విజయవాడలో భారీ వరద!
గత రాత్రి విజయవాడలో మధ్యం ఏరులై పారింది. నోట్ల కట్టల వరద వచ్చింది.
వైసీపీ ఓటుకి 500 రూపాయలు పంచితే, జనసేన/టీడీపీ/బీజేపీ కూటమి 1000 రూపాయలు పంచింది.
తప్పతాగిన మూకలు ఏబివి ప్రచార వాహనాలను ధ్వంసం చేశాయి.
ఈ విష సంస్కృతి పోవాలి. మీ ఓటు పాలకులకు కోట్లు కాకూడదు.
దొంగలు పోవాలి. పోలీసు రావాలి!
నిన్న బందరు నుంచి ఒక పోలీసు కానిస్టేబుల్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చారు. బిడియంగా 40 వేల రూపాయల విరాళం చెక్కు చేతిలో పెట్టి వెళ్లిపోతుంటే, ఏ.బి.వి గారిని కలవరా అని అడిగాను. ప్రచారంలో బిజీగా ఉంటారు. నేను మళ్లీ వెనక్కి వెళ్ళాలి అంటూ బయలుదేరారు. అవినీతికి వ్యతిరేకంగా మీరు చేస్తున్న పోరాటం నచ్చి నా వంతు సహాయం చేద్దామని వచ్చాను అన్నారు.
లంచాలకు వ్యతిరేకి అంటే, తన జీతం మీద బ్రతికే కానిస్టేబుల్. తన జీతంలో 40 వేలు విరాళంగా ఇచ్చారు. ఇట్లాంటి బుద్ధిజీవులు ఉన్న మన దేశం, వెనుకబడిన దేశంగా మిగిలి పోకూడదు. భారత దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించడం మా జీవితాశయం. అది కేవలం మా విధానాల ద్వారానే సాధ్యం. ఇంకొక మార్గం లేదు!
విజయవాడ మేయర్ ఎన్నికలలో ఆచితూచి ఓటెయ్యండి. దొంగలు పోవాలి. పోలీసు రావాలి!
టీడీపీలోని నిజాయితీపరులు, పార్టీ నాయకత్వం లంచాలకు తెగబడిందని తెలిసినా, పార్టీ నడపడానికి డబ్బులు కావాలి కదా అని తమ మనస్సాక్షికి సర్ది చెప్పుకుంటున్నారు.
మహామేత అంశలో పుట్టింది వైసీపీ అయితే, జీవితంలో నయాపైసా లంచం ముట్టుకోని ఎన్టీఆర్ అంశలో పుట్టింది టీడీపీ.
ఎన్టీఆర్ నాలుగు ఎన్నికలలో నిజాయితీగా పోటీ చేశారు. మూడు సార్లు గెలిచారు. అయితే, రోజులు మారాయి అని మీరనొచ్చు. కానీ కేజ్రీవాల్, విజయ్ కూడా డబ్బులు పంచకుండా గెలిచారు.
పార్టీ నడపడానికి రాష్ట్రాన్ని ఎగబడి తెగబడి దోచుకోక తప్పదు అని చెప్పే టీడీపీ వైసీపీ నాయకత్వాలకు విజయవాడ ఓటర్లు సందేశం పంపాలి. దేశం బాగుపడాలంటే మార్పు రావాలి. దొంగలను కట్టడి చెయ్యాలంటే పోలీసు రావాలి.
కాంట్రాక్టర్లతో భుజాలు రాసుకుంటూ, డబ్బులు తీసుకుంటూ, వాళ్ళకే పనులు అప్పజెబితే ఏమౌతుంది? నాణ్యత లేని పోలవరం నిర్మాణం అవుతుంది.
నాసిరకంగా నిర్మించిన డయాఫ్రాం వాల్ మీద మేము వేసిన కేసు, ఈ రోజు (Oct 26) హై కోర్టులో వాదనలకు వస్తుంది.
ఈ కేసుని ఏ.బి. వెంకటేశ్వర రావు గారు ప్రధాన న్యాయమూర్తి ముందు స్వయంగా వాదిస్తారు.
