YV REDDY, Sr. Journalist (@YVNewsAll) header
YV REDDY, Sr. Journalist (@YVNewsAll) profile picture

Political News

Joined November 2021
Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)Photo by YV REDDY, Sr. Journalist (@YVNewsAll)
కూటమి ప్రభుత్వం కుట్రలు, పోలీసుల కుట్రలు బట్టబయలయ్యాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లిన కుట్రలో ప్రభుత్వ ఉద్యోగిని పావుగా వాడుకున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ను ఎత్తుకెళ్లడాన్ని అడ్డుకున్న YSRCP MLC అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు.. ముందుగా బస్సునుంచి బ్యాలెట్ బాక్స్‌ సిబ్బంది బయటకు తీశారని ఒప్పుకున్నారు జిల్లా ఎస్పీ. బ్యాలెట్ బాక్స్‌ బయటకు తరలిస్తున్నారనే ఉద్దేశంతోనే YSRCP నేతలు అడ్డుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. తాము YSRCP నేతలకు నచ్చజెప్పామని అర్థరాత్రి ఒంటిగంటకు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బ్యాలెట్ బాక్స్‌ను సమాచార లోపం వల్లే వైఎస్సార్సీపీ నేతల్లో ఈ అనుమానాలు కలిగాయని కలెక్టర్‌, ఎస్పీ చెప్పారు. అయితే అప్పిరెడ్డిపై మాత్రం బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు కేసు పెట్టిన పోలీసులు..ముందుగా చిన్న ఘటన అంటూ చెప్పిన జిల్లా అధికారులు..సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను దించడం వల్లే వివాదం రేగిందని ఒప్పుకున్న జిల్లా అధికారులు.. తర్వాత మాత్రం YSRCP నేతలు దాడి చేశారంటూ కేసులా..? తప్పు అయిందని అప్పిరెడ్డి దగ్గర ఒప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి వీడియో చూడండి #TDPKutralu #PoliceFakeStatement #APNews #AP #AndhraPradeshNews #YSRCP #LellaAppireddy #MLCLellaAppiReddy @YSRCParty @ysjagan @YSRCPEurope @YSRCPAmerica @KurnoolYSRCP @we_ysrcp @GULFYSRCP @ysrcpaustralia
5
6
624
ఏపీలో ప్రజాస్వామ్యం ఓడిపోయి.. పచ్చస్వామ్యం గెలిచింది..! ఏపీలో భారత రాజ్యాంగం ఓడిపోయి.. నారా రాజ్యాంగం గెలిచింది..! #YSRCP #TDP #AP #APNews #AndhraPradeshNews #APLocalBodyElections @ysjagan @YSRCPAmerica @YSRCPEurope @YSRCParty @GunturYSRCP @YSRCPGUDUR @ysrcpsm_plnd
4
1
17
847
చంద్రబాబు రక్షణ కవచాలు కులం, డబ్బు, ఎల్లో మీడియా..! చంద్రబాబు మేధావి కాదు మేధావిలా క్రియేట్ చేశారు. చంద్రబాబు పాలకుడు కాదు మంచి పాలకుడిలా క్రియేట్ చేశారు.. చంద్రబాబు ఆర్థిక వేత్తేమీ కాదు ఆర్దిక వేత్తలా క్రియేట్ చేశారు. చంద్రబాబు ఎకనామిక్స్‌ చదివినా .. ఆయనకు ఎకనామిక్స్ సిద్ధాంతాలు వంట పట్టలేదు. ఆయనకు రాజకీయాలకు వంటబట్టాయి.. ఆ రాజకీయాలు కుట్రలకు తెరలేపాయి. చంద్రబాబు సంపద సృష్టిస్తాను అన్నప్పుడల్లా భయపడాలి.. ఆయన అప్పులు సృష్టిస్తారు.. జనం నెత్తిన అప్పులు బండలు వేస్తారు. చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఆయన చేసే తప్పులన్నీ ఎదుటివారి మీద రుద్దడంలో బాగా దిట్ట. కళ్లు ఆర్పకుండా కాదు.. ఆయన .. ఆయన నాలుకకు కూడా తెలియకుండా అబద్ధం ఆడేస్తారు..! ఒక్కోసారి ఆయన నాలుక కూడా ఆశ్చర్యపోతుందేమో..! చంద్రబాబును రాజకీయంగా నిలబెడుతోంది మూడంటే మూడు..! 1.కులం 2. డబ్బు 3. ఎల్లో మీడియా 1.