తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో నలుగురు యువకులు రాజశేఖర్‌కు ఫోన్ చేసి ఇంటి బయటకు పిలిపించారు. బయటకు వచ్చిన ఆయనపై ఏమాత్రం కనికరం లేకుండా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి, అక్కడికక్కడే హతమార్చారు. అనంతరం నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు..
నివాస ప్రాంతంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా నమోదయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు, ఆ ఆధారాలతో పరారీలో ఉన్న నలుగురు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పెరుగుతున్న నేరాలతో ప్రజల్లో భయాందోళన..
రాష్ట్రంలో ఇటీవలి కాలంలో హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం జనసంచారం ఉండే నివాస కాలనీల్లోనే అర్ధరాత్రి వేళ దుండగులు ఏమాత్రం భయం లేకుండా మారణాయుధాలతో దాడులకు పాల్పడటం శాంతిభద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా కొరవడటం వల్లే నేరగాళ్లు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కార్తీక పౌర్ణమి శోభతో పులకించిన తెలుగు రాష్ట్రాలు..
• తెల్లవారుజాము నుంచే ప్రముఖ శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తజనం
• గోదావరి, కృష్ణా తీరాల్లో పుణ్యస్నానాలు.. జలాలపై తేలియాడిన కార్తీక దీపాలు
• తులసి, ఉసిరి చెట్ల వద్ద 365 వత్తులతో మహిళల విశేష దీపారాధనలు
కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేకువజామున బ్రహ్మముహూర్తం నుంచే భక్తులు భారీ సంఖ్యలో శివాలయాలకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణాలు ‘ఓం నమః శివాయ’, ‘హరహర మహాదేవ’ నామస్మరణతో మారుమోగుతున్నాయి.
• తెలంగాణ శైవ క్షేత్రాల్లో భక్తుల కోలాహలం..
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనంతో పాటు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, చారిత్రక హనుమకొండ వేయి స్తంభాల గుడిలో (శ్రీ రుద్రేశ్వర స్వామి) తెల్లవారుజాము నుంచే విశేష అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
• శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామాల్లో బారులు..
ఆంధ్రప్రదేశ్‌లో జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల కోసం భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. మరోవైపు పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా కార్తీక పౌర్ణమి నాడు ఒకే రోజు ఐదు పంచారామాలను దర్శించుకునే భక్తుల రాకతో ఆయా క్షేత్రాల వద్ద సందడి నెలకొంది.
• నదీ స్నానాలు.. 365 వత్తుల దీపారాధన..
పౌర్ణమి పుణ్యదినాన గోదావరి, కృష్ణా నదీ తీరాల్లోని స్నానఘట్టాలు భక్తులతో నిండిపోయాయి. చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదీ జలాల్లో వదులుతూ వరుణ దేవునికి, శివకేశవులకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణాలు, గృహాల్లోని తులసి, ఉసిరి చెట్ల వద్ద మహిళలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందన్న విశ్వాసంతో 365 వత్తులతో కూడిన ప్రత్యేక దీపాలను వెలిగించారు. సాయంత్రం పలు ప్రధాన శివాలయాల్లో నిర్వహించనున్న ‘జ్వాలా తోరణం’ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
• అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు..
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని ముందుగానే అంచనా వేసిన దేవాదాయ శాఖ, ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం, ప్రసాద వితరణలో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. నదీ ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రధాన ఆలయాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
నిన్న బీఆర్ఎస్లో చేరిక.. నేడు ఏకశిలా విద్యాసంస్థలపై విద్యాశాఖ ఆరా.!
బీఆర్ఎస్లో చేరిన మరునాడే ఏకశిలాపై విచారణ.. కక్ష సాధింపేనంటున్న విమర్శకులు.
టీఎస్ఎఫ్ ఫిర్యాదుతో ఏకశిలా విద్యాసంస్థలపై విద్యాశాఖ దర్యాప్తు.
ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరిన మరుసటి రోజే, ఆ విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్యలు ప్రారంభించగా, పార్టీలో చేరిన వెంటనే విచారణ జరపడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనమని పలు రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే, గౌరు తిరుపతిరెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ మరుసటి రోజే ఏకశిలా విద్యాసంస్థల పనితీరుపై విద్యాశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ విద్యాసంస్థల్లో ఫీజుల వసూలు, ఉపాధ్యాయుల నియామకాలు, విద్యాశాఖ నిబంధనల ప్రకారం అనుమతులు తదితర అంశాలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కన్నం సునీల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును స్వీకరించిన విద్యాశాఖ అధికారులు విచారణ ప్రక్రియను చేపట్టారు. దీనిపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారాన్ని వెల్లడిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలో చేరిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగడం రాజకీయ భయంతో చేస్తున్న కక్ష సాధింపు చర్యగా విమర్శకులు పేర్కొంటుండగా, నిబంధనల మేరకు అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది.
సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందన..
• రేపు ఆధారాలతో సమాధానమిస్తానంటూ ప్రకటన.
కృష్ణా నది జలాల అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదాలో ఉండి అవాస్తవ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
సీఎం చేసిన ప్రతి ఆరోపణకు, ప్రతి అసత్య ప్రకటనకు తగిన ఆధారాలతో సహా బదులిస్తానని హరీశ్ రావు స్పష్టం చేశారు.
ఇందుకోసం రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగించింది కేసీఆర్, హరీశ్ రావులేనంటూ అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా హరీశ్ రావు ఈ ట్వీట్ చేశారు.
ఉరేసినా, కోదండం వేసి కొట్టినా ఆ ఇద్దరికే వర్తిస్తుంది.!
- కృష్ణా జలాలపై రేవంత్ ఫైర్..
కృష్ణా నది జలాల అంశంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిందెవరైనా ఉన్నారంటే, అది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర నీటి హక్కులను జలసమాధి చేసింది ఆ ఇద్దరేనని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విషయంపై సీఎం మాట్లాడుతూ, "ఉరేసినా, కోదండం వేసి కొట్టినా ఇది వాళ్లిద్దరికే వర్తిస్తుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

విమర్శల వేళ ‘అనుముల’ ఐక్యత సందేశం..
• తిరుపతి రెడ్డి పోస్ట్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ.!
రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తన సోదరులతో కలిసి ఉన్న అరుదైన పాత ఫోటోను పంచుకుంటూ, ‘‘ఫోటో పాతదైనా మా మధ్య ప్రేమ, అనుబంధం ఏమాత్రం మారలేదు.. నా సోదరులే నా బలం’’ అంటూ ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ‘అనుముల సోదరుల’ చుట్టూ ఆరోపణలు ముసురుకుంటున్న తరుణంలో ఈ పోస్ట్ చేసిన సమయం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్ని రాజకీయ విమర్శలు, ఒత్తిళ్లు ఎదురైనా సోదరులంతా ఐక్యంగా, ఒకరికొకరు అండగా నిలబడతామనే బలమైన సంకేతాన్ని ప్రత్యర్థులకు పంపేందుకే ఆయన ఈ పోస్ట్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2
3
1,421
స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తే సైన్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే ఏమో ఈ డైలాగ్ దెబ్బకి.!!
రాజకీయాల్లో భావోద్వేగ డైలాగులు చప్పట్లు తెప్పిస్తాయి కానీ.. ప్రజల జీవితాలను మార్చేది మాత్రం పాలన, నిధులు, అభివృద్ధి పనులే.
బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రిగా ప్రజల అసలు సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి, ప్రతి సభలో ఇలాంటి మతపరమైన నినాదాలకే పరిమితం అవ్వడం ఎంతవరకు సమంజసం.?
విధానాలను సమర్థించడం ప్రభుత్వ బాధ్యత.. వాటిని ప్రశ్నించడం ప్రజల హక్కు. ప్రశ్నించే ప్రతి గొంతుకను దేశద్రోహంతో ముడిపెడితే ప్రజాస్వామ్యంలో చర్చకు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఎక్కడ.!? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నుంచి ప్రజలు ఆశించేది రాజకీయ విమర్శలు కాదు.. బాధ్యతాయుతమైన సమాధానాలు.
1
5
606
నీటిపై తేలుతున్న రహదారి.. మేఘాల్లో ప్రయాణిస్తున్న అనుభూతి.!
ఒకవైపు నీలి సరస్సు.. మరోవైపు మేఘాలను తాకేలా కనిపించే కొండలు.. మధ్యలో నీటిపై తేలుతున్నట్టుగా సాగిపోయే రహదారి.
చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్, చిజౌలో ఉన్న పింగ్టియన్ సరస్సుపై నిర్మించిన ఈ 'స్కై రోడ్' ప్రకృతి అందాలకు, ఇంజినీరింగ్ అద్భుతానికి అద్దం పడుతోంది. ఈ దారిపై ప్రయాణిస్తుంటే నీటిపై, మేఘాల మధ్య తేలుతూ వెళ్తున్న అనుభూతి కలగడం ఖాయం.
చూడటానికి ఓ కలల ప్రపంచంలా ఉన్న ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.