Office of Tummala (@TummalaOfficial) header
Office of Tummala (@TummalaOfficial) profile picture

Official Page Minister for Agriculture, Marketing, Cooperation and Handlooms & Textiles.

TG Secretariat
Joined September 2025
Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)Photo by Office of Tummala (@TummalaOfficial)
Telangana Agriculture Minister Sri Tummala Nageswara Rao Garu personally called on Union Minister for Agriculture & Farmers’ Welfare **Sri Shivraj Singh Chouhan** at his residence in Bhopal today and conveyed his heartfelt condolences on the demise of his mother. He expressed deep sympathy to the bereaved family, acknowledging the irreplaceable place of a mother and praying to the Almighty to grant them strength and fortitude during this hour of grief. He was accompanied by Agriculture Secretary Sri Surendra Mohan,IAS, Director of Agriculture Sri Gopi, IAS and Special Secretary (Cooperation) Sri Rahul Raj,IAS who also conveyed their condolences. #ThummalaNageswaraRao #ShivrajSinghChouhan #TelanganaAgriculture #Condolences #Bhopal @ChouhanShivraj @TelanganaCMO
54
📅 తేదీ: 03.11.2026 📌 విషయం: నవంబర్ 30న హైదరాబాద్‌లో IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొనాలని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆహ్వానం – తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట. 🌴 నవంబర్ 30న ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశం 🤝 ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆహ్వానించిన అసోసియేషన్ ప్రతినిధులు 🌱 తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత – మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు 🏛️ సచివాలయంలో మంత్రిని కలిసిన IVPA ప్రతినిధులు ఈ రోజు హైదరాబాద్‌లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) ప్రతినిధులు కలిశారు. 📅 ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న IVPA గ్లోబల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రిని ఆహ్వానించారు. 🌾 ఈ సమావేశంలో తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు భవిష్యత్తు, రైతుల అభ్యున్నతి, పంట ఉత్పాదకత పెంపు, పరిశ్రమల భాగస్వామ్యం తదితర అంశాలపై ప్రసంగించాలని కోరారు. 🌴 ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వ సహకారం ఈ సందర్భంగా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.. ✅ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు విస్తరణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ✅ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును చేపడుతున్న అన్ని కంపెనీలకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు. 🏭 ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం 🌿 గోద్రెజ్, పతంజలి, హిందుస్థాన్ యునిలీవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. 🏗️ ఆయా కంపెనీల కార్యకలాపాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. 🌱 ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్ పామ్ విత్తనాల అభివృద్ధి 🔬 ఇటీవల గోద్రెజ్ కంపెనీ దేశంలోనే తొలిసారిగా ఆరవ తరం హైబ్రిడ్ ఆయిల్ పామ్ విత్తనాల అభివృద్ధి కోసం సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని మంత్రి వివరించారు. 🤝 ఇందుకు అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. 📈 తెలంగాణలో ఆయిల్ పామ్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఇతర ప్రముఖ కంపెనీలు సైతం తెలంగాణలో ఆయిల్ పామ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 🌦️ ఎల్‌నినో నేపథ్యంలో నూనెగింజల సాగుకు ప్రాధాన్యత 💧 ప్రస్తుతం ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యత, పంటల సాగు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని నూనెగింజల పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని మంత్రి అభిప్రాయపడ్డారు. 🇮🇳 వంట నూనెల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి 🛢️ దేశీయంగా వంట నూనెల అవసరాలను తీర్చుకోవడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగు విస్తరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. 👨‍🌾 రైతులకు మెరుగైన ఆదాయం – వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి 💰 రైతులకు మెరుగైన ఆదాయం కల్పించడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. 👥 సమావేశంలో పాల్గొన్నవారు ఈ సమావేశంలో వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ (APC) మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్ గారు, IAS, ఇండియన్ వెజిటేబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) ప్రతినిధులు పాల్గొన్నారు. 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #OilPalmCultivation #TelanganaAgriculture #IVPAGlobalRoundTable #EdibleOilProduction #OilseedsDevelopment
5
1
4
287
**Integrated Farming: A Pathway to Sustainable and Assured Daily Income for Farmers!** Hon’ble Agriculture Minister **Sri Thummala Nageswara Rao** emphasised the importance of integrated farming, crop diversification and allied agricultural activities in transforming agriculture into a sustainable and remunerative livelihood. The 113th episode of *Rythu Nestham* showcased the inspiring journey of **Major C.H. Naveen Kumar**, an ex-serviceman from Vaddapally, Nizamabad, who has successfully integrated organic farming, dairy, poultry, fisheries, horticulture and bio-input production across 15 acres. The Minister called upon farmers to draw inspiration from such models and adopt farming practices suited to their land, water resources and local climatic conditions. In view of anticipated **El Niño conditions**, he stressed the need to prioritise millets and fodder crops during the ensuing Yasangi season, alongside efficient water management and micro-irrigation. Against the backdrop of **Cyclone Murasu**, farmers were advised to temporarily defer harvesting operations to minimise potential crop losses. The Minister also underscored farmer safety, advocating responsible pesticide usage, protective equipment and greater awareness at the grassroots level. **A forward-looking approach towards climate-resilient agriculture, diversified livelihoods and prosperous farmers.** Also present -@DirectorAgriTS Sri B. Gopi, IAS & APC Sri Surendra Mohan, IAS. #RythuNestham #TelanganaAgriculture #IntegratedFarming #NaturalFarming #ClimateResilientAgriculture #FarmerWelfare @TelanganaCMO @PjtsauIndia
3
