Bolisetty Satyanarayana (@bolisetti_satya) header
Bolisetty Satyanarayana (@bolisetti_satya) profile picture

Environment Conservationist & a Jansainik

India
Joined May 2015
Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)Photo by Bolisetty Satyanarayana (@bolisetti_satya)
గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ​పర్యావరణ పరిరక్షణ మరియు మానవ హక్కుల కోసం రాష్ట్ర మరియు దేశ స్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలనే నా అభ్యర్థనను మన్నించి, నన్ను పార్టీ బాధ్యతల నుండి విముక్తుడిని చేసినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ పరంగా దూరమైనా, సిద్ధాంతాల పరంగా మన అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ​మనల్ని కలిపిన, మనం కలిసి పనిచేద్దాం అనుకున్న పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం కోసం నేను కోరగానే నన్ను పదవి బాధ్యతల నుంచి విముక్తుడిని చేస్తూ, పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయడానికి మీరు చూపిన చొరవకు కృతజ్ఞతలు. ముఖ్యంగా కొల్లేరు సరస్సు రక్షణ విషయంలో, రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ మరియు భూ నిర్వాసితుల సమస్యల విషయంలో మీరు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నందున మరింత చొరవ చూపి ఆ సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. ​అలాగే, పర్యావరణ ప్రభావ అంచనాలు (Environmental Impact Assessment) లేకుండా చిత్తడి నేలలను ఆక్రమించడం, వ్యవసాయ భూముల భూ వినియోగ మార్పిడి (Land Use Conversion) వంటి వాటిని నిరోధించి, ప్రకృతిని కాపాడే విషయంలో మీ వంతు బాధ్యతను మీరు చిత్తశుద్ధితో నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. వ్యక్తిగత సిద్ధాంతాలకు మరియు సామాజిక బాధ్యతకు విలువనిస్తూ నా నిర్ణయాన్ని ఆమోదించిన మీ పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు. ​ఇట్లు, బోలిశెట్టి సత్యనారాయణ @PawanKalyan @APDeputyCMO @JanaSenaParty @JSPShatagniTeam @JSPVeeraMahila @JSPTelangana #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం
104
477
46
2,710
353,143
ఇప్పుడు విజయవాడ మేయర్ అభ్యర్థి అయిన ఏబీ వెంకటేశ్వర రావు గారికి నేను జనవరి నెలలో విసిరిన సవాల్ కు ఆయన ఇప్పటి వరకు సమాధానం లేదు.. ఎన్నికల తర్వాత ఆయన ఎలాగూ కాలిగా ఉంటారు కాబట్టి ఓ సారి గుర్తు చేస్తున్నా.. @ourvmc elections
మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి నా బహిరంగ సవాల్. అబద్ధపు ఆరోపణలు ఇక చాలు - వాస్తవాలు మాట్లాడదాం రండి.. అమరావతి రాజధాని విషయంలో నాపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ​అమరావతిలోనే రాజధానిగా ఉండాలని, రైతుల పక్షాన నేను ఎప్పుడూ నిలబడ్డాను. నేను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్ మరియు పర్యావరణ రక్షణ కోసం మాత్రమే! వైసీపీ పాలనలో మీరు కలుగులో దాక్కున్న సమయంలో.. జగన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా, మడ అడవుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది నేను.. అలాంటి నేను @ysjagan మనిషినా? సంస్కారం లేకుండా ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పు. పర్యావరణ పరిరక్షణ మరియు రాజ్యాంగ రక్షణే నా ఏకైక లక్ష్యం. ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను.. ​మీ కట్టుకథలను పక్కన పెట్టి, తక్షణమే మీరు నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి. లేదంటే, మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రండి? సమయం, వేదిక మీరే నిర్ణయించండి! Open Challenge to Former DGP AB Venkateswara Rao ​Enough of these false allegations—let’s talk facts. ​The allegations you are making against me regarding the Amaravati capital issue are completely baseless. ​I have always stood by the farmers and supported Amaravati as the capital. The cases I filed were solely intended to protect the Jaribu lands and the floodplains of Amaravati. ​While you were hiding in a hole during the YCP regime, I was the one who fought bravely against the atrocities of the Jagan Reddy government and for the protection of mangrove forests. Does that sound like I am @ysjagan’s man? ​My only goals are environmental conservation and protecting the Constitution. I will not compromise with anyone on these matters. ​Put aside your fabrications and immediately withdraw your comments and apologize. Otherwise, I challenge you to a public debate in front of the media. ​You decide the time and the venue! ​#Amaravati #ABVenkateswaraRao #BolisettySatyanarayana #PoliticalChallenge #SaveEnvironment #AndhraPradeshPolitics #TruthPrevails
