VARANASI_GIRL🛕🚩 retweeted
CBSE కొత్త రూల్.. ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైనా పాస్ అయ్యే ఛాన్స్! 🎓
CBSE 2027-28 విద్యా సంవత్సరం నుంచి టెన్త్ పరీక్షల విధానంలో మార్పులు తీసుకొచ్చింది. ఐదు తప్పనిసరి బోర్డు పరీక్షలతో పాటు ఆప్షనల్ స్కిల్ సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిలైనా, స్కిల్ సబ్జెక్టులో పాసైతే ఆ సబ్జెక్టుతో రీప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, అంటే 2028లో టెన్త్ పరీక్షలు రాసేవారికి వర్తిస్తుంది. ప్రస్తుత టెన్త్ విద్యార్థులకు వర్తించదు.
#CBSE #EducationNews
👉 follow @tupaki_official #ryanrickelton
VARANASI_GIRL🛕🚩 retweeted
ZPTC అభ్యర్థి ఆస్తులు ₹172 కోట్లు.. ఎన్నికల్లో ఇదేం రేంజ్! 😲
ఏపీలో చిత్తూరు జిల్లా గుడిపాల టీడీపీ ZPTC అభ్యర్థి మమత శ్రీ తన అఫిడవిట్‌లో ₹172.27 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించినట్లు సమాచారం. ఇందులో ₹162.99 కోట్ల స్థిరాస్తులు, ₹9.28 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 44.62 ఎకరాల భూమి, ₹24.89 కోట్ల విలువైన ఇళ్లు, 1.10 కిలోల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ₹32 కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు.
#APPolitics #ElectionAffidavit
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ధోనీ తనకు వాట్సాప్‌లో మెసేజ్ చేసి అభినందించారని స్మృతి మంధాన తెలిపారు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. గతంలో ఓ యాడ్‌లో కలిసి నటించడంతో స్మృతి నంబర్ తన దగ్గర ఉందని, టీమ్‌లోని అందరికీ విషెస్ చెప్పాలని ఆమెకు మెసేజ్ చేశానని వివరించారు.#MSDhoni #SmritiMandhana
VARANASI_GIRL🛕🚩 retweeted
రొనాల్డోను దాటిన గిల్.. టాప్ 50లో లేని ధోనీ, కోహ్లీ, రోహిత్! 😮
SportsPro 2026 అత్యంత మార్కెట్ చేయగలిగిన క్రీడాకారుల జాబితాలో గిల్ 13వ స్థానంలో నిలవగా, రొనాల్డో 14వ స్థానంలో ఉన్నాడు. మరోవైపు ధోనీ 83, కోహ్లీ 85, రోహిత్ 90వ స్థానాలకు పరిమితమయ్యారు. బ్రాండ్ విలువ లెక్కలు వేరైనా.. ఈ ర్యాంకింగ్స్ వాస్తవ ప్రజాదరణను ప్రతిబింబిస్తున్నాయా? మీరేమంటారు?
#ShubmanGill #MSDhoni
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
ఓర్రీ వేషాలు.. హస్తర్‌ను కూడా వదల్లేదుగా! 😂
హాలోవీన్ కోసం 'తుంబాడ్' సినిమాలోని భయంకరమైన హస్తర్ పాత్రగా మారిపోయిన ఓర్రీ.. ఒంటినిండా ఎరుపు రంగు, కళ్లకు నల్లటి మేకప్, తలపై బంగారు కిరీటంతో దర్శనమిచ్చాడు. భయపెట్టాల్సిన గెటప్‌లోనూ తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వులు పూయించాడు. పూ గెటప్ నుంచి హస్తర్ వరకు.. ఓర్రీ వెరైటీ వేషాలకు మాత్రం కొదవే లేదు!
#Orry #Tumbbad
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
ఎక్స్పోజింగ్ కాదు.. ‘పెద్ది’లో అసలు సమస్య ఇదే!
‘పెద్ది’పై జరుగుతున్న చర్చలో జాన్వీ కపూర్ గ్లామర్ కంటే కీలకమైన విషయం మిస్ అవుతోంది. హీరోయిన్ అంగీకారం లేకుండా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, దాన్ని ప్రేమగా చూపించడం ఎంతవరకు సమంజసం? సమస్య గ్లామర్‌లో కాదు.. స్టాకింగ్, బలవంతాన్ని ప్రేమగా సమర్థించేలా హీరోయిన్ పాత్రను, సన్నివేశాలను రాసిన విధానంలో ఉంది. ఇలాంటి సన్నివేశాలను ఏ భాషా సినిమాలో చూపించినా ప్రశ్నించాల్సిందే. విమర్శకు కొలమానం ఒక్కటే ఉండాలి!