5
389
Telangana is setting its sights on a transformative future for agricultural marketing, envisioning AI-powered Digital Market Yards that could serve as a national model. Hon’ble Minister for Agriculture, Marketing & Cooperation Sri Thummala Nageswara Rao, along with Hon’ble Minister Sri Duddilla Sridhar Babu, chaired a high-level review meeting with senior officials to advance this pioneering initiative. With a clear vision to study and build upon the best digital market practices across the country, Telangana aims to develop a comprehensive, AI-driven ecosystem integrating every stage of agricultural marketing—from farmer registration, quality assessment and e-bidding to transparent price discovery, weighing, payments and digital gate passes. The initiative seeks to eliminate manual intervention, curb malpractices, strengthen institutional accountability and ensure fair and remunerative prices for farmers through technology-led transparency. The Ministers also reviewed the progress of the Koheda Integrated Fruit Market, directing officials to initiate tenders within a week and complete Phase-I by March 2027, accelerating the development of an internationally benchmarked fruit marketing hub. Director of Marketing Sri Rahul Raj and senior Marketing Department officials participated in the review. From conventional mandis to intelligent digital markets — Telangana is envisioning a new benchmark in agricultural marketing. #Telangana #AI #DigitalAgriculture #MarketReforms #AgriculturalMarketing #KohedaFruitMarket @TelanganaCMO @OffDSB
1
1
1
8
516
📅 తేదీ: 30.10.2026 📍 రాజేంద్రనగర్, హైదరాబాద్ 🌍🌱 *విషయం: వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ – తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి గారు, IAS* 🌿 గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ 🌱 భారతదేశంలో వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో పర్యావరణ ఒడిదుడుకులను తట్టుకునేందుకు దీటైన మార్గంగా, గేమ్ చేంజర్‌గా క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ ఉండనుందని పర్యావరణ నిపుణులు అన్నారు. గ్రామీణ యువతకు భవిష్యత్తులో ఈ రంగం ప్రధాన ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు అభిప్రాయపడ్డారు. వెదర్ ఫోర్‌కాస్టింగ్, క్లైమేట్ చేంజ్ వంటి పదాలు, వాటి ప్రాముఖ్యత ప్రస్తుతం రైతులు, ప్రజల జీవనంలో ఒక భాగమయ్యాయని అన్నారు. వెదర్ డేటాబేస్ సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అన్నారు. 🌦️ వాతావరణ విపత్తులను ఎదుర్కోవడంలో కృత్రిమ మేధస్సు పాత్ర 🤖 పర్యావరణ మార్పుల వల్ల కలిగే ఎల్ నినో, తుఫానుల వంటి విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని, రైతులకు ఆ ఫలితాలు చేరేలా చూడాలని తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి గారు, IAS అన్నారు. 🌾 వాతావరణ సమాచారం రైతు స్థాయిలో అందుబాటులో ఉంటే, రైతులు తమ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని, ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సాగులో ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతుందని ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు కూడా చెబుతున్నాయని గుర్తు చేశారు. 🏛️ జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్ 📍 కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్, అగ్రిబిజినెస్ మోడలింగ్’పై అక్టోబర్ 30, 31 తేదీల్లో హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా హాజరై డా. బి. గోపి గారు, IAS మాట్లాడారు. 🌤️ వాతావరణ అంచనాలు మరింత వాస్తవికంగా ఉండాలి 🌦️ వెదర్ ఫోర్‌కాస్ట్‌లు మరింత వాస్తవికంగా ఉండాలని డా. బి. గోపి గారు కోరారు. స్థానిక రైతులు సాగు చేయాల్సిన పంటలను నిర్ణయించుకునేందుకు ఉపయోగపడేలా భవిష్యత్తులో వాతావరణ సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. 📊 డిజిటల్ క్రాప్ డేటాబేస్‌లో 55 లక్షల మందికి పైగా రైతుల సమాచారం 👨‍🌾 తెలంగాణ రాష్ట్ర డిజిటల్ క్రాప్ డేటాబేస్‌లో 55 లక్షల మందికి పైగా రైతుల సమాచారం ఉందని, కేంద్ర పథకాలు, పంట రుణాలు, వాతావరణ సమాచారాన్ని రైతులకు చేరవేయడం వంటి అంశాల్లో ఈ డేటాబేస్ భవిష్యత్తులో ఉపయోగపడుతుందని డా. బి. గోపి గారు, IAS తెలిపారు. 🛰️ వాతావరణ అంచనాల్లో సాంకేతిక పురోగతి 🌐 లాంగ్ రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్‌లో 150 కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయి నుంచి ఆరు కిలోమీటర్ల రిజల్యూషన్ స్థాయికి ఎదగగలిగామని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఔట్రీచ్ వింగ్ అడ్వైజర్, హెడ్ డాక్టర్ జె.వి. సింగ్ గారు అన్నారు. 