5
79
279
15,695
పొత్తు ధర్మాన్ని పాటించిన ప్రతిచోటా కూటమి నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం మనమంతా నిబద్ధతతో కృషి చేద్దాం. ఎక్కడైతే జనసేన పార్టీకి 30% వాటా దక్కలేదో, అక్కడ ఆ మేరకు జనసైనికులు, వీర మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేద్దాం. అయితే, విశాఖపట్నం విషయంలో నా వైఖరి ప్రత్యేకం. విశాఖ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, సింహాచలం కొండలను కాపాడతాను, సహజ వనరులను రక్షిస్తాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కృషి చేస్తానని బహిరంగంగా ప్రకటించిన మహిళా కార్పొరేటర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను. ఆమె వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే, విశాఖ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేను. విశాఖ పర్యావరణం, సింహాచలం కొండలు, సహజ వనరులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఆమె చేసిన హామీలను పరిగణనలోకి తీసుకుని, విశాఖ మేయర్ ఎంపికపై ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని వినమ్రంగా కోరుతున్నాను. బొలిశెట్టి సత్యనారాయణ #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం @JanaSenaParty @PawanKalyan
53
90
14
386
30,614
ఈరోజు ఇంద్రాణి గారు మన మధ్య లేకపోయినా, @PawanKalyan గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆమె ఆకాంక్ష కొంత వరకూ నెరవేరింది ఆయన ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండటం ఆమె ఆత్మకు కొంత సంతోషాన్ని కలిగిస్తుందనే భావిస్తున్నాను. నల్లా శ్రీధర్ గారు, ఆయన సతీమణి స్వర్గీయ నల్లా ఇంద్రాణి గారు అమలాపురంలో @JanaSenaParty బలోపేతానికి చేసిన కృషిని అక్కడి జనసైనికులు, వీర మహిళలు, నాయకులు ఎప్పటికీ మరచిపోలేరు. అలాంటి ఇంద్రాణి గారి భర్త నల్లా శ్రీధర్ గారు ఈ రోజు అమలాపురం మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేయడం, అమలాపురంలో జనసేనను బలహీనపరచాలని ప్రయత్నించిన వారు పార్టీని వీడి వెళ్లిపోవడం అన్నీ శుభసూచనలే ఆమె ఆశయాలకు మరింత బలాన్ని చేకూర్చే పరిణామాలుగానే భావిస్తున్నాను. తుఫాను ప్రభావంతో రహదారులు దెబ్బతినడం వల్ల, ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు అమలాపురంలో నల్లా శ్రీధర్ గారిని స్వయంగా కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. జనసేన పార్టీ నుండి అమలాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లా శ్రీధర్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ, నా మద్దతును తెలియజేస్తూ ఈ వీడియోను మీతో పంచుకుంటున్నాను. ✊ @JanaSenaParty @PawanKalyan @NallaSridharJSP #Amalapuram #VoteForNallaSridhar #VoteForGlass #VoteForJanasena #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం
అమలాపురం @JanaSenaParty సీనియర్ నాయకులు నల్లా శ్రీధర్ గారి శ్రీమతి స్వర్గీయ ఇంద్రాణిగారి పెదకర్మ కార్యక్రమానికి ముఖ్య నాయకులతో వెళ్లి @PawanKalyan గారి తరపున, పార్టీ తరపున శ్రద్ధాంజలి ఘటించిన సందర్భంగా స్వర్గీయ నల్లా సూర్యచంద్ర గారి కుమారులను, నల్లా విష్ణు గారిని కలవడం జరిగింది
1
47
183
5,206
ఈరోజు విజయవాడకు వచ్చి, మిత్రులు అనుమోలు గాంధీ గారితో కలిసి వంగవీటి రాధాకృష్ణ గారిని స్వయంగా కలిసి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు, సమగ్ర సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించిన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గారి నాయకత్వం నగరానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. @JanaSenaParty సిద్ధాంతాలకు, అధ్యక్షులు @PawanKalyan గారి భావజాలానికి, ఆశయాలకు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారి నిస్వార్థ రాజకీయ నాయకత్వం తోడైతే విజయవాడ ప్రజల భద్రతతో పాటు నగర ఉజ్వల భవిష్యత్తుకు, సమగ్ర సుస్థిర అభివృద్ధికి బాటలు పడటం కాయం అని విశ్వసిస్తున్నాను. ✊ Elect @VangaveetiOffl as #Mayor @ourvmc
7
208
1
1,347
15,408
మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారూ..! విజయవాడ మేయర్‌గా ఒక్క అవకాశం ఇస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తానని గప్పాలు కొట్టడం కాదు.. అది ఎలా సాధ్యమో కార్యాచరణతో వివరించండి! అంటూ వీడియో రిలీజ్ చేసిన బొలిశెట్టి సత్యనారాయణ మేయర్‌కు అధికారులపై ప్రశ్నించే, అభివృద్ధి పనులను పర్యవేక్షించే, అవినీతిపై విచారణ కోరే అధికారాలు ఉంటాయి. కానీ అధికారులను స్వయంగా సస్పెండ్ చేయడం, కాంట్రాక్టులు రద్దు చేయడం, అవినీతిని ఒంటరిగా నిర్మూలించడం సాధ్యం కాదు. చట్టబద్ధ అధికారాలు, వ్యవస్థల సహకారం అవసరం. ఈ విషయాన్ని మధ్య పెట్టి నేనే అవినీతిని అరికడతానని గ్యాస్ కొట్టడం మంచిది కాదని నా