కులం: చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కులాన్ని నమ్ముకున్నాడు. తన చుట్టూ సొంత కులపోళ్లనే పెట్టుకున్నాడు. ఆయన చుట్టూ ఎంత మంది ఉన్నా చంద్రబాబు నమ్మేది ఆయన కులపోళ్లనే. అమరావతి కూడా గుంటూరు - కృష్ణా జిల్లాల మధ్య పెట్టాడు. అక్కడ ఆయన సామాజికవర్గానికి బలమెక్కువ. తన చుట్టూ తన సామాజిక వర్గాన్ని కోటలా పెట్టుకుంటున్నారు. 2. డబ్బు: చంద్రబాబుకు డబ్బు విలువ బాగా తెలుసు. తాను జనం మనిషిని కాదని.. మాస్‌ లీడర్‌ని కాదని చంద్రబాబుకు బాగా తెలుసు. సో.. డబ్బులు వెదజల్లాలి. అప్పుడు జనం వస్తారు. ఈ సూత్రాన్ని మొదట కనిపెట్టి డబ్బులు మూటలు రాజకీయాల్లోకి దించింది చంద్రబాబే. భారత రాజకీయాల్లో రూ.500 నోటు మొదట ఎన్నికల్లో పంచింది చంద్రబాబే. డబ్బుతో అన్ని వ్యవస్థలను, ఎవరినైనా మేనేజ్‌ చేయొచ్చు అని నమ్బి అమల్లోకి తెచ్చింది చంద్రబాబే. అంతేకాదు... తాను ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడు అని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే.. పొత్తు లేకుండా ఎన్నికలకు పోడు. ఎవరైనా ఎన్నికల్లో పోరాడుతారు.. చంద్రబాబు మాత్రం పొత్తు కోసం పోరాడుతారు. 3. ఎల్లో మీడియా: ఇక.. చంద్రబాబు సృష్టించిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఎల్లో మీడియా. చంద్రబాబు రాజకీయాలకు పునాది, శ్లాబ్ ఎల్లో మీడియానే. చంద్రబాబు రాజకీయ జీవితానికి కవచం ఎల్లో మీడియా. ఈ ఎల్లో మీడియా సోషల్ ఇంట్రస్ట్, పీపుల్ ఇంట్రస్ట్ ఉండదు. ఓన్లీ చంద్రబాబు పొలిటికల్ ఇంట్రస్ట్ మాత్రమే ఉంటుంది. చంద్రబాబు భావజాలాన్ని ప్రజల మెదళ్లల్లోకి ఇంజస్ట్ చేయడంలో ఎల్లో మీడియాది కీలక పాత్ర. చంద్రబాబు మీడియాను మరింత పెంచుకుంటున్నారు. ఇంకా పెంచుతారు.. మీడియా విలువ బాగా తెలిసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. అందుకే.. మీడియాలోకి బ్లాక్ మనీని తరలిస్తూ విస్తరిస్తున్నారు. పై మూడు తన రక్షణ కవచంగా చేసుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. లిక్కర్‌ పారించడంలో చంద్రబాబును మించినవారు లేరు. ఎన్టీఆర్‌ విధించిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసినప్పటి నుంచి మద్యం ఏరులై పారించినవాడు చంద్రబాబు. లిక్కర్‌ టెండర్లు తమ వారికే దక్కేలా చేసి.. వారిని ఆర్దికంగా బలపరిచి.. ఆ డబ్బులను ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టిస్తారు. ఇప్పుడు అమరావతిని తన ATMగా మార్చుకున్నారు చంద్రబాబు. అమరావతి ATM నుంచి వేల కోట్లు డ్రా చేసుకుంటూ.. ప్రజాధనం దోచుకుంటున్నారు. ఈ డబ్బు అంతా అక్రమ, వక్ర మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లి... మళ్లీ హవాలా రూపంలో ఎన్నికల నాటికి తిరిగి వస్తుంది. #TDP #CBN #AP #APNews #AndhraPradeshNews #AndhraPradesh #ChandraBabu #YSRCP #YSJagan @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope @YSRCPCommanders @YSRCPWomenVoice @ysathishreddy @we_ysrcp @ysjagan
63
111
9
435
20,208