💻 భారతదేశంలో హైపర్‌ఫార్మెన్స్ కంప్యూటర్ల అనుసంధానంతో ప్రపంచ వాతావరణ అంచనాల్లో నాలుగో స్థానంలో ఉన్నామని, 11,980 కిలోమీటర్ల తీరప్రాంత పరిధికి సంబంధించిన అంచనాలను సైతం ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఈ వాతావరణ అంచనాలు పరిశోధన స్థాయి నుంచి పూర్తిగా క్షేత్రస్థాయికి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 🎓 అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం 🌱 80వ దశకంలో మొదలైన వెదర్ ఫోర్‌కాస్టింగ్ నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి అత్యంత కచ్చితత్వంతో రైతులకు, ప్రజలకు వాతావరణ సలహాలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకోవడం అభినందనీయమని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, బ్రెయిన్‌స్టార్మింగ్ వర్క్‌షాప్‌కు అధ్యక్షత వహించిన డాక్టర్ దండ రాజిరెడ్డి గారు అన్నారు. 🌾 ఇకపై ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అగ్రిబిజినెస్ మోడలింగ్‌కు అన్వయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 📚 క్లైమేట్ ఇంటెలిజెన్స్ పుస్తకాల ఆవిష్కరణ 📖 ఈ వర్క్‌షాప్‌కు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారం అందిస్తోంది. ఈ సందర్భంగా ‘క్లైమేట్ అనలిటిక్స్’, ‘క్లైమేట్ ఇంటెలిజెన్స్’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. 👥 కార్యక్రమంలో పాల్గొన్నవారు 👨‍🌾 కార్యక్రమంలో క్లైమేట్ నిపుణులు, విశ్వవిద్యాలయ అధికారులు, ప్రొఫెసర్లు, రైతులు, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, తెలంగాణ @GopiB_IAS #ClimateIntelligence #ClimateSmartAgriculture #ArtificialIntelligence #TelanganaAgriculture
2
8
382
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడుతున్న కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత వానాకాలం పంటను అన్ని విధాలా కాపాడాలని, రాబోయే యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. #ఖమ్మంకలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఖమ్మం #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి పారుదల, మిషన్ భగీరథ, వ్యవసాయం, భూగర్భ జలాలు, మార్కెటింగ్, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులు తమ శాఖల ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కరువు పరిస్థితులు, మండలాల వారీగా భూగర్భ జలాలు తగ్గుతున్న తీరుపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు నాటికి, వచ్చే నెలలో భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉండబోతుందనే అంచనాలను ప్రజలకు వివరించాలని, అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఎంతో కష్టపడి సాగు చేస్తున్న వానాకాలం పంటను కాపాడేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెండవ పంట సాగు చేస్తే రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. రాబోయే యాసంగి సీజన్‌లో సాగునీటి లభ్యత ఉండే అవకాశం లేదని మంత్రి తెలిపారు. రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండాలని, పప్పుధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, ఇతర తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని, రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఉద్యాన పంటలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బిందు సేద్యం ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. రెండవ పంటకు సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి తక్కువ నీటితో పండే పంటలకు తడులు అందించే అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఎక్కడా పంట వ్యర్థాలను తగులబెట్టకుండా చూడాలని, పంట వ్యర్థాలు తగులబెట్టిన ఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కిన్నెరసాని నీటిని యాసంగి పంటలకు విడుదల చేయవద్దని, అవసరమైతే మిషన్ భగీరథ త్రాగునీటి అవసరాలకు వినియోగించాలని ఆదేశించారు. నాగార్జునసాగర్ పరిధిలోని రెగ్యులేటర్లు, షట్టర్లు, పంపిణీ వ్యవస్థలను మూసివేసి, పాలేరు వరకు ప్రధాన కాలువల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువలో మూడు పంప్‌హౌస్‌లను వినియోగించి సాధ్యమైనంత ఎక్కువ నీటిని నిల్వ చేయాలని తెలిపారు. పాలేరు రిజర్వాయర్ మూడు జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా నీటి నిల్వలను సమర్థంగా నిర్వహించాలని అన్నారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సమీపంలో ఇసుక బస్తాలతో అడ్డుకట్టను పెంచి సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది నీటి ఆవిరి నష్టాలు, ఇంకుడు నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సమయాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రించాలని, పైపులైన్ల లో లీకేజీలను అరికట్టి నీరు వృథా కాకుండా చూడాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూలై వరకు త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. త్రాగునీటిని వాహనాల శుభ్రత, తోటల పెంపకం వంటి అవసరాలకు వినియోగించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. నీటి వినియోగాన్ని క్రమంగా తగ్గించుకునే అలవాటును ప్రజల్లో పెంపొందించాలని సూచించారు. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా గ్రామాల్లో పాత త్రాగునీటి సరఫరా పథకాలను పునరుద్ధరించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన చోట వ్యక్తిగత బోర్లు, ఓవర్‌హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గ్రామాల్లో త్రాగునీటి పథకాల పునరుద్ధరణకు అవసరమైన నిధులు, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. ప్రతి గ్రామంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
2
2
19
1,018
Office of Tummala retweeted
Attended the Cabinet Sub-Committee Meeting on El Niño along with Deputy Chief Minister @Bhatti_Mallu, Ministers @TummalaOfficial, @seethakkaMLA , @INC_Ponguleti, @Vakiti_srihari, Chief Secretary Sanjay Jaju and officials at Secretariat today. P. Anil Kumar, Photojournalist
2
14
30
1,168