అభిప్రాయం డీజీపీగా, ACB అధిపతిగా ఉన్నప్పుడు మీ అధికారాలను అవినీతి నిర్మూలనకు ఎంతవరకు వినియోగించారన్న ప్రశ్నలతో పాటు, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి కొమ్ముకాశారనే విమర్శలూ మీపై ఉన్నాయి. వాటికి మీ సమాధానమేమిటి? ప్రజలకు కావాల్సింది అసాధ్యమైన హామీలు కాదు.. గత పనితీరుకు లెక్కలు, భవిష్యత్తుకు స్పష్టమైన కార్యాచరణ, పారదర్శక పాలన! అవినీతిని అంతం చేస్తాననడం కాదు.. మీ చట్టబద్ధ అధికారాలతో దాన్ని ఎలా తగ్గిస్తారో ప్రజలకు వివరించండి! మరో మేయర్ అభ్యర్థి తన తండ్రి స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారి అడుగుజాడల్లో నడుస్తూ, విజయవాడ శాంతిభద్రతలకు ప్రాధాన్యమిచ్చే వంగవీటి రాధాకృష్ణ గారి అవసరం నేడు విజయవాడకు ఉందని నా అభిప్రాయం. ఈ అంశాలపై నేను విడుదల చేసిన వీడియోలో నా అభిప్రాయాలను స్పష్టంగా వివరించాను. ప్రజలు తీసుకొనే నిర్ణయం విజయవాడ భవిష్యత్తుకు పునాది అవుతుంది #VijayawadaMayor
14
126
3
592
26,303
పెట్టుబడుల పేరుతో ప్రకృతిని నిర్లక్ష్యం చేసే విధానాన్ని ఇకనైనా ఆపేయండి! పంచభూతాలను నిత్యం పూజించే భారతదేశం చిన్న దేశమైన ఫిన్‌లాండ్‌ను చూసి నేర్చుకోవాలా? అంటే.. సమాధానం "అవును" అనే వస్తోంది! ఇది చాలా బాధాకరం ☹️ theguardian.com/environment/… instagram.com/reel/De12NSvI8… ఫిన్‌లాండ్‌లో గూగుల్‌ డేటా సెంటర్‌ కోసం 2.5 లక్షల చెట్లు నేలకూలాయి! "ది గార్డియన్‌" ప్రచురించిన కథనం ప్రకారం, ఉత్తర ఫిన్‌లాండ్‌లోని ముహోస్‌ సమీపంలో సుమారు 815 ఎకరాల అడవి నాశనమైంది. అవసరమైన పర్యావరణ ప్రభావ అంచనాలు పూర్తికాకముందే గూగుల్ సంస్థ పనులు చేపట్టడంతో, అధికారులు పనులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. మరో ప్రాంతంలోనూ అడవుల నరికివేతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 93,000 మందికి పైగా ప్రజలు కఠిన నియంత్రణలు కోరుతూ పిటిషన్‌పై సంతకాలు చేశారు. తమ అడవులను కాపాడుకోవడానికి ఫిన్‌లాండ్‌ ప్రజలు పోరాడుతున్నారు. మనం మాత్రం చోద్యం చూస్తున్నాం!! అందుకే 2026 పర్యావరణ పనితీరు సూచీలో (EPI) ఫిన్‌లాండ్‌ 71.04 స్కోరుతో 4వ స్థానంలో ఉంటే, భారతదేశం 22.46 స్కోరుతో 177 దేశాల్లో 176వ స్థానంలో ఉంది! ఇప్పటికే తీవ్ర పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మన దేశంలో, పెట్టుబడుల కోసం పరుగులు తీస్తూ ప్రకృతిని మరింత నిర్లక్ష్యం చేస్తే మన భావి తరాల భవిష్యత్తు ఆగమ్యాగోచరం అవుతుంది పుట్టిన ఊరు వదిలి వలసపోవలసి వస్తుంది. చినబాబు గారికైనా, కంబాలకొండ ఎకో సెన్సిటివ్‌ జోన్‌లో డేటా సెంటర్‌ నిర్మాణాన్ని ఆపితే ఆగదు అన్న ధోరణితో వ్యవహరిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికైనా, ఆయన బంధువైన మన విశాఖపట్నం ఎంపీ గారికైనా ఈ ప్రమాద తీవ్రత ఎప్పుడు అర్థమవుతుంది? వీళ్ళకి పెట్టుబడులే ప్రధానమా? ప్రజల జీవితాలు, పర్యావరణ పరిరక్షణ పట్టదా? ప్రపంచ పర్యావరణ పనితీరు సూచీలో ఇప్పటికే అట్టడుగున ఉన్న దేశ పర్యావరణ వ్యవస్థని, ప్రకృతిని అభివృద్ధి పేరుతో మరింత విధ్వంసం చేయకూడదన్నదే మా ఆవేదన! విశాఖపట్నం అంటే కేవలం పరిశ్రమలు, ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు, పెట్టుబడుల గమ్యస్థానం మాత్రమే కాదు. అది మన కొండలు, అడవులు, జలాశయాలు, జీవవైవిధ్యం, స్వచ్ఛమైన గాలి, మన పిల్లల భవిష్యత్తు! కంబాలకొండ పర్యావరణ సున్నిత ప్రాంతం, ముడసర్లోవ జలాశయం, గంభీరం గెడ్డ పరీవాహక ప్రాంతాలు వంటి సహజ వనరులను కాపాడుకోలేకపోతే, రేపు మనం సాధించే అభివృద్ధి ఎవరి కోసం? నీటి వనరులపై ఒత్తిడి పెరిగితే డేటా సెంటర్లు ఎలా పనిచేస్తాయి? చెట్లు లేని కొండల్లో మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గుర్తుంచుకోండి… చెట్టును నరకడానికి కొన్ని నిమిషాలు చాలు. కానీ ఒక అడవి పర్యావరణ వ్యవస్థను తిరిగి నిర్మించడానికి దశాబ్దాలు పట్టవచ్చు! ప్రభుత్వాలు మారవచ్చు… పాలకులు మారవచ్చు… పెట్టుబడులు రావచ్చు, పోవచ్చు. కానీ నాశనమైన ప్రకృతి, కలుషితమైన నీరు, కోల్పోయిన జీవవైవిధ్యం మన తదుపరి తరాలకు తిరిగి అందించలేని నష్టాన్ని మిగల్చవచ్చు. ప్రజలారా, మేల్కొందాం! పార్టీలకు అతీతంగా ప్రకృతిని కాపాడుకుందాం. అభివృద్ధిని వ్యతిరేకించకుండా, పర్యావరణ చట్టాలను గౌరవించే, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే, ప్రజల నీరు–గాలి–భూమి హక్కులను కాపాడే అభివృద్ధిని డిమాండ్ చేద్దాం. ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం. పర్యావరణ ప్రభావ అంచనాలు, నీటి లభ్యత, అటవీ సంరక్షణ, ప్రజాభిప్రాయ సేకరణ వంటి అంశాలపై పారదర్శకత కోరుదాం. ప్రకృతిని కాపాడటం ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ బాధ్యత కాదు. ఇది ప్రతి పౌరుడి ధర్మం! ఫిన్‌లాండ్‌ ప్రజలు తమ అడవుల కోసం గళమెత్తుతున్నారు. మరి మన విశాఖపట్నం కోసం, మన ఆంధ్రప్రదేశ్‌ కోసం, మన భారతదేశం కోసం మనం ఎప్పుడు గొంతెత్తుతాం? అడవులు ఉంటేనే వర్షాలు… నీరు ఉంటేనే జీవితం… ప్రకృతి ఉంటేనే భవిష్యత్తు! మనకు కావలసింది పెట్టుబడుల వృద్ధి మాత్రమే కాదు… ప్రకృతితో సహజీవనం చేసే అభివృద్ధి! ముఖ్యమంత్రి గారూ, ఒక సామాన్య పౌరుడిగా మిమ్మల్ని కోరుతున్నాను — ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపండి. పర్యావరణ చట్టాలను గౌరవిస్తూ, ప్రజల నీరు, గాలి, జీవన హక్కులను కాపాడండి. మీరు ప్రజల ఆందోళనలను పట్టించుకోకపోతే, ప్రకృతిని కాపాడేందుకు ముందుకొచ్చే వారికే ప్రజలు తమ మద్దతు అందిస్తారు. #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం #SaveVizag #StopVizagDataCenters in #EcoSensitiveZone #ProtectKambalakonda #SaveMudasarlova #EnvironmentalProtection #DevelopmentWithEnvironment
4
24
83
3,183
ఒకవైపు అర్ణబ్ తుఫాను భయం … మరోవైపు కూటమిలో క్షేత్ర స్థాయిలో అసంతృప్తి జ్వాలల భయం మరోవైపు! రెండు భయాల మధ్య మూడు పార్టీల నాయకుల ప్రశాంతమైన మీడియా సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎన్నికల ప్రాముఖ్యత, కూటమి ఐక్యత, పార్టీ బలోపేతం గురించి మాట్లాడిన తీరు అభినందనీయం. 👏🙏 youtube.com/live/4aCBOb9yQJ8… ముందుగా అనుకున్న కూటమి పొత్తు ధర్మం ప్రకారం 60% టీడీపీ, 30% జనసేన, 10% బీజేపీకి మధ్య సీట్ల పంపకం జరిగి ఉంటే బాగుండేదన్నది. సరే ఆ విషయాన్ని టీడీపీ జనసేనపై స్థానికంగా చేస్తున్న దాడులను కాసేపు పక్కనపెడదాం. సమాజంలో మార్పు కోరే వ్యక్తిగా జనసేన శ్రేయోభిలాషిగా, జనసేన సైన్యం తరపున ఒక ప్రశ్న.. జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయన్నదే కాదు, వచ్చిన సీట్లలో పార్టీ కోసం కష్టపడిన జనసైనికులకు, వీర మహిళలకు ఎన్ని ఇచ్చాం అన్నదే ముఖ్యం? వేలాదిమంది సభ్యులను చేర్పించి, పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతానికి శ్రమించిన వారిని పక్కనపెట్టి, ఇతర పార్టీల నుంచి అరువు తెచ్చుకుని జనసేన బీ-ఫారాలు ఇవ్వడం వల్ల జనసేన పార్టీ ఎలా బలపడుతుందన్న విషయంపై జనసేన నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు బాగా అవగాహన ఉన్న అనేక నియోజకవర్గాలలో ఒకటైన నేను నివసించే విశాఖపట్నం ఈస్ట్ నియోజకవర్గమే ఒక ఉదాహరణ. ఆరు సీట్లు ఇవ్వాల్సిన చోట చంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని రెండు మాత్రమే ఇచ్చారు. ఆ రెండింటిలోనూ 6,000 మంది సభ్యులను చేర్పించి, పార్టీ కోసం కష్టపడిన సిట్టింగ్ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారిని, అర్హులైన వీరమహిళలకు అవకాశం ఇవ్వకుండా, ఇటీవల వైసీపీ నుంచి వచ్చిన మహిళకు అవకాశం ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేమిటో..అది పార్టీకి ఏ విధంగా బలోపేతం చేస్తుందో స్థానిక, రాష్ట్ర నాయకత్వాలు జనసైనికులకు వీరమహిళలకు స్పష్టం చేయాలి. ఇది పార్టీ కోసం కష్టపడిన వారి శ్రమకు గుర్తింపు, కార్యకర్తల ఆత్మగౌరవం, పార్టీ భవిష్యత్తుకు సంబందించిన ప్రశ్న. ఒకవేళ సీట్ల కేటాయింపులో పొరపాట్లు జరిగాయని ఇప్పటికైనా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భావిస్తే, వాటిని సరిదిద్దేందుకు, భవిష్యత్తులో అటువంటివి జరగకుండా నిరోధించేందుకు తీసుకోబోయే చర్యలను స్పష్టంగా త్వరలో ప్రకటించాలి. అలా చేయడం వల్ల జనసైనికులు, వీర మహిళలు తమకు జరిగిన అన్యాయంపై సరైన వివరణ, భవిష్యత్తుపై భరోసా పొందిన ఆత్మగౌరవంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి కూటమి అభ్యర్థులకు మద్దతుగా పనిచేయగలరు. జనసేన అభ్యర్థుల విజయానికి తమ శక్తిని వినియోగించగలరు మీరు మీ 100% స్టైక్ రేట్ సాధించవచ్చు. కేంద్ర స్థాయిలో కూటమి ఐక్యత ఎంత ముఖ్యమో.. క్షేత్ర స్థాయిలో కూడా జనసైనికుల ఐక్యత ఆత్మగౌరవం కూడా అంతే ముఖ్యం.. పార్టీ బలోపేతం అంటే ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకురావడం మాత్రమే కాదు. పార్టీని నమ్ముకుని, పదవులు ఆశించకుండా, కష్టకాలంలోనూ జెండాను మోసిన కార్యకర్తల ఆత్మగౌరవం నిలబెట్టడం కూడా! పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై స్పష్టతనిచ్చి, కార్యకర్తల ఆవేదనకు పరిష్కారం చూపిస్తారని ఒక శ్రేయోభిలాషిగా కోరుకుంటున్నాను. @PawanKalyan @JanaSenaParty @ncbn @JaiTDP @narendramodi @BJP4India #NDAAlliance
15
124
6
437
27,839