చంద్రబాబు గారు మీరు తప్పు చేస్తున్నారు సార్‌..! నాకు ఎంతో అనుభవం ఉంది. ఈ దేశంలోనే ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని. నేను విజనరీని. నేను కంప్యూటర్ కనిపెట్టాను.. నేను మొబైల్ కనిపెట్టాను. నేను హైదరాబాద్ కట్టాను. ఈ డైలాగులు అన్నీ ఏపీ సీఎం చంద్రబాబువే. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నప్పుడు.. టీడీపీని కాపాడటానికి అని ప్రచారం చేసుకున్నారు. ఒక మహిళ నుంచి టీడీపీని కాపాడటానికి ఆయన వర్గం మీడియా ఊదరగొట్టింది.కానీ.. అసలు వాస్తవం అధికార దాహం, సీఎం సీటు మీద కూర్చోవాలనే కుట్రతో ఎన్టీఆర్‌ను కుట్రతో కూలదోశారు.ఈనాడు మీడియా కూడా ఆనాడు చంద్రబాబుకు బహిరంగంగానే మద్దతుగా నిలిచింది. వైశ్రాయ్ దగ్గర ఎన్టీఆర్‌ మీద చంద్రబాబు వర్గపు ఎమ్మెల్యేలు చెప్పులు విసరడాన్ని ఎవరు మరిచిపోతారు..?!. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. 1995లో మొదలైన చంద్రబాబు కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూనే ఉన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. మాయ మాటలతో, శకుని ఆటలతో అధికారాన్ని చేజిక్కించుకుంటూ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. 1995, 1999, 2014, 2024 నాలుగు సార్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు.ఏనాడూ చంద్రబాబు ఒంటరిగా గెలవలేదు. 2024లో ఏకంగా కోటి అబద్ధాలు, మూడు పార్టీలతో కూటమి కట్టి గెలిచారు. 2024 జూన్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమే స్థానిక ఎన్నికల్లో హింస, దాడులు, దౌర్జన్యం, దమనకాండ, ప్రజాస్వామ్యం ఖూనీ, రాజ్యాంగాన్ని చెరబట్టటం. చంద్రబాబు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాను అన్నప్పుడే ప్రజల్లో, ప్రజాస్వామిక వాదుల్లో, రాజకీయ పార్టీల్లో అనేక సందేహాలు. ఎందుకంటే.. చంద్రబాబు నాలుగు సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఈ ఎన్నికలతో కలిపి ఆయన రెండు సార్లు మాత్రమే స్తానిక ఎన్నికలు నిర్వహించారు. ఆయన పాలన మీద ఆయనకు అంత నమ్మకం అన్నమాట..!. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ఒక పద్ధతి, ప్రణాళిక ప్రకారం హింసకు పాల్పడినట్లు ఘటనలు చూస్తే తెలుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునేఠాను నియమించడం, డీజీపీగా గుప్తాను తీసుకురావడం, ప్రద్యుమ్నను CMOలో పెట్టుకోవడం, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా మహేష్ చంద్ర లడ్హాను తీసుకోవడం ఇవన్నీ కూడా చంద్రబాబు ఒక ప్రణాళిక ప్రకారం చేసుకుంటూ వచ్చారు. వ్యవస్థలను చేతులో పెట్టుకోవడం కోసం తన మనుషులను నియమించుకుంటూ వచ్చారనిపిస్తోంది. ఇక.. కోయ ప్రవీణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయనే ముందుండి పోలీస్‌ వ్యవస్థను టీడీపీ వ్యవస్థగా మార్చేశారని ప్రజలే అనుకుంటున్నారు. భారత పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగం ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించాలని చెప్పింది. కానీ.. చంద్రబాబు అండ్ కో ఏం చేస్తున్నారు..? వ్యవస్థలను వారి గుప్పిట్లో పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ఆటలు ఆడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా కాలరాస్తున్నారు. వారి ఉక్కు పాదాల కింద తొక్కేస్తున్నారు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రధానమైన హక్కు. భారత ప్రజాస్వామ్య పునాదులు ఓటు హక్కు మీదనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఓటు హక్కు ద్వారానే ప్రజలు తమను ఎవరు పాలించాలో డిసైడ్ చేసుకుంటారు. పాలకుల పాలన నచ్చకపోతే ఆ ఓటు హక్కుతో సాగనంపుతారు. నచ్చితే మళ్లీ అధికారాన్ని కట్టబెడతారు. స్థానిక ఎన్నికలను చంద్రబాబు తన పాలన రిఫరెండంగా తీసుకుంటే బాగుండేది. తన పాలనలో ఉన్న లోపాలను సమీక్షించుకోవడానికి ఉపయోగపడేది. ప్రజల నాడి తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు చంద్రబాబుకు ఎంతో ఉపకరించేవి. కానీ.. చంద్రబాబు తన పాలనపై రిమార్క్‌ లేకుండా చూసుకోవడానికి ప్రజాస్వామ్యాన్నే ఖూనీ చేశారు. YSRCP నేతలు చెబుతున్నట్లు రెడ్ బుక్‌ రూల్‌ను యథేచ్ఛగా అమలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. YSRCP కంచుకోటలపై చంద్రబాబు అండ్ కో వ్యవస్థలను ఆయుధంగా ఉపయోగించింది. కార్పొరేషన్‌, మున్సిపల్, ZPTC, MPTC ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో ప్రజాస్వామ్యచెర కొనసాగింది. సుప్రీం కోర్టు చెప్పినా పట్టించుకోలేదు. కొంత మంది పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్న కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరించారు. ఎక్కడో ఉగ్రవాదుల మీద గురి పెట్టాల్సిప AK-47లను పులివెందుల నడి బొడ్డు మీద గురి పెట్టారు. ఎక్కడో సరిహద్దుల్లో పేల్చాల్సిన తుపాకులు పులివెందుల రోడ్ల మీద పేల్చారు. ఓటర్లను టీడీపీ వాళ్లు అడ్డుకోవడం కాదు పోలీసులు అడ్డుకున్నారు. ఏజెంట్లను టీడీపీ నేతలు బయటకు లాగేయడం కాదు పోలీసులు లాడిపడేశారు. రిగ్గింగ్, సైక్లింగ్ , బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లడం, మార్చడం పరిపాటైంది. స్ట్రాంగ్‌లకు సీల్‌ కూడా వేయలేదంటే అధికారులు ఎంతగా అధికార కూటమికి లొంగిపోయారో అర్దం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల టీడీపీ నేతలకు బదులు పోలీస్ అధికారులే బెదిరింపులకు, బేరసారాలకు దిగారు. వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో ఈ ఘటనలు చూస్తే అర్ధమవుతుంది. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. వ్యవస్థలకు రక్షణగా ఉండాలి. కానీ.. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు చేస్తున్నదేమిటీ.. వ్యవస్థలను భక్షిస్తున్నారు. వ్యవస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రజాతీర్పు తమ వైపే ఉందని చెప్పుకోవడానికి వ్యవస్థలను చెరబట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇది కరక్టా..?. భావి తరాలకు మీరు పంపుతున్న మెస్సేజ్ ఏంటి..?. చంద్రబాబు పుత్ర ప్రేమ మీద ఇదంతా చేస్తున్నారని YSRCP నేతలు ఆరోపిస్తున్నారు. YSRCP నేతల ఆరోపణలు, ఆవేదనలు అరణ్య రోదనే అవుతున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి MLC లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో YSRCP నేతలు పదుల సంఖ్యలో SEC పునేఠాను కలిసి ఉంటారు. కానీ.. మీడియా ముందు YSRCP అరుపులు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అయ్యాయి. SEC సుప్రీం కోర్టు చెప్పిన మాటలు కూడా పక్కనపెట్టి చంద్రబాబుకు ఊడిగం చేసింది. రాజ్యాంగ పరిరక్షణ దేశంలో ఇంతకంటే దారుణం ఉంటుందా..? కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రూల్‌తో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు రెడ్ బుక్‌ రూల్ పరాకాష్టకు చేరుకుంది. రాజకీయాల్లో చంద్రబాబు విషపు విత్తనాలు వేస్తున్నారని మాజీ సీఎం YS జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. ఆ విషపు విత్తనాలు మహా వృక్షాలై ప్రతీకారం తీర్చుకుంటాయని YSRCP నేతలు చెబుతున్నారు. అంటే.. ఇది ఇంతటితో ఆగదు. ఈ రోజున రెడ్ బుక్‌ అమలైతే.. YSRCPవచ్చాక డిజిటల్ బుక్ అమలు చేస్తారు. అప్పుడు, ఇప్పుడు నష్టపోయేది ప్రజాస్వామ్యమ, ప్రజలే. కాలరాయబడేది ప్రజల హక్కులే. YSRCP నేతలు ముక్త కంఠంతో చెబుతున్న మాట.. అధికారంలోకి వచ్చాక.. మా నాయకుడు చెప్పిన మేం వినం.. మేం ఏంటో చూపిస్తామంటున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుందేమోనని ప్రజాస్వామ్యవాదులు, శాంతికాముకులు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. చంద్రబాబు గారు మీరు తప్పు చేస్తున్నారు సార్‌. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి. మూడు పార్టీలు కలిసి ఉన్నాం. బీజేపీతో పొత్తులో ఉన్నాం. కాపు నాయకుడు పవన్ కల్యాణ్ మాతో ఉన్నారు 2029 కూడా మాదే అనుకుంటే పొరపాటే. చరిత్రలో అంతా మాదే, అంతా మేమే.. నేను రాజ్యం అన్న లూయీలు కాల గర్భంలో కలిసిపోయారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ద పాలన నిర్వహించాలి. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. ప్రజాస్వామ్యానికి పరిరక్షకుడిగా ఉండాలే కానీ..భక్షకుడిగా ఉండకూడదు. #YSRCP #TDP #CBN #AP #AndhraPradeshnews #TeluguNews #AndhraPradesh @ysjagan @YSRCPAmerica @YSJaganTrends @YSRCPEurope @ysrcp_vjw @YSRCParty @we_ysrcp @boss_big666 @TV9Telugu @NtvTeluguLive @10TvTeluguNews @SakshiNews @ndtv
14
12
2
81
10,829
సారీ.. ట్రంప్‌ గారు.. మీ ఓటమికి చింతించాల్సిన అవసరం లేదు..! కానీ.. మీకు ఓ సలహా ఇవ్వగలను. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవాలంటే.. ఇండియాలో..ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉంటుంది. ఈ రాష్ట్రం నుంచి పోలీసులను, అధికారులను తీసుకెళ్లండి. #పునేఠా గారిని అమెరికా ఎన్నికల చీఫ్ చేయండి..! #డీజీపీ గుప్తా గారిని FBI చీఫ్ చేయండి..! #ప్రద్యుమ్నను మీ పక్కనే పెట్టుకోండి..! మరిచిపోయా.. #కోయ ప్రవీణ్ చౌదరి గారు అని ఉంటారు.. ఆయనను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించుకోండి..! ఇక.. ప్రధాన సలహాదారుగా #CBNగారిని వైట్ హౌస్‌లో పెట్టుకోండి. ట్రంప్ గారు ప్రజాస్వామ్యాన్ని, అమెరికా రాజ్యాంగాన్ని కూడా మర్డర్ చేసి.. వీరంతా కలిసి మిమ్మల్ని గెలిపిస్తారు..! #Trump #America #AndhraPradesh #AndhraPradeshNews #CBNTeam @ysjagan @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope
42
21
6
133
7,088
ఆంధ్రప్రదేశ్ అంటే....! 1. బైండోవర్ కేసులు 2. బెదిరింపులు 3.నామినేషన్లు అడ్డుకోవడం 4. నామినేషన్లు చించివేయడం 5. దౌర్జన్యం 6. గూండాగిరి 7. రిగ్గింగ్ 8. సైక్లింగ్ 9. దొంగ ఓట్లు 10. బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకెళ్లడం 11. పోలీస్‌ వ్యవస్థను చేతులో పెట్టుకోవడం 12 .అధికారులను కొనేయడం 13. ఎన్నికల కమిషన్‌ను తోలు బొమ్మలా ఆడించడం 14. పెట్రోల్ బాంబులు 15. అప్పులు 16. దోపిడీ 17. దోపిడీ చేసిన దాన్ని పంచుకోవడం 18. దోపిడీ చేసిన దాన్ని దాచుకోవడం 19. నీళ్లలో మునిగిన అమరావతి 20. గుంతల రోడ్లు 21. రోడ్డు మీద రైతన్న 22. పింఛన్‌లు కట్ 23. నిరుద్యోగ భృతి లేదు 24. ఆడ బిడ్డ నిధి లేదు 25. ప్రజాస్వామ్యం ఖూనీ 26. భారత రాజ్యాంగం మర్డర్‌ 27. రెడ్ బుక్‌ రూల్ అమలు 28. కరకట్ట ఆర్డర్స్‌కు సలాం 29.జర్నలిస్ట్‌లపై దాడులు 30. ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి 31.ఖాకీ చొక్కాలు కాదు పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు 32.ప్రజల ప్రాథమిక హక్కులు కిల్ 33. ప్రశ్నిస్తే అక్రమ కేసులు - జైలు 34. మీడియా గొంతు నొక్కడం 35. ఫేక్ వార్తలు.. తప్పుడు ప్రసారాలు ఫైనల్‌గా.. 2029లో YSRCP గెలుస్తుందని బల్ల గుద్ది చెబుతోన్న ABN రాధాకృష్ణ .. #AP #APNews #andhraPradeshNews @ysjagan @YSRCPAmerica @YSJaganTrends @YSRCPEurope @YSRCParty