PS: పోలవరంలో జరిగిన అవకతవకలు మొదటి కామెంట్లో.
ఖబడ్దార్ ... మీరు దగ్గితే ఓటు వెయ్యం. మీరు తుమ్మితే కులం ఓట్లు వెయ్యం. మీరు ముక్కితే డిపాజిట్ రాకుండా చేస్తాం అనే పండితులందరికీ ముఖ్య గమనిక.
మీరు మాకు ఓటు వేసి మేహర్బానీ చెయ్యడం లేదు.
మీరు టీడీపీ/జనసేన/వైసీపీలకు ఓట్లు వేస్తే వాళ్ళకు కోట్లు వస్తాయి. అందుకే వాళ్ళు మీ ఓట్ల కోసం దేబిరిస్తారు, మీ జేబుల్లో నోట్లు కుక్కుతారు.
మీరు మాకు ఓటు వేస్తే మాకు నయాపైసా రాదు. మేం మీ బతుకులు బాగుపడాలని రాజకీయాలు చేస్తున్నాం.
ఎన్నిక గెలిచినా, ఓడినా; డిపాజిట్ వచ్చినా రాకపోయినా, బేఫికర్! ప్రశాంతంగా నిద్రపోతాము. అదే నిజాయితీకి నిబద్ధతకు ఉన్న దమ్ము.
నిన్నటి నుంచి ఆధారాలు చూపియ్యి ఆధారాలు చూపియ్యి అని సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు.
మొదటి కామెంట్లో ఉన్నాయి ఆధారాలు. ఇవి చూపించి సంవత్సరం దాటింది. మరి, మీరు మీ పెద్దాయనను చినబాబుని నిలదీశారా? లేదు!
ఇప్పుడైనా దోపిడీదారులకు ఊడిగం చెయ్యడం ఆపి అవినీతిరహిత సమాజం కోసం పోరాడండి.
గొడ్డలి పార్టీతో చేతులు కలిపింది ఎవరు?
జగన్ బినామీ షిరిడీ సాయితో చేతులు కలిపింది ఎవరు? CBN/TDP
జగన్ బినామీ మేఘాతో చేతులు కలిపింది ఎవరు? CBN/TDP
జగన్ బినామీ ఎంప్రదాతో చేతులు కలిపింది ఎవరు? CBN/TDP
జగన్ బినామీ ఏఎమ్మార్ తో చేతులు కలిపింది ఎవరు? CBN/TDP
పాపం ఎన్నారైలు. మాతృభూమిలో మంచి ఆసుపత్రి నిర్మించుకోవాలని విజయవాడ వచ్చారు. మీ పెద్దాయన విసిరిన పంజాకు బలయ్యారు.
గొడ్డలి పార్టీ అని మొత్తం ఎన్నికల ప్రచారమే నడిపారు. మీకసలు గొడ్డలే దొరకలేదు.
కొన్నిటికి ఆధారాలు ఉండవు. కానీ పులివెందులలో పిల్లోడిని అడిగినా చెబుతాడు వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారో.
అలాగే, విజయవాడలో ఎవరిని అడిగినా చెబుతారు NRI కాలేజీ ఎవరు కొట్టేశారో.
మేము ఓటుకి నోటు ఇవ్వం
మేము ఓటుకి నోటు తీసుకుంటాం
కొత్త రాజకీయాలకు నాంది!
Change is on the horizon. Hope is near.
NRI ఆసుపత్రిని లాక్కున్నారు అనేది నిజం. మీ పెద్దాయన దగ్గరుండి కార్యక్రమం నడిపించారు అనేది పచ్చి నిజం. అది మీకు మింగుడు పడకపోతే నేనేం చేయలేను.
నా ఈ అభియోగం, NRI కాలేజి వ్యవస్థాపకులు, అందులో మొదట పెట్టుబడి పెట్టిన డైరెక్టర్లు, కాలేజి నిర్వహించిన వ్యక్తులతో రోజుల తరబడి మాట్లాడిన తరువాత చేస్తున్నాను.