దేవుడి ఆస్తులపై "సుప్రీంకోర్టు తీర్పు" ఆలయ ఆస్తుల పరిరక్షణకు కీలకమైన న్యాయ సూత్రం! 16 అక్టోబర్ 2026న K. Ramalingam and Others v. Government of Tamil Nadu and Others కేసులో గౌరవనీయ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, దేవాదాయ ఆస్తుల నిర్వహణలో చట్టబద్ధమైన బాధ్యతలను మరోసారి స్పష్టం చేసింది. share.google/ft5IFsSrI6RqCLy… ఈ తీర్పులో సుప్రీంకోర్టు ప్రధానంగా పేర్కొన్న అంశాలు: ప్రభుత్వం సంరక్షకుడే: ఆలయ ఆస్తుల విషయంలో ప్రభుత్వం యజమానిగా కాకుండా, సంబంధిత చట్టానికి లోబడి సంరక్షకుడిగా, నియంత్రణాధికారిగా వ్యవహరించాలి. దేవుడి ఆస్తులు దేవుడికే అంకితం: ఆలయ ఆస్తులను ధర్మకర్తలు లేదా అధికారులు తమ ఇష్టానుసారం బదిలీ చేయలేరు. సంబంధిత చట్టం, ఆస్తి స్వభావం, వర్తించే నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉండాలి. ఆలయ ప్రయోజనాలే ప్రాధాన్యం: దేవాదాయ ఆస్తుల నిర్వహణలో ఆలయ ప్రయోజనాలు, ఆస్తుల పరిరక్షణ, చట్టబద్ధమైన ప్రక్రియలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది. ఈ తీర్పు మనకు గుర్తుచేస్తున్న విస్తృతమైన బాధ్యత ఏమిటంటే ప్రజల విశ్వాసంతో సమకూరిన ఆలయ ఆస్తులు, సహజ వనరులు, పర్యావరణ సంపదను చట్టబద్ధంగా పరిరక్షించడం. అభివృద్ధి అవసరమే. అయితే అది చట్టబద్ధతను, పర్యావరణ సమతుల్యతను, భవిష్యత్ తరాల ప్రయోజనాలను విస్మరించకూడదు. మన రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయ ఆస్తులు, పర్యావరణం, ప్రజా ప్రయోజనాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ✊ గమనిక: ఈ పోస్ట్ సుప్రీంకోర్టు తీర్పులోని సాధారణ న్యాయ సూత్రాలపై మాత్రమే ఆధారపడి ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న W.P. (PIL) No. 137 of 2026లోని వివాదాస్పద అంశాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. ఆ కేసులోని అంశాలపై తుది నిర్ణయం గౌరవనీయ న్యాయస్థానానిదే. #SaveTempleLands #EnvironmentProtection #RuleOfLaw #SupremeCourtJudgment #PublicInterest
1
8
37
1,809
Bolisetty Satyanarayana retweeted
🚨 జనసేన పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ కూడా క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు న్యాయం జరగలేదు.. వాళ్ళు జెండాలు మోసే వాళ్ళలా మిగిలిపోతున్నారు దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ లేనట్లే.. వీర మహిళ అవేదన..! #LocalBodyElections2026 #Denduluru
1
50
4
140
3,870
అత్యవసర ప్రెస్ రిలీజ్ - 26 అక్టోబర్ 2026 సైక్లోన్ అర్నాబ్ ముప్పు నేపథ్యంలో ఎన్నికల పనులను కనీసం ఒక వారం వాయిదా వేయాలని ముఖ్యమంత్రి గారిని కోరిన పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్ అర్నాబ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సన్నద్ధతను సమీక్షించి 21 ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించడం స్వాగతించదగినది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల విపత్తు నిర్వహణ పనులు ప్రభావితం కావచ్చని పర్యావరణ పరిరక్షకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ, “అక్టోబర్ 27, 28 తేదీల్లో ఉత్తరాంధ్ర, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఎన్నికల సంబంధిత పనులు కొనసాగితే అధికారులు రెండు విధుల మధ్య నలిగిపోతారు. ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలకు స్థానిక సమన్వయం, మార్గనిర్దేశం అవసరం. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను అభ్యర్థించి ఎన్నికల పనులను ఒక వారం వాయిదా వేయాలి” అని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికలు కొన్ని రోజులు ఆలస్యమైనా సమస్య లేదని ఆయన పేర్కొన్నారు. సైక్లోన్ సమయంలో పూర్తి దృష్టిని విపత్తు నిర్వహణపై కేంద్రీకరించాలని ఆయన కోరారు. పొరుగు రాష్ట్రమైన ఒరిస్సా ఎనమండుగురు మంత్రులను అర్ణవ్ తుఫాన్ పర్యవేక్షణ కోసం ప్రజలను ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేకించి నియమించింది. ఈ విధంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నట్టు సమాచారం లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే ప్రభుత్వ పూర్తి యంత్రాంగాన్ని తూఫాన్ నష్ట నివారణ కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @BJP4India @PMOIndia @narendramodi @ysjagan @YSRCParty #ArnabCyclone #CycloneArnab
7
43
1
192
10,869
URGENT PRESS RELEASE Dt 26 Oct 2026 CM should request SEC to postpone election-related work for one week amid Cyclone Arnab threat - Bolisetty Satyanarayana Bolisetty has welcomed Chief Minister N. Chandrababu Naidu’s review of the state’s preparedness for Cyclone Arnab and the decision to keep 21 NDRF and SDRF teams ready. However, he expressed concern that the engagement of state government officers in election duties could hamper effective disaster management. Addressing the Chief Minister, Bolisetty Satyanarayana said, “Heavy to extremely heavy rainfall and strong winds are expected in North Andhra, Kakinada, Anakapalli, Konaseema and other areas on October 27 and 28. If election-related work continues during this emergency, officers will be torn between two responsibilities. Local coordination and guidance are essential for the NDRF and SDRF teams. Therefore, the Chief Minister should immediately request the State Election Commission (SEC) to postpone election work for one week.” He emphasised that protecting lives and property must take priority and that a brief postponement of election activities would not cause any major issue. He urged the government to focus entirely on cyclone preparedness and response. #CycloneArnab #CycloneAlert @AndhraPradeshCM @ncbn @PMOIndia @narendramodi @BJP4India @PawanKalyan @JanaSenaParty @ysjagan