2
4
18
899
సౌత్ బిహార్‌లా ఏపీ..! ఏపీ సౌత్ బిహార్ అయింది. ఏపీలో జంగిల్ రాజ్ నడుస్తోంది. ఏపీలో రిగ్గింగ్ రాజ్యం, గూండాల రాజ్యం నడుస్తోంది. ఈ మాటలు నేను అంటున్నవి కాదు.. నేషనల్ మీడియా, ఇతర రాష్ట్రాల మీడియా అంటోన్న మాటలు. ఏపీలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా..? ఏపీలో ఏ వీధిలో కూడా, ఏజిల్లాలో కూడా భారత రాజ్యాంగం అమలు కావడం లేదు. అంతటా.. రెడ్ బుక్ రూల్ అమలు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు కూటమి పాలకులు. ఇక్కడ కూటమి పాలకులు అనడం కంటే టీడీపీ గూండాలు అనడం కరక్ట్. ఎందుకంటే.. అక్కడకక్కడ టీడీపీ గూండాలు కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తల మీద కూడా దారుణమైన దాడులు చేశారు. ఏపీలో పచ్చ తోడేళ్ల దాటికి తట్టుకోలేకపోతున్నామని ఓటు వేయడానికి వచ్చిన మహిళలు చెబుతున్నారు. నామినేషన్లు చించేశారు. నామినేషన్ల చించివేత కార్యక్రమంలో అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంతకంటే దారుణం ఉంటుందా..? ప్రజాస్వామ్యాన్ని ఇంతకంటే ఘోరంగా ఖూనీ చేయడం ఉంటుందా..?.ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని ఖూనీ చేయడంలో పోలీసులు తమ వంతు పాత్ర బాగానే పోషిస్తున్నారు.సేవ్ ఏపీ అంటూ రాష్ట్ర ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆర్తనాదాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్దాల తరువాత ఏపీలో పెట్రోల్ బాంబులు మోగాయి. ఇది ఎంత దూరంపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రిగ్గింగ్, సైక్లింగ్, బ్యాలెట్ బాక్స్‌లు ఎత్తుకెళ్లడం, బ్యాలెట్ బాక్స్‌లు మార్చడం ఎందుకింత టీడీపీ నేతలు దిగజారరు. అంటే.. రెండున్నరేళ్ల పాలనలో ఏం చేయలేదనే కదా..?. లోకల్ బాడీ ఎన్నొకల్లో కూటమి నేతలు ఎక్కడైనా... ఇదిగో మా పాలనలో ఈ మంచి చేశామని ఓటు అడిగిన సందర్భం ఎక్కడైనా ఉందా..? ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు తప్పితే. ఎందుకు చెప్పుకోలేకపోయారు. రెండున్నరేళ్లలో కూటమి పాలకులు అప్పులు, దోపిడీ, దౌర్జన్యం తప్ప ఏం చేశారు..? అందుకే.. ఈ దాడులు, దౌర్జన్యాలు, రిగ్గింగ్, సైక్లింగ్, బాలెట్ బాక్స్‌లు మార్చడం.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? ఏపీలో పరిస్థితులు ఇలానే ఉంటే.. ప్రజాస్వామ్యం ప్రశ్నార్ధకం అవుతుంది. రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ రోడ్డెక్కాలి. సేవ్ ఏపీ అంటూ నినదించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు పక్కన పెట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఏకమవ్వాలి.లేకపోతే భవిష్యత్తుకే ప్రమాదం. #APNews #AP #AndhraPradeshNews #TeluguNews @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope @ysjagan @cnnbrk @bbctelugu @ndtvindia @IndiaToday
3
1
1
9
832
