Collector NTR District (@Collectorntr) header
Collector NTR District (@Collectorntr) profile picture

Collector NTR

Joined December 2024
Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)Photo by Collector NTR District (@Collectorntr)
🗳️ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS గుంటుపల్లి స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి తొలివిడత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రతి దశను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తొలివిడతలో 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు 1,001 పోలింగ్ కేంద్రాల్లో నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. #NTRDistrict #GramPanchayatElections #ElectionPreparedness #Ibrahimpatnam #TransparentElections
2
183
ఎన్‌టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు జిల్లాలో 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులు, 3,287 పోలింగ్ కేంద్రాలు, 8,35,515 మంది ఓటర్లతో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, IAS. ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం. #ntrdistrict #grampanchayatelections #elections #vote #panchayatiraj @IPR_AP @apdigitalcorp
2
119
ఎన్‌టీఆర్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ జిల్లాలో మూడు విడతల్లో మొత్తం 288 గ్రామ పంచాయతీలు, 3,088 వార్డులు, 3,287 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, IAS. మొదటి విడత: 73 గ్రామ పంచాయతీలు | 1,001 పోలింగ్ కేంద్రాలు రెండవ విడత: 138 గ్రామ పంచాయతీలు | 1,468 పోలింగ్ కేంద్రాలు మూడవ విడత: 77 గ్రామ పంచాయతీలు | 818 పోలింగ్ కేంద్రాలు #NTRDistrict #GramPanchayatElections #Democracy #vote #Elections2026
73
NTR District collector Dr G Lakshmisha IAS visit Highlights of 16-11-2026 #ias #visit #highlights #ntrdistrict #vijayawada
2
164
News paper clippings of NTR District Dated 17-11-2026 #newspaper #clippings #ntrdistrict #andhrapradesh #vijayawada
2
304
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, IAS జిల్లా కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. #NTRDistrict #GramPanchayatElections #NominationProcess #ElectionMonitoring #ElectionPreparedness
1
1
6
407
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో 73 గ్రామ పంచాయతీలు, 856 వార్డులకు 1,001 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 17 చివరి తేదీ కాగా, నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతాయి. #NTRDistrict #GramPanchayatElections #NominationProcess #ElectionPreparedness #AndhraPradesh @IPR_AP @apdigitalcorp
1
4
377
ఎన్‌టీఆర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ, IAS జిల్లాలో మూడు విడతల్లో 288 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు, 3,287 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల విధుల కోసం 9,782 మంది సిబ్బందిని గుర్తించారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి రవాణాకు 511 వాహనాలు, భద్రత కోసం 2,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా పోలింగ్ తేదీలు: - మొదటి విడత: నవంబర్ 26 - రెండవ విడత: నవంబర్ 29 - మూడవ విడత: డిసెంబర్ 2 సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా, వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందించనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454 ను సంప్రదించాలి. అర్హులైన ప్రతి ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. #NTRDistrict #GramPanchayatElections #LocalBodyElections #ElectionPreparedness #Democracy
3
326
ఎన్‌టీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో విజయవాడ రూరల్, ఇబ్రహీంపట్నం, జి. కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లోని గ్రామ పంచాయతీలకు 26-11-2026న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ విడతలో మొత్తం 73 గ్రామ పంచాయతీలు, 856 wards, 1,001 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం చేపడుతోంది. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటూ, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది. #NTRDistrict #LocalBodyElections2026 #GramPanchayatElections
3
402
NTR District Newspaper Clippings Dated 13-11-2026 #ntrdistrict #newspaper #clippings #apnews
2
3
319
NTR District collector Dr G Lakshmisha IAS visit Highlights of 07-11-2026 #ias #visit #highlights #ntrdistrict #Vijayawada
3
344
🪔 జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు! 🎆 వెలుగుల పండుగ దీపావళిని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, సురక్షితంగా జరుపుకోవాలని ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ఆకాంక్షిస్తోంది. టపాసులు కాల్చేటప్పుడు తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించాలి. చిన్నపిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు పర్యవేక్షించాలి. తగినంత దూరం పాటిస్తూ, నీరు మరియు ప్రథమ చికిత్స సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలి. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ... జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు! #HappyDiwali2026 #SafeDiwali #GreenDiwali #SwachhDiwali #NTRDistrict #NTRDistrictAdministration
5
285
🪔 దీపావళి శుభాకాంక్షలు! 🪔 చెడుపై మంచి సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగుల విజయానికి ప్రతీక దీపావళి. ఈ దీపావళి ప్రతి ఇంటా ఆనందం, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. డా. జి. లక్ష్మీశ, IAS జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా #happydiwali💥 #deepavali2026 #ntrdistrict #greendiwali #SafeDiwali
1
5
262
జి. కొండూరు కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ IAS ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ IAS, జి. కొండూరు మండలంలోని కుంటముక్కల లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ, సిబ్బంది విధులు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. #ntrdistrict #mptcelections #zptcelections #gkonduru #Elections2026
4
379
ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎన్నికల పరిశీలకులు బి. విజయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఇబ్రహీంపట్నం కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు బి. విజయ్ కుమార్ తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లు, ఓట్ల లెక్కింపు విధానం, ఎన్నికల నిబంధనల అమలును పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. #NTRDistrict #MPTCElections #ZPTCElections #ElectionObserver #CountingCentres
3
152
కంచికచర్లలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా IAS ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కంచికచర్ల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా IAS తనిఖీ చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది విధులు, భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. #NTRDistrict #MPTCElections #ZPTCElections #CountingCentres
4
268
ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహణ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. జిల్లాలోని 9 కౌంటింగ్ కేంద్రాల్లో సుమారు 1,500 మంది సిబ్బంది, 1,500 మంది పోలీసులతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టారు. కౌంటింగ్ ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ ఎస్. నాగలక్ష్మి IAS పర్యవేక్షిస్తూ, ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. #NTRDistrict #MPTCElections #ZPTCElections #CountingProcess
2
163
దీపావళి వెలుగుల పండుగ కావాలి.. ప్రమాదాలకు నిలయంగా మారకూడదు – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ విజయవాడ కలెక్టరేట్‌లో దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాట్లు, భద్రతా నిబంధనలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. టపాసుల విక్రయాల కంటే ప్రజల ప్రాణ భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణహిత టపాసుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దుకాణాల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అధికారులు రోజుకు రెండుసార్లు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. #NTRDistrict #DiwaliSafety #SafeDiwali #greendiwali #Vijayawada
4
235
ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో విడత సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఐఏఎస్ పరిశీలించారు. జిల్లాలోని 9 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుండగా, ప్రతి కేంద్రంలో 1,500 మంది సిబ్బంది, 1,500 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. #ntrdistrict #mptcelections #zptcelections #electioncounting #ntrdistrictadministration
4
310