22
105
3,830
“కొన్ని నిజాలు భయపెడతాయి…” ఇది వకీల్ సాబ్ సినిమాలో పాపులర్ డైలాగ్! జనసేనలోనూ కొన్ని నిజాలు సైన్యాన్ని ఆలోచింపజేస్తున్నాయి! సొంత పత్రిక లేకపోవడం వల్ల జనసేనకు జరిగే నష్టం గురించి జర్నలిస్టు సాయి గారు చెప్పిన వార్తలో నిజం ఉంది. ప్రజల్లోకి వెళ్లాల్సిన పార్టీ వాణి, పార్టీ చేస్తున్న పనులు, పార్టీ విధానాలు ప్రధాన మీడియా ద్వారా తగినంతగా ప్రజలకు చేరకపోతే నష్టం జరగడం సహజం. కానీ జనసేనకు ఉన్న మరో బలం #GenZ! ఇక్కడ ప్రతి సైనికుడూ ఒక పత్రికతో సమానం! ప్రతి కార్యకర్త ఒక వార్తా వేదిక కావాలి. ప్రతి సోషల్ మీడియా ఖాతా ప్రజల గొంతుక కావాలి. ప్రతి పోస్ట్ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సొంత పత్రిక లేకపోవచ్చు… కానీ లక్షలాది గొంతుకలు ఉన్నప్పుడు, ప్రజల చేతుల్లోనే మీడియా ఉంటుంది! అయితే భావోద్వేగం ఒక్కటే సరిపోదు. వాస్తవాలు, ఆధారాలు, క్రమశిక్షణ, నిరంతర ప్రజా సంబంధాలు కూడా అవసరం. నిజాలను చూసి భయపడటం కాదు… వాటిని అర్థం చేసుకుని, లోపాలను సరిదిద్దుకుని, ప్రజల గొంతుకగా ఎదగాలి! మీ చేతిలోని ఫోన్‌ను కేవలం పోస్టులు పెట్టడానికి కాదు, ప్రజాస్వామ్యానికి ప్రజా వేదికగా మార్చవలసిన సమయం వచ్చింది #ప్రజాగొంతుక #SocialMediaPower youtu.be/d8049mOSG6s?si=UhqK…
5
97
2
346
18,004
ఆంధ్రప్రదేశ్ లో చిత్తడి నేలల సంరక్షణ, కొల్లేరు సరస్సు దుస్థితిపై సుప్రీంకోర్టు ఉత్తర్వుల సందేశం సుప్రీంకోర్టు తాజాగా WP (C) 304/ 2018 Anand Arya Vs Union of India కేసులో 12 అక్టోబర్ 2026లో వెలువరించిన ఉత్తర్వులు దేశవ్యాప్తంగా ఆర్ద్రభూములు (Wetlands), నీటి వనరుల పరిరక్షణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తాయి. drive.google.com/file/d/1qQ7… తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు వేల సంఖ్యలో ఉన్న చిత్తడి నేలల సర్వే, గ్రౌండ్-ట్రూటింగ్ పద్దతుల ద్వారా సరిహద్దుల గుర్తింపును శాస్త్రీయ పద్ధతిలో వేగంగా చేస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఇలాంటి కఠినమైన వేగవంతమైన చర్యలు లోపించాయి. పర్యావరణ ప్రేమికులు మృత్యుంజయ రావు గారు ఇతరులు కోర్టుల ద్వారా పోరాడుతున్నప్పటికీ, ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటైన మన కొల్లేరు సరస్సు మాత్రం కబ్జాలు, రొయ్యల చెరువుల ఆక్రమణలు మరియు అధికారుల ఉదాసీనత వల్లే ఇప్పటికీ సంపూర్ణ మోక్షానికి నోచుకోలేకపోతోంది. ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులు మన రాష్ట్రానికి ఇస్తున్న హెచ్చరికలు: • తమిళనాడు ప్రభుత్వం మొబైల్ GIS యాప్‌లు, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించి లక్షలాది నీటి వనరులను శాస్త్రీయంగా సర్వే చేస్తూ, సరిహద్దు రాళ్లను పాతడం ద్వారా పకడ్బందీగా రక్షిస్తోంది. అదేవిధంగా కర్ణాటక కూడా వేల సంఖ్యలో ఆర్ద్రభూముల సర్వే పూర్తి చేసింది. మరి మన ఏపీలో ఈ తరహా పారదర్శక సర్వేలు కఠిన ఆచరణ ఎందుకు కొరవడ్డాయి? • సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినదాని ప్రకారం, నీటి వనరులు మరియు చిత్తడి నేలల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలదే. కేవలం కాగితాల మీద నివేదికలు ఇవ్వడమే కాకుండా, క్షేత్రస్థాయిలో 2.25 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చిన్న నీటి వనరులను కూడా రక్షించాలని కోర్టు మళ్ళీ మళ్ళీ ఆదేశించింది. • పర్యావరణ వేత్తలు న్యాయ పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వ యంత్రాంగాల మధ్య సమన్వయ లోపం, రాజకీయ ఇచ్ఛాశక్తి కొరవడటం మరియు రెవెన్యూ-అటవీ శాఖల నిర్లక్ష్యం వల్ల కొల్లేరు సరస్సు సరిహద్దులు ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు. అక్రమ ఆక్రమణదారుల ప్రభావం, చట్టాల అమలులో అలసత్వం కారణంగానే కొల్లేరుకు ఇప్పటికీ శాశ్వత రక్షణ దక్కడం లేదు. "సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన 4 నెలల్లోపు కంప్లైయన్స్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది". ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేల్కొని, తమిళనాడు తరహాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కొల్లేరు సరస్సుతో పాటు రాష్ట్రంలోని ప్రతి చిత్తడి నేలను, నీటి వనరును కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేదంటే భావితరాలకు మిగిలేది మన నీటి వనరుల కబ్జాల చరిత్రను మాత్రమే..