పత్తి రైతులకు ధరల భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర చర్యలు. 2026–27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో పత్తి కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార మరియు చేనేత, జౌళి శాఖల మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. • పత్తి కనీస మద్దతు ధర: క్వింటాల్‌కు రూ.8,667 • రాష్ట్రవ్యాప్తంగా 133 సీసీఐ కొనుగోలు కేంద్రాలు • 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై • కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు • రైతులకు సకాలంలో, పారదర్శకంగా చెల్లింపులు • కపాస్ కిసాన్ యాప్ ద్వారా డిజిటల్ సేవలు • టోల్‌ఫ్రీ నంబర్: 1800-599-5779 • వాట్సాప్ సేవలు: 8897281111 మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తగ్గిన సందర్భంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. పత్తిని విక్రయించే ముందు నాణ్యత, తేమ శాతాన్ని తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, నాణ్యమైన పత్తిని అందించడం ద్వారా మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పత్తి కొనుగోళ్లలో పారదర్శకత, వేగవంతమైన చెల్లింపులు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే తెలంగాణలో పత్తి ఆధారిత ప్రాసెసింగ్, స్పిన్నింగ్ పరిశ్రమల విస్తరణకు అవసరమైన చర్యలు చేపట్టి, స్థానికంగా పత్తికి డిమాండ్ పెంచేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. #CottonProcurement #CottonFarmers #Telangana #TummalaNageswaraRao #MSP #cmdcci – at Hyderabad, India
3
4
1
9
974
Office of Tummala retweeted
🟦ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు అండగా ‘రైతు పొలాల్లోకి ఆవిష్కరణలు’ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. ఐకార్‌, ఇక్రిశాట్‌ సహకారంతో ఈ నెల 31 వరకు 12 పరిశోధన కేంద్రాల్లో కార్యక్రమం కొనసాగనుంది. #Agriculture @TummalaOfficial @icarindia @ICRISAT
1
4
239
Today Minister @Tummala_INC in AV meet with @ChouhanShivraj welcomed the Centre’s #KhetiBachaoAbhiyaan and stated that the Government of Telangana would organise the programme at the state level, involving institutions, universities, government departments and district administrations. Highlighting drought-like conditions in **315 mandals** due to inadequate rainfall and #ElNino, he said the State Government had directed officials to assess crop conditions, conserve available water, and ensure irrigation and electricity supplies to protect crops until harvest. He urged the Centre to provide **immediate assistance and a special additional budget for micro-irrigation and dryland crop seeds** in view of the prevailing conditions. On fertilizer pricing, he called for rationalisation of fertilizer prices and subsidies, noting that the higher subsidy on urea makes it considerably cheaper than other fertilizers, encouraging excessive use and harming soil health. He stressed the need to promote balanced fertilizer use without imposing an additional burden on farmers. He further sought **guaranteed MSP procurement of all major crops, particularly maize and jowar**, to encourage crop diversification towards maize, jowar, pulses, oilseeds and other crops, along with the removal of the existing **25% procurement limit under the Price Support Scheme (PSS)**. Emphasising the need to support agricultural labourers during drought-like conditions, he requested enhanced allocations under #VB-G RAM G, with priority for agriculture-related works, including farm pond construction, water conservation and land development. He stressed that awareness programmes alone would not suffice and that farmers must receive timely financial assistance and guaranteed market support for their produce. #Telangana #FarmersWelfare #Agriculture #MSP #VB-G RAM G #WaterConservation #JaiHind @TelanganaCMO @AgriGoI
1
3
8
607
**Strengthening Centre–State cooperation for Telangana’s progress!** Hon’ble Minister for Agriculture, Marketing, Cooperation, Handlooms & Textiles, Sri Thummala Nageswara Rao Garu, met Union Minister for Coal & Mines, Sri G. Kishan Reddy Garu, in Hyderabad today and submitted representations seeking Central support for key development priorities of Telangana. The key issues raised include: 🔹 Allocation of Mahanadi coal to the Yadadri Thermal Power Plant, as requested by the Hon’ble Chief Minister, to ensure uninterrupted power generation. 🔹 Allocation of the Sathupalli Block-III coal block to Singareni Collieries Company Limited (SCCL) to facilitate efficient and timely coal mining operations. 🔹 A permanent solution to recurring technical and production issues at Ramagundam Fertilizers and Chemicals Limited (RFCL), ensuring uninterrupted urea supplies to Telangana farmers, particularly during the Rabi season. 🔹 Sanction of ₹100 crore in Coal India CSR funds for Dr. Manmohan Singh University of Earth Sciences, Kothagudem, to strengthen educational infrastructure and research facilities. 🔹 Expediting approvals for the proposed Greenfield Airport in Bhadradri Kothagudem district to improve connectivity and promote industrial, economic and tourism development. 🔹 Fast-tracking key railway projects in Telangana, with priority for the Sathupalli–Kovvuru and Penuballi–Kondapalli railway lines. 🔹 Expediting the Pandurangapuram–Malkangiri railway line up to Sarapaka, in view of the upcoming Godavari Pushkarams, to improve connectivity for tribal and underserved regions and facilitate pilgrims visiting the Sri Sita Ramachandra Swamy Temple at Bhadrachalam. Union Minister Sri G. Kishan Reddy Garu responded positively and assured that the representations would be taken up with the concerned Union Ministries. He also spoke with the CMD of Coal India Limited over the phone and requested immediate action on the proposal for CSR funding to the University of Earth Sciences. The Hon’ble Minister Sri Thummala Nageswara Rao Garu reiterated the need for coordinated efforts between the Centre and the State to accelerate infrastructure development, strengthen agriculture, improve connectivity and create new opportunities for the people of Telangana. **Working together for a stronger, more prosperous Telangana!** #TelanganaDevelopment #Singareni #CoalIndia #RFCL #RailwayDevelopment #YadadriThermalPowerPlant #Bhadrachalam #GodavariPushkaralu #FarmersWelfare #InfrastructureDevelopment @TelanganaCMO @kishanreddybjp· @CoalIndiaHQ · @RailMinIndia · @MoCA_GoI · @DofgoiOihsdo
1