రాజకీయాల్లో వ్యూహం, ఎత్తుగడలు చాలా ముఖ్యం. ప్రజాభిమానం సంపాదించడం, ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తైతే.. రాజకీయాల్లో వ్యూహాలు చాలా ముఖ్యం. రాజకీయ వ్యూహం లేని ప్రజాభిమానం నిరర్ధకం అవుతుంది. నాయకుడు మొదట రాజకీయాల గురించే ఆలోచన చేయాలి.. తరువాత పాలన గురించి. ఎందుకంటే.. రాజకీయం ద్వారానే పాలనా పగ్గాలు చేతికొస్తాయి . #Politics #PoliticalPhilosophy #PoliticalScince
5
750
రేపే (05-11-2026) ZPTC, MPTC ఎన్నికలు జరగనున్నాయి. 582 ZPTC, 7,767 MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 582 స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. 7,767 MPTC స్థానాలకు 18,848 మంది పోటీ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు 2,61,52,377 మంది. -పురుష ఓటర్లు - 1,28,76,887 మంది. -మహిళా ఓటర్లు- 1,32,74,208 మంది. -ఇతరులు -1282 మంది. -ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్. -రాష్ట్ర వ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు. -వీటిలో 9,966 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. -9,186 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. -35,333 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,41,332 మంది పోలింగ్ అధికారులు. -38 వేల మంది పోలీసులుతో భద్రత . అయితే.. కూటమి నేతల దాడులపై YSRCP నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని YSRCP నేతలు ఆరోపిస్తున్నారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు మాదిరిగానే పోలింగ్ బూతులను కబ్జా చేయడానికి టీడీపీ మూకలు కుట్రలు చేస్తున్నారని YSRCP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #LocabodyElectionsInAP #ZPTC #MPTC #AndhraPradesh #AndhraPradeshNews
158
ప్రభుత్వ ఉద్యోగుల డిఫెన్స్ గేమ్..! కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక విషయం స్ప ష్టమైంది. ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. సందేహం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని నిర్మోహమాటంగా వెలిబుచ్చారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలు అర్బన్‌, సెమీ అర్బన్‌లో జరుగుతాయి.ఇక్కడే కూటమికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి అంటే.. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. 2024తో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు YSRCPకి ఘణనీయంగా పడ్డాయి. 50శాతం ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు YSRCPకి పడ్డాయి. ఇంకా రెండేళ్లు కూటమి పాలన ఉండగానే.. 50శాతం ప్రభుత్వ ఉద్యోగులు తెగించి YSRCPకి ఓటేశారంటే..2029లో మీరు ప్రభుత్వ ఉద్యోగుల ఆలోచన ఎలా ఉంటుందో సులభంగానే ఊహించుకోవచ్చు.ఇక..ZPTC, MPTC ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు YSRCPకి బాగానే పడే అవకాశముంది. ఇక.. సాధారణ ఓటర్లు కూడా యావరేజ్‌గా 50శాతం మంది ఓటర్లు ఓటు వేయడానికి రాలేదు. వీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాలు, దమనకాండ చూసి భయపడి చాలా మంది ఓటర్లు బయటకు రాలేదు. ఇక.. స్వస్థలాలకు దూరంగా ఉన్నవారి ఓట్లను కూటమి నేతలు వేసుకున్నారు. ఇళ్లల్లో ఉండి బయటకు రాని వారి ఓట్లు, స్వస్థలాలకు దూరంగా ఉన్నవారి ఓట్లను కూటమి నేతలు రిగ్గింగ్ చేసుకున్నారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. గెలుపు కళ కూటమి నేతల ముఖాల్లో ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా టీడీపీ వాళ్లు