27
92
4,173
అధికారం కోసం కాదు… వ్యవస్థ మార్పు కోసం ఓటు వేయండి! నానాజీ దేశ్‌ముఖ్ గారి గ్రామోదయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాల్సిన సమయం ఇది. 🙏 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా విజ్ఞప్తి… మన స్వార్థం కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, మన హక్కుల పరిరక్షణ కోసం, కుళ్లిపోయిన వ్యవస్థలను ప్రక్షాళన చేసి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఆలోచిద్దాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు, కులాలకు, డబ్బు ప్రలోభాలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయండి. మన స్థానిక అధికారాలను కాపాడేవారు ఎవరు? మన సహజ వనరులను పరిరక్షించేవారు ఎవరు? గ్రామసభల అధికారాలను, ప్రజల హక్కులను గౌరవించేవారు ఎవరు? ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, గ్రామాల స్వావలంబనకు కృషి చేసేవారు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలిచే అభ్యర్థులకే మీ అమూల్యమైన ఓటు వేయండి. పార్టీలు మారినా ప్రజల పరిస్థితులు మారకపోతే, వ్యవస్థలో మార్పు రాలేదనే అర్థం. నానాజీ దేశ్‌ముఖ్ చూపిన గ్రామోదయ మార్గం.. ప్రజల భాగస్వామ్యం, స్వావలంబన, బాధ్యతాయుతమైన పాలన ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం అని ఆయన రుజువు చేసిచూపారు గుర్తుంచుకోండి… ఓటు అనేది ఒక వ్యక్తిని గెలిపించే సాధనం మాత్రమే కాదు మన గ్రామ భవిష్యత్తును, మన హక్కులను, మన ప్రకృతి సంపదను కాపాడే ప్రజాస్వామ్య ఆయుధం! మన గ్రామం మనదే… మన వనరులు మనవే… మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే ✊ #ElectionsForLocalBodies #AndhraPradesh #Visakhapatnam #గ్రామోదయం #నానాజీదేశ్‌ముఖ్ #స్థానికప్రజాస్వామ్యం #ప్రజలహక్కులు #సహజవనరులపరిరక్షణ #వ్యవస్థలోమార్పు #ఆంధ్రప్రదేశ్ #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం ఇవి కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకూడదు
2
15
103
2,746
శివసేన (UBT) నేత, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసి, థానేలోని బల్కుమ్-మాజీవాడ ప్రాంతంలో ప్రతిపాదించిన అమెజాన్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై స్టే విధించాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 54 ఎకరాల స్థలంలో రావాలని ఉంది. స్థానికులు ఇప్పటికే రెండు నెలలుగా నిరసనలు చేస్తున్నారు. వారి ఆందోళనలు నీటి సరఫరాపై భారం (రోజుకు 100 మిలియన్ లీటర్లు అవసరమవుతుందని అంటున్నారు), విద్యుత్ పంపిణీ, డీజిల్ జనరేటర్ల ఉద్గారాలు, 90 డెసిబెల్స్ వరకు శబ్ద కాలుష్యం, వేడి పెరుగుదల, ఆరోగ్య ప్రమాదాల గురించి అధ్యయనం చేయాలని కోరుతున్నారు. దాదాపు 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మాజీ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అనిల్ కాకోడ్కర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక వచ్చే వరకు ప్రాజెక్టును ఆపాలని ఆదిత్య ఠాక్రే కోరారు. అలాగే కమిటీలో స్థానిక ప్రజా సంక్షేమ సంస్థల ప్రతినిధులను చేర్చాలని, రెసిడెన్షియల్ ఏరియాలో AI డేటా సెంటర్ ఎందుకు వస్తోంది, MIDC రెడ్ కేటగిరీ ప్రాంతానికి ఎందుకు మార్చలేము అనే ప్రశ్నలు వేశారు. మహారాష్ట్రను డేటా సెంటర్ హబ్‌గా మార్చే ప్రయత్నం నేపథ్యంలో ఈ వివాదం తలెత్తింది. స్థానికులు #WakeUpThanekar అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇది అక్టోబర్ 24, 2026 Deccan Chronicle ఆర్టికల్ తెలుగు సారాంశం deccanchronicle.com/nation/a… #DataCentres #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం @watermanofindia @PawanKalyan @mvrsastry
12
33
3,972
600 ఏళ్ల క్రితమే మనకి సుమతీ శతకంలో బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ…! "ఐక్యమైన ప్రజాశక్తి ముందు ఎంతటి బలమైన శక్తి అయినా తలవంచక తప్పదు" అని చెప్పింది సత్యం!✊ కూటమి అండతో గెలిచాక కూటమి భాగస్వామ్య పార్టీలకు టీడీపీ తగిన ప్రాతినిధ్యం ఇవ్వలేదు, ఇచ్చిన స్థానాల్లోనూ ఇతర పార్టీల వారికే ప్రాధాన్యం ఇచ్చింది అన్నది కాదనలేని వాస్తవం. ప్రజలను చైతన్యవంతం చేసి, వారి హక్కుల కోసం సంఘటిత శక్తిని నిర్మించాలనే పవన్ కళ్యాణ్ గారి వంటి వారి ప్రయత్నాలను బలహీనపరిచేందుకు, ప్రజలను వర్గాలుగా విడదీసి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే రాజకీయ ధోరణి చంద్రబాబు గారిలో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమిచ్చినంకకూడదని భాగస్వామ్య పార్టీలు మౌనం వహించేది కూడా సత్యమే. ఆనాటి బ్రిటిష్ పాలకుల ‘విభజించి పాలించు’ సిద్ధాంతాన్నే ఇప్పుడు ఆ రెండు పాలిత కుటుంబాలు అమలుచేస్తున్నారు. ప్రజలు విడిపోతేనే వారి దుష్ట రాజకీయ ఆధిపత్యం బలపడుతుంది. ప్రజలు ఐక్యమైతే ప్రజాస్వామ్యం బలపడుతుంది! ప్రజల ఐక్యతను అడ్డుకుంటూ ఆధిపత్యం చాలాయిస్తున్న ఆ రెండు రాజకీయ శక్తులకు ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది! ఈ స్థానిక ఎన్నికల్లో డబ్బుకు, ప్రలోభాలకు, కులమత విభేదాలకు లొంగకుండా అభ్యర్థుల నిజాయితీ, ప్రజాసేవ, జవాబుదారీతనాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి, ప్రజాస్వామ్యానికి ఊపిరి పోయాలి ఐకమత్యమే మన బలం, మన ఆయుధం… #సత్యమేవ_జయతే గుర్తుంచుకోండి.. డబ్బు కాదు..ప్రజల హక్కుల పరిరక్షణ, పర్యావరణ రక్షణే మన భావి తరాలకు మనం ఇవ్వాల్సిన ఆస్తులు #కులాలను_కలిపే_ఆలోచన_విధానం #మతాల_ప్రస్తావనలేని_రాజకీయం #అవినీతిపై_రాజీలేని_పోరాటం #పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #సుమతీశతకం #విభజించిపాలించు #ప్రజాస్వామ్యం #స్థానికఎన్నికలు #ప్రజలహక్కులు #పర్యావరణపరిరక్షణ @watermanofindia @PawanKalyan @mvrsastry