1
8
636
Office of Tummala retweeted
ఎల్‌నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి ప్రకోపించడంతో తలెత్తిన ఈ విపత్తును ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలని కోరారు. ✅#ElNino వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ✅ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిల పక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి సహకారం కోరుతామని చెప్పారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి గారు అన్ని శాఖలను అప్రమత్తం చేశారు. ✅ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశమై ఎల్‌నినో ప్రభావం, వర్షాభావం, సాగు, తాగునీటి ఎద్దడి, తద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ✅అనంతరం ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @TummalaOfficial గారు, @jupallyk_rao గారు, @Ponnam_INC గారు, @INC_Ponguleti గారు, @seethakkaMLA గారు, @VivekVenkatswam గారు, @Vakiti_srihari గారు, ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి గారు, @harkararao గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ✅ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలపై ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి గారు వివరించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ✅"సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలి. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, ఉన్న నీటిని తాగడానికి వినియోగించుకోవాలి. ✅ఎల్‌నినోను ఎదుర్కొనడానికి ప్రజలకు అండగా నిలబడాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ప్రచారం నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందించలేక పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవడమే కాకుండా మోటార్లు, మీటర్లు కాలిపోయే పరిస్థితులు తలెత్తుతాయి. పెద్దమనసుతో ఒక సీజన్‌ను వాయిదా వేసుకోవాలి. ✅రైతులతో పాటు ఈ సంక్షోభ పరిస్థితుల్లో భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకోవలసిన అవసరం ఉంది. ఈసారి 2.5 లక్షల మంది ఉపాధి హామీ కూలీ పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ పనుల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి గారికి సూచించడం జరిగింది. ✅ప్రస్తుత కాలంలో పంట నష్టపోయిన వారికి, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి నుంచి సహకారం అందించాలి. ✅మార్చి నెలలో ఉండే ఎండలు ఇప్పుడే ఉన్నాయి. 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కాలంలో నీరు, విద్యుత్ విషయంలో తీవ్ర సమస్య ఎదుర్కోబోతున్నాం. ✅ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వర్షాకాలం ప్రారంభం నుంచి చెబుతూవచ్చాం. గడిచిన 3 సంవత్సరాల్లో సగటున 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈరోజు 20 వేల మెగావాట్లకు చేరుకుంది. ✅2014-15 నాటికి సగటున 6500 – 7,000 మెగావాట్ల వినియోగం ఉండగా, ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల వినియోగం పెరిగింది. గడిచిన రెండేళ్లలో ఆరేడు వేల వినియోగం పెరిగింది. ఈ పరిస్థితుల్లో కూడా రైతులకు, పరిశ్రమలకు వీలైనంత మేరకు విద్యుత్ అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నాం. ✅ఇంకో 15 - 20 రోజుల్లో వర్షాకాలం పంటలు కోతలు అయిపోతాయి. చేతికొచ్చిన పంట ఎండిపోకూడదు. రైతుకు నష్టం, కష్టం రాకూడదు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో.. మార్కెట్‌లో ఎక్కడ, ఏ రేటుకు దొరికినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ✅తెలంగాణ మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాలు విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఉత్పత్తికన్నా వినియోగం పెరగడంతో విద్యుత్ లభించని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాం. ✅చలికాలం ప్రారంభానికి ముందే రిజర్వాయర్లు వట్టిపోయే పరిస్థితులు వచ్చాయి. పోయిన సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరుండగా, ఇప్పుడు 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ✅అందుబాటులో ఉన్న నీటిని రాబోయే జూన్ వరకు 8 నుంచి 10 నెలలు పొదుపుగా వాడుకోవలసిన అవసరముంది. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. ✅ప్రపంచంలోని దాదాపు వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తీవ్రమైన నీటి ఎద్దడి, ఎండ వేడిమితో పాటు రకరకాల సమస్యలు ఉత్పన్నం కాబోతున్నాయని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించారు. ✅ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎల్‌నినో ప్రభావం మొదటగా రైతాంగంపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సాగునీరు, తాగునీరుతో పాటు విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. తద్వారా పరిశ్రమలు, ప్రజా జీవితం, దినసరి కార్యక్రమాలపైన కూడా తీవ్రమైన ప్రభావం పడనుంది. ✅కనీవినీ ఎరుగని విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఉత్పత్తి చేయగలిగిన రాష్ట్రాల నుంచి కేంద్రం సెంట్రల్ పూల్ నుంచి రాష్ట్రానికి సబ్సిడీపై అదనంగా విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన అవసరాలకు అనుగుణంగా రాబోయే 10 నెలల వినియోగం ఎంత అవసరమో అంచనా వేసి అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆశిస్తున్నాం. ✅ఒక విపత్తు సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి. ఈ ప్రకృతి విపత్తును జయించడానికి అందరి సహకారం కావాలి. ✅ఎల్‌నినో విపత్తుకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరూ వ్యాప్తి చేయొద్దు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో 24 గంటల పాటు ప్రజలకు సరైన సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాం. ✅ అపోహలు, తప్పుడు ప్రచారం కల్పించకుండా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ✅సాగునీరు, తాగునీటిని ఆదా చేసుకోవడం, కూలీలకు పనులు కల్పించడంతో పాటు పశువులకు గ్రాసం, తాగునీరు అవసరాలకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఆరోగ్య పరంగా ఏ కష్టమొచ్చిన నిరుపేదలను ఆదుకోవడానికి వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేస్తున్నాం" అని ముఖ్యమంత్రి గారు సవివరంగా తెలిపారు. ✅ఈ విపత్తు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో సబ్ కమిటీని నియమించారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం అందించడానికి సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావు గారిని నోడల్ అధికారిగా నియమించారు. #Telangana #RainfallDeficit #WaterConservation #PowerCrisis #ClimateChange #DroughtManagement #PublicAwareness
17
37
99
23,379
Transforming Telangana’s Market Yards through Digitalisation, Renewable Energy and Modern Infrastructure Hon’ble Minister for Agriculture, Marketing, Cooperation, Handlooms & Textiles, Sri Thummala Nageswara Rao, reviewed the development and modernisation of market yards with Marketing Department Director Rahul Raj at the Secretariat. Hyderabad Growth Corridor MD Upender Reddy, who coordinated on the Koheda market development is also present. He directed officials to accelerate reforms to ensure transparent operations, efficient agricultural marketing and improved services for farmers. The Minister directed the end-to-end digitalisation of all market yards, covering vehicle entry, produce arrivals, weighing, sales transactions, payments and vehicle exit. He also instructed officials to develop an online payment system for farmers to strengthen transparency, accountability and efficiency and reduce irregularities. The Marketing Department must submit comprehensive digitalisation proposals to the government within 15 days. To promote sustainable infrastructure, the Minister directed officials to install solar power systems across all operational market yards. Work is already underway at 10 market yards, with phased implementation planned for the remaining facilities. He called for modern silos that maximise storage capacity while minimising land use and directed officials to develop infrastructure to increase the Marketing Department’s warehousing capacity to 2 lakh metric tonnes, improving storage facilities for agricultural produce. The Minister also directed the department to expedite the recruitment of engineering personnel through TGPSC or JNTU to address technical staff shortages and accelerate infrastructure development. He instructed officials to establish a new market at Aziznagar and revive underutilised integrated markets in Toopran, Gajwel, Suryapet and other locations to improve farmer access. Following the directions of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, he also coordinated with Hyderabad Growth Corridor MD Upender Reddy to expedite development of the Koh-e-Faiz Market at Koheda. The Minister stressed coordinated action across departments to build modern, efficient and farmer-centric market infrastructure throughout Telangana. @TelanganaCMO @AgriGoI #Telangana #AgriculturalMarketing #Digitalisation #SolarEnergy #FarmerWelfare #MarketModernisation #AgricultureInfrastructure
1
2
618
🌾 Strengthening Agricultural Preparedness & Digital Farming in Telangana Hon’ble Minister Sri Tummala Nageswara Rao chaired a review meeting with senior officials at the Secretariat on agricultural preparedness, crop conditions, oil palm expansion, farm mechanisation and warehouse construction. In view of the anticipated El Niño impact and the possibility of reduced paddy cultivation and fodder shortages during the upcoming Yasangi season, the Minister directed officials to take precautionary measures. Highlighting that nearly 18 lakh acres of crop residues were burnt during the previous Rabi season, he stressed creating farmer awareness to prevent residue burning after the current Kharif harvest and promote its utilisation as cattle fodder. District Collectors will be advised to procure fodder wherever necessary and ensure its availability to farmers. In a separate meeting with German representatives of ACRAT, the Minister examined the potential of satellite data and Artificial Intelligence (AI) to assess soil nutrient availability, including nitrogen, phosphorus and potassium, and provide crop-specific fertiliser recommendations. The proposed technology could potentially deliver fertiliser-use advisories to nearly 70 lakh farmers every 12 days, helping identify nutrient deficiencies and excessive fertiliser application. Emphasising balanced nutrient management, soil health and reduced cultivation costs, the Minister directed officials to scientifically evaluate the technology’s accuracy, reliability and suitability for Telangana’s diverse soils and crops before considering implementation. He also instructed agricultural university scientists to collaborate with the German delegation and study its practical applicability. The meeting was attended by Agriculture Secretary, Agriculture Director , Cooperative Commissioner , HACA MD , Horticulture MD , Warehousing MD , AGROS MD , Agricultural University Vice-Chancellor , Horticultural University Vice-Chancellor, and delegation members Dr. Raghu Chaliganti (ITU-T SG20), Dr. Sebastian Bose (Fraunhofer HHI) and Mr. John Redlich (Bond Consulting GmbH), along with other senior officials. @TelanganaCMO @AgriGoI @icarindia #Telangana #DigitalAgriculture #SoilHealth #ClimateResilientAgriculture #FarmerWelfare