#Peddi #JanhviKapoor
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
పెను గాలులకు భారీ నౌకలూ బేజార్.. పోర్టులో క్రూయిజ్ షిప్ బీభత్సం! 🚢
జర్మనీలోని బ్రెమెర్‌హావెన్ పోర్టులో బలమైన గాలుల ధాటికి TUIకి చెందిన 'Mein Schiff 3' అదుపుతప్పి రెండు కంటైనర్ నౌకలను ఢీకొట్టింది. MSC Victorine నౌకకు 10 మీటర్ల పొడవున చీలిక ఏర్పడగా, క్రూయిజ్ షిప్ లైఫ్ బోట్లు కూడా దెబ్బతిన్నాయి. 3,300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనతో కానరీ దీవులకు వెళ్లాల్సిన ప్రయాణం రద్దయింది.
#CruiseShip #Germany
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
💔 పంటను కాపాడుకోవడానికి మురుగు నీటినే ఆశ్రయించిన రైతన్న.. ఇదేం దుస్థితి!
సాగునీరు లేదు.. కరెంటు సరిగా అందడం లేదు.. కళ్లముందే ఎండిపోతున్న వరి పంటను చూసి తట్టుకోలేకపోయిన రైతు చివరకు డ్రైనేజీ మురుగు నీటినే పొలానికి మళ్లిస్తున్నాడు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శేరిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన రైతుల కష్టాలకు అద్దం పడుతోంది.
పంటను కాపాడుకోవడానికి మురుగు నీటితో పోరాటం చేస్తున్న అన్నదాత!
#Farmers #FarmerIssues #Siddipet #Gajwel #Telangana #Agriculture #Rythu #FarmersStruggle #Tupaki
VARANASI_GIRL🛕🚩 retweeted
ఇదేనా ఉప్పాడ బీచ్ రోడ్డు.. సముద్రం దెబ్బకు ఛిద్రమైన తీరం! 🌊😢 #Uppada #CycloneArnab
VARANASI_GIRL🛕🚩 retweeted
#VijayAntony has arrived at Hyderabad Airport.
#Kollywood #Tollywood #Spotted #Tupaki
Follow👉 @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
యూరప్‌కు పుతిన్ వార్ వార్నింగ్!
యుద్ధం మాకు ఇష్టం లేదు.. కానీ ఎవరైనా కోరుకుంటే సిద్ధంగా ఉన్నామంటూ పుతిన్ హెచ్చరిక. ఉద్రిక్తతలు పెరిగితే విజేతలెవరూ ఉండరన్నారు. బాల్టిక్ సముద్రంలోనూ హార్ముజ్ తరహా పరిస్థితి కావాలా అంటూ యూరప్‌ను ప్రశ్నించారు!
#Putin #Russia #Europe #BalticSea #Hormuz #TeluguNews #Tupaki
Follow👉@tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
Bigg Boss Telugu 10: ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషనా? 😮
గతవారం దక్ష, షాలిని ఎలిమినేషన్‌తో షాకిచ్చిన బిగ్‌బాస్.. ఎనిమిదో వారంలోనూ మరో డబుల్ ఎలిమినేషన్‌కు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. రామ్ ప్రసాద్, వర్షిణి టాస్క్‌లతో సేఫ్ జోన్‌లోకి వెళ్లడంతో ఇప్పుడు ఝాన్సీ, రామకృష్ణ, శ్వేతాలపై ఉత్కంఠ నెలకొంది. వీరిలో ఎవరు హౌస్‌ను వీడతారోననే ఆసక్తి పెరుగుతోంది. అసలు ట్విస్ట్ ఏంటో వీకెండ్ ఎపిసోడ్‌లోనే తేలనుంది!
#BiggBossTelugu10 #DoubleElimination
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
సైలెంట్ మోడ్ ఆఫ్.. ప్రమోషన్లలో త్రివిక్రమ్ కొత్త స్పీడ్! 🔥
సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే త్రివిక్రమ్.. 'ఆదర్శ కుటుంబం' విషయంలో మాత్రం రూట్ మార్చారు. ప్రెస్ మీట్లు, మీడియా ప్రశ్నలు, సరదా కౌంటర్లు, స్టేజ్‌పై చమత్కారాలతో ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తనలోని అన్‌స్క్రిప్టెడ్ హ్యూమర్‌ను బయటపెడుతూ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేస్తున్నారు. గురూజీ ఈ కొత్త ప్రమోషనల్ స్టైల్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది!