10
174
1
589
8,228
రెల్లి బ్రతుకుల గురించిన ఈ పాట ప్రతి హృదయాన్ని తాకుతుంది.. రెల్లిల బాధలను పాట రూపంలో తెలిపిన ఆదాడ మోహన్ రావు గారు గారికి రెల్లి కుటుంబాల తరపున అభినందనలు ✊ youtu.be/U_rOwJakwuQ?si=siwt… youtu.be/U_rOwJakwuQ?si=ORAc… #JSPforNewAgePolitics
2
42
169
4,097
చంద్రబాబు, జగన్ రెడ్డి ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు నియంతలే.. అధికారం కోల్పోతే ప్రజాస్వామ్య వాదులే.. వీళ్ళ నుండి ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి @JaiTDP @ncbn @JanaSenaParty @PawanKalyan @BJP4India @narendramodi #JSPforNewAgePolitics
29
373
6
1,104
13,507
టీడీపీ అధికారిక ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవే… ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా? చంద్రబాబు గారి మీడియా సమావేశం చూస్తే ఒకటే అర్థమవుతోంది తను సీఎం అవ్వడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారి త్యాగాన్ని, జనసేన పోరాటాన్ని పూర్తిగా మర్చిపోయారు. పవన్ గారి మద్దతు లేకుండా టీడీపీకి 2024లో గెలుపు రాదని అందరికీ తెలుసు. కానీ ఆ మాట ఒక్కటి కూడా ఈ ప్రెస్‌మీట్‌లో లేదు. కూటమి గురించి, కేంద్రం మద్దతు గురించి, బీజేపీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు 30% సీట్లు ఇవ్వకుండా టీడీపీ నాయకులు చేస్తున్న అడ్డగోలు, జనసేన నేతలపై, అభ్యర్థులపై జరుగుతున్న దాడుల గురించి కూడా పూర్తి మౌనం. ప్రజలకు నిజాలు చెప్పకుండా కేవలం వైఎస్ఆర్సీపీపై దాడులతో సమయం గడపడం… ఇదేనా కూటమి ధర్మం కనీసం అక్కడక్కడ పొరపాటున టిడిపి వాళ్ళు జనసేన మీద దాడిలు చేశారు దీన్ని నేను ఖండిస్తున్నాను సరి చేస్తాను అన్న మాట కూడా లేకుండా? జనసేన పోరాటం, పవన్ గారి త్యాగం ప్రస్తావన లేకుండా ఈ మీడియా సమావేశన్ని ఏమనుకోవాలి?? ఒడ్డు దాటాక తప్ప తగలెయ్యడం కాదా?? నన్ను నమ్మనవసరం లేదు ఈ పూర్తి ప్రెస్‌మీట్ ఇక్కడ చూడండి.. అర్ధం అవుతుందా?? మీ అభిప్రాయాలు నిరభ్యంతరంగా పోస్ట్ చేయండి. నేను తప్పుగా చెప్పినా నన్నూ నిలదీయండి.. youtube.com/live/ANWhLSHAysI… @ncbn @JaiTDP @PawanKalyan @JanaSenaParty #LocalBodyElections #Kootami #AndhraPradesh
56
252
11
857
41,775
ముమ్మాటికీ తంబళ్లపల్లిలో జరిగినది తప్పే! దాన్ని ఖండించాల్సిందే. ఈ విషయంలో మీ స్పందన బాగుంది @mnadendla గారు. 👌🙏 మరి ఇతర చోట్ల జరుగుతున్న అన్యాయాలపై కూడా మీరు స్పందించాలి. అనేక చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలే జనసేన పార్టీ అభ్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారు!! అనేక నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షులే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకుల అరాచకాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!! విశాఖ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి మరీ దారుణం! 6,000 మంది సభ్యత్వాలు నమోదు చేసిన నాయకులు, కార్యకర్తలను పక్కనపెట్టి, జనసేనకు కేటాయించిన ఆరు స్థానాలకు బదులుగా కేవలం రెండు స్థానాలే తీసుకున్నారు. వాటిలోనూ జనసేన సభ్యత్వం లేని వారిని అభ్యర్థులుగా ప్రకటించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తూ, "విశాఖ తూర్పు నియోజకవర్గం"లో జనసేన పార్టీని నిలువునా పాతరేస్తుంటే… విశాఖ అధ్యక్షులు గానీ, మీరు గానీ ఎందుకు స్పందించడం లేదు? పార్టీ కార్యాలయానికి ఫోన్ చేస్తే, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని చెప్పి, టిక్కెట్లు ఇచ్చిన అభ్యర్థులకు డప్పులు కొట్టమని పార్టీ అధ్యక్షులు వారే చెప్పారని చెబుతున్నారట!! విషయంపైనా మీరు తప్పక స్పందించాలి! తప్పు ఎక్కడ జరిగినా తప్పే! అన్యాయం ఎవరు చేసినా అన్యాయమే! తంబళ్లపల్లిలో జరిగిన ఘటనను ఖండించినట్లే, ఇతర చోట్ల జనసేన నాయకులు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలపైనా స్పందించాలి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి. పొత్తు ధర్మం పేరుతో ఒక పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని బలిచేయకూడదు. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మీ స్పందన తంబళ్లపల్లికే పరిమితం కాకూడదు! 🙏 (జనసేన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ విశాఖ తూర్పు నియోజకవర్గం పాయింట్ అఫ్ కాంటాక్ట్) చాలా మంది మీరు పర్యావరణంపై ఫోకస్ పెట్టండి అని సలహాలు ఇస్తున్నారు. కానీ డబ్బు రాజకీయాలు చేసేవాళ్ళని ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ప్రజలు ఎన్నుకుంటే జరిగేది పర్యావరణ విధ్వంసమే. అందుకే నా తపన అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తెలుగుదేశం వైసీపీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఒకలా ప్రవర్తించడం తప్పు. ఆ తప్పు ప్రశ్నించే తత్త్వం ఉన్న @PawanKalyan గారు @JanaSenaParty చేయకూడదు అని ప్రజలు కోరుకుంటున్నారు
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం * వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి * ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది. *ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి. (నాదెండ్ల మనోహర్) చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
10
319
7
965
33,934