3
2
6
469
🇮🇳🤝🇬🇧 Telangana–UK Partnership to Transform the Technical Textiles Sector Hon’ble Minister for Agriculture, Marketing, Cooperation, Handlooms & Textiles, Sri Thummala Nageswara Rao, announced two strategic MoUs between the Government of Telangana and the UK’s University of Huddersfield and Textile Centre of Excellence (TCoE) to strengthen the State’s technical textiles ecosystem. The partnerships will promote: 🔹 Research, innovation & technology transfer 🔹 Advanced textile technologies, including 3D weaving and composite materials 🔹 Industry-oriented training and international-standard skill development 🔹 Academic collaboration, talent exchange and investment opportunities These initiatives mark a significant step towards building a globally competitive, innovation-driven textile sector in Telangana. The meeting was attended by Bhongir MP Chamala Kiran Kumar Reddy; @kiran_chamala Special Chief Secretary, Handlooms & Textiles, Sabyasachi Ghosh; Mandy Ridyard, Business Adviser to the Mayor of Yorkshire; David Antich, MD, Antich & Sons (Huddersfield) Ltd; Professor Goswami, Technical Textiles; Aziz, MD, Textile Centre of Excellence; and senior departmental officials. @TelanganaCMO @TexMinIndia #Telangana #TechnicalTextiles #TextileInnovation #SkillDevelopment #GlobalPartnerships #MakeInIndiaPosting
2
1
5
394
🌾 ఎల్ నినో ప్రభావం: యాసంగిలో వరి సాగు వద్దు, స్వల్పకాలిక పంటలే మేలు 📺 రైతు నేస్తం 110వ ఎపిసోడ్‌లో రైతులకు ప్రభుత్వ పిలుపు 📍 హైదరాబాద్, అక్టోబర్ 12: 🌦️ ఎల్ నినో ప్రభావంతో రాబోయే యాసంగి (రబీ) సీజన్‌లో వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉంది. 💧 అందువల్ల రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, తక్కువ నీటితో తక్కువ కాలంలో పండే పంటలను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సోమవారం నిర్వహించిన "రైతు నేస్తం" ప్రత్యేక కార్యక్రమం 110వ ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన n ఓవీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. 👥 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి రైతులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. 🌾 🌡️ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రాబోయే నెలల్లో ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి, తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. 🌦️ జలాశయాల్లో పూర్తిస్థాయి నిల్వలు లేనందున వానాకాలంలో వరి, పత్తి విస్తీర్ణం తగ్గిందని చెప్పారు. వానాకాలానికి ముందు నుంచే రైతులను సంసిద్ధులను చేయడంతో పప్పుధాన్యాల విస్తీర్ణం పెరిగిందని వివరించారు. 🫘 యాసంగిలో పరిస్థితి మరింత తీవ్రమై భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున, రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయవద్దని కోరారు. అన్ని శాఖల సమన్వయంతో వాస్తవ పరిస్థితులపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. 🤝 🌱 వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ కె. సురేంద్ర మోహన్, గారు ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ, ఎల్ నినో నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పంటల సరళి, పప్పుధాన్యాల విస్తీర్ణం పెరుగుదల, వరి విస్తీర్ణం తగ్గుదల వంటి వివరాలను తెలియజేశారు. ఈ యాసంగిలో నూనెగింజలు, పప్పుధాన్యాల పంటలకు సబ్సిడీ అందించి, రైతులను ఆ పంటల వైపు మళ్లిస్తామని చెప్పారు. 🌻🫘 👨‍🌾 వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితులపై గత ఆరు నెలలుగా ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమై రైతులకు సాంకేతిక సలహాలు అందిస్తోందన్నారు. ప్రస్తుత వాతావరణ ప్రభావంతో పంటలకే కాకుండా తాగునీటికి కూడా కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 💧 రైతులు తమ పొలాల్లోని భూగర్భ జలాలు, నీటి వసతిని పరిశీలించుకుని, దానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. 🌱🥬 నీటిని ఆదా చేసే డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మసేద్య పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. 🚿 నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున, "రైతు నేస్తం" కార్యక్రమం ద్వారా ప్రతి వారం వాతావరణ సమాచారాన్ని రైతులకు అందిస్తామని తెలిపారు. 🌦️ రైతులు సరైన నిర్ణయం తీసుకునేలా అన్ని శాఖలు కలిసి కృషి చేయాలని సూచించారు. 🤝 💧 నీటిపారుదల శాఖ, భూగర్భ జల శాఖ, విద్యుత్ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను రైతులకు వివరించారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఫోన్ ద్వారా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 📞 వ్యవసాయ సంచాలకులు డాక్టర్ బి. గోపి, గారు, ఐఏఎస్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. 👥 🔬 ఈ ఎపిసోడ్‌లో భారత వాతావరణ శాఖ (హైదరాబాద్) శాస్త్రవేత్త-డి డాక్టర్ శ్రావణి ఎల్ నినో ప్రభావం, వాతావరణ మరియు వర్షపాత పరిస్థితులను వివరించారు. 🌦️ యాసంగికి అనుకూలమైన పంటలపై ఆర్.ఏ.ఆర్.ఎస్. పాలెం ప్రధాన శాస్త్రవేత్త (నూనెగింజలు) డాక్టర్ డి. శశిభూషణ్, ప్రధాన శాస్త్రవేత్త (పప్పుధాన్యాలు) డాక్టర్ కె. రుక్మిణీ దేవి, సిడాట్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహదేవప్ప, ఎస్.కె.ఎల్.టి.జి.హెచ్.యు. కూరగాయల శాస్త్రవేత్త డాక్టర్ జె. శ్రీనివాస్ రైతులకు సూచనలు అందించారు. 🌻🫘🥬 అనంతరం శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి, ఎల్ నినో పరిస్థితులు, రబీ పంటల ప్రణాళికపై చర్చ జరిగింది. 🎙️🌾 @GopiB_IAS 🌾 వ్యవసాయ శాఖ, తెలంగాణ #ElNinoImpact #RabiCropPlanning #RythuNestham #AgricultureDepartmentTelangana