#Trivikram #AdarshaKutumbam
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
ఏఐ దెబ్బ.. సినిమా కార్మికుల ఉపాధికి ముప్పు? 🤖
ఏఐ రాకతో సినిమా రంగంలో యంగ్ యాక్టర్లు, జూనియర్ ఆర్టిస్టులు, స్టంట్, డబ్బింగ్ కళాకారుల అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందా? డిజిటల్ డీ-ఏజింగ్, ఏఐ అవతార్లతో పాటు నటుల డిజిటల్ హక్కులను శాశ్వతంగా పొందే ఒప్పందాలు కొత్త ఆందోళనలు రేపుతున్నాయి. మరణించిన నటుల డిజిటల్ రూపాలను కూడా అనుమతి లేకుండా వాడితే పరిస్థితి ఏంటి? లైట్‌మెన్ నుంచి చిన్న చిన్న కళాకారుల వరకు ఏఐ ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది?
#AIImpact #CinemaIndustry
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్లకు పైగా ప్రభావం!
ప్రపంచ క్రిప్టో దిగ్గజం బినాన్స్‌పై భారీ సైబర్ దాడి జరిగింది. సుమారు $6.3 బిలియన్ల (రూ.57,000 కోట్లకు పైగా) విలువైన క్రిప్టో ఆస్తులపై ప్రభావం పడినట్లు ఫోర్బ్స్ నివేదించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ల్యాప్‌టాప్ హ్యాక్ ద్వారా దాడి జరిగి ఉండొచ్చని బినాన్స్ అనుమానిస్తోంది. దీని వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా, ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. వినియోగదారుల నష్టాన్ని భరిస్తామని బినాన్స్ ప్రకటించింది.
#Binance #CryptoHack
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
కమల్‌కు రెండు తరాల బలం.. ఒకే బ్యానర్‌పై రజనీ, శివకార్తికేయన్! 🔥
నిర్మాతగా కమల్ హాసన్ వ్యూహం ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు సూపర్ స్టార్ రజనీకాంత్‌తో 'ధర్మన్', మరోవైపు ఈ తరం స్టార్ శివకార్తికేయన్‌తో 'సేయోన్' తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు హీరోలకూ భిన్నమైన కథలు, కొత్త తరం దర్శకులను ఎంచుకోవడం విశేషం. స్టార్ ఇమేజ్‌తో పాటు కొత్త కథలను నమ్ముకుంటున్న కమల్ నిర్మాణ సంస్థ.. రెండు తరాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తోంది!
#KamalHaasan #Kollywood
👉 follow @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
ఎలుకకు మెదడు ఆపరేషన్ చేసిన AI.. వైద్యరంగంలో మరో అద్భుతం !
మూర్ఛతో బాధపడుతున్న ఎలుకకు AI ఏజెంట్ జన్యు చికిత్సను ఎంపిక చేసి, మెదడులో ఇంజెక్షన్ ఇచ్చే ప్రాంతాన్ని గుర్తించి శస్త్రచికిత్స చేసింది. తప్పును గుర్తించి ఆపరేషన్ ఆపడం మరో విశేషం. ఎలుక కోలుకున్నా.. ఫిట్స్ తగ్గాయా అనేది ఇంకా తేలాల్సి ఉంది!
#AI #BrainSurgery #Technology #MedicalScience #TeluguNews #Tupaki
Follow👉 @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
#Video : బోస్నియాలో ఇటలీ మిలిటరీ హెలికాప్టర్ క్రాష్.. నలుగురు మృతి!
శాంతి పరిరక్షణ విధుల్లో ఉన్న ఇటలీ సైనిక హెలికాప్టర్ బోస్నియాలో కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
#Bosnia #Italy #HelicopterCrash #Military #TeluguNews #Tupaki
Follow👉 @tupaki_official
VARANASI_GIRL🛕🚩 retweeted
కడియంలో ఆసక్తికర రాజకీయం.. భార్యాభర్తలే ప్రత్యర్థులు!
ఎంపీపీ పదవి కోసం భార్యలను బరిలోకి దించిన ఇద్దరు ప్రముఖ నర్సరీ రైతులు! కూటమి నుంచి పుణ్యవతి, వైసీపీ నుంచి రాజరాజేశ్వరి పోటీ పడుతుండగా.. భర్తలు కూడా ఎంపీటీసీ బరిలో ఉండటంతో కడియంలో రాజకీయ వేడి పెరిగింది!
#Kadiyam #Politics #MPP #APPolitics #TeluguNews #Tupaki
Follow👉 @tupaki_official