1
3
1
10
845
Hon’ble Minister Sri Thummala Nageswara Rao garu reviewed Horticulture & Oilfed initiatives at the Secretariat, directing officials to accelerate crop diversification amid El Niño concerns, expand horticulture, strengthen processing infrastructure and boost farmers’ incomes. 🌱 Expand horticulture, vegetable cultivation & inter-state markets 🌴 Oil palm: 10 lakh acres target; 2 lakh acres annually 🏭 Oil palm factories in every erstwhile district 🍫 Promote cocoa intercropping & procurement centres 🚜 Unified approach to farm mechanisation 👥 Fast-track Oilfed recruitment The goal is clear: diversify crops, strengthen value chains and maximise returns for farmers. Officials must translate these directives into time-bound action to build a resilient agricultural sector and secure sustainable prosperity for Telangana’s farmers. @TelanganaCMO @AgriGoI #Telangana #Agriculture #Horticulture #OilPalm #Farmers
2
2
6
393
Office of Tummala retweeted
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు ఈ నెల 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ✅వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ✅ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ✅కరువు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రూ. 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరింది. ✅వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై ముఖ్యమంత్రి గారు నిర్వహించే సమావేశంలో చర్చించే అవకాశముంది. #Telangana #Agriculture #ElNino #ElNinoImpact #DroughtConditions #RainfallDeficit
9
35
2
99
12,527
⭐ వైభవోపేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ నిర్వహించాలి.....రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , సహకార చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ⭐ అక్టోబర్ 12న అల్లీపురంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ఆలయ భూమిపూజ --------------------------- ఖమ్మం నగరంలోని అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు అధికారులను ఆదేశించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. శుక్రవారం #జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి మంత్రి భూమిపూజ ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 12వ తేదీ సోమవారం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించ నున్నట్లు తెలిపారు. త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుందని పేర్కొన్నారు. దేవదేవుని ఆశీస్సులతో ఖమ్మం నగరంలో స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టడం సంతోషకరమని తెలిపారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ బాధ్యత పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌తో పాటు ఖమ్మం నగరంలోనూ టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఆలయ భూమిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టాలని, ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చూడాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవాదాయ తదితర శాఖల అధికారులు సమన్వయం తో పనిచేయాలని, అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి శాఖకు నిర్దిష్టబాధ్యతలు అప్పగించాలని తెలిపారు. అధికారులు అంకితభావంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. తిరుమలలో అనుసరించే విధానాలను ఆదర్శంగా తీసుకుని భక్తుల రాకపోకలకు అనుగుణంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. భూమి పూజ ప్రాంగణం, భోజన కేంద్రాలు, ప్రసాద పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎక్కడా తొక్కిసలాటకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూమిపూజ కార్యక్రమానికి ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ స్వామి వారి ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి తెలిపారు. ప్రసాద పంపిణీ కేంద్రాలను పెంచాలని, ప్రసాదం కోసం వచ్చే భక్తులకు క్రమబద్ధమైన క్యూలైన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ సంఖ్యలో త్రాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. భక్తులు నాలుగు వైపుల నుంచి వచ్చే మార్గాలకు అనుగుణంగా పార్కింగ్ స్థలాలను గుర్తించాలని మంత్రి సూచించారు. పార్కింగ్ ప్రాంతాలు, వాహనాల రాకపోకల మార్గాలు, భక్తులు ప్రాంగణానికి చేరుకునే దారులకు సంబంధించిన వివరాలను మ్యాప్‌తో సహా సిద్ధం చేయాలని తెలిపారు. ఈ వివరాలను పోలీస్ శాఖ ద్వారా పాత్రికేయులకు అందించి, భక్తులకు ముందుగానే సమాచారం చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. పుష్కరాల తరహాలో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బంది, అవసరమైన వైద్య సదుపాయాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయంగా జనరేటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాంగణంలో నిరంతర పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని, అవసరమైన సిబ్బంది, యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. కార్యక్రమానికి వచ్చే పాత్రికేయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఆలయం నిర్మించడం ఈ ప్రాంత ప్రజలకు దేవదేవుడు అందించే గొప్ప ఆశీర్వాదమని పేర్కొన్నారు. తిరుమలలో పాటించే క్రమశిక్షణ, భక్తిభావం, నిర్వహణ విధానాలు ఖమ్మం ఆలయంలోనూ అమలవుతాయని తెలిపారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఆలయ భూమి పూజ కార్యక్రమానికి హాజరై దేవదేవుని ఆశీస్సులు పొందాలని మంత్రి కోరారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో విజయవంతం చేసేందుకు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. @TelanganaCMO @TelanganaCS @revanth_anumula @Bhatti_Mallu @TummalaOfficial @INC_Ponguleti
2
3
13
1,239