గెలిచినా మనస్ఫూర్తిగా సంబరాలు చేసుకోలేని స్థితి. పూర్తిస్థాయిలో విజయాన్ని టీడీపీ నేతలు ఆస్వాదించలేకపోతున్నారు. ఫలితాలపై పెదవి విప్పేందుకు కూటమి నేతలు సిగ్గుపడుతున్నారు. టీడీపీ టెక్నికల్‌గా గెలవొచ్చు.. నైతికంగా మాత్రం YSRCPదే విజయం అంటున్నారు ప్రజలు. అంతులేని నిర్బంధం, దాడులు, దౌర్జన్యాల్లోనూ YSRCP నేతలు ఎదురొడ్డి నిలిచారని ప్రజలు అనుకుంటున్నారు. #AP #AndhraPradesh #APNews #AndhraPradeshNews #YSRCP #TDP @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope @ysjagan
3
6
47
4,655
ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. #APCyclone
156
నవంబర్ మూడో వారంలో మరో తుఫాన్.... ఏపీ తీరాన్ని తాకే అవకాశం... #Cyclone #AP #AndhraPradesh
129
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎల్ నినో ఎఫెక్ట్ ఎల్ నినో ఎఫెక్ట్‌తో ఖాళీ అవుతోన్న హైదరాబాద్ స్టూడెంట్స్‌ను ఇంటికి పంపుతోన్న కార్పొరేట్ కాలేజీలు నీటి సరఫరాలో కొరత ఉండటంతో కాలేజీలకు, హాస్టళ్లకు సెలవులు ఐటీ కారిడార్‌లో తీవ్ర నీటి కొరత కార్పొరేట్ కాలేజీల హాస్టళ్ల నుంచి ఇంటి ముఖం పడుతోన్న విద్యార్ధులు కాలేజీల రీ ఓపెన్‌పై క్లారిటీ లేదు కరోనా కాలంలో జూమ్ క్లాస్‌లు నిర్వహించినట్లు... మళ్లీ జూమ్ క్లాస్‌లు నిర్వహించనున్న కాలేజీలు #Elnino #Hyderabad #CollegesShutdown #WaterProblemInHYD
1
229
అనంతపురంలో ఫ్యాన్‌ హోరు కొనసాగింది. మేయర్ పీఠాన్ని YSRCP కైవసం చేసుకుంది. YSRCP అభ్యర్ధి రమేష్ గౌడ్ విజయం సాధించారు. కూటమి అభ్యర్ధి అజేష్ మట్టి కరిచాడు. అరాచక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారని YSRCP నేతలు కామెంట్ చేశారు. 5,981 ఓట్ల భారీ మెజార్టీతో YSRCP అభ్యర్ది రమేష్ గౌడ్ విజయం సాధించారు. రమేష్ గౌడ్‌కు 62,219 ఓట్లు లభించగా, కూటమి అభ్యర్ధి , బీజేపీ నేత అజయ్ బాబుకు 56,238 ఓట్లు వచ్చాయి. డివిజన్‌లలోనూ YSRCP హవా కొనసాగింది. #YSRCP #TDP #LocalBodyElections #AP #AndhraPradesh #AndhraPradeshNews #BJP #ATP @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope
2
268
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 28 జిల్లాల పరిధిలోని 582 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 7,844 ఎంపీటీసీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఎంపీటీసీ స్థానాలకు 18 వేల 952 మంది, జెడ్పీటీసీ స్థానాలకు 2 వేల 169 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 21 వేల 121 మంది అభ్యర్థులు పరిషత్ ఎన్నికల బరిలో ఉన్నారు. గురువారం(5-11-2026) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. #LocalBodyElections #AP #AndhraPradesh #AndhraPradeshNews @YSRCPWomenVoice @YSRCPEurope @YSRCPAmerica
2
307
రిగ్గింగ్‌కు పరాకాష్ట..! చిత్తూరు:చిత్తూరు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. కార్పొరేషన్ ఎన్నికల్లో పోలైన ఓట్టు 92910. లెక్కింపులో మాత్రం 96 వేలు ఓట్లు దాటిపోయాయి. రిగ్గింగ్‌లో లెక్కలు కూడా చూసుకోకుండా గుద్దేశారు అన్నమాట..!. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో ఎక్కువ ఓట్లు రావడంతో ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు.పాపం వాళ్లైనా ఏం చేస్తారు..చివరి క్షణంలో ఏదో ఫలితాలు ప్రకటించి వాళ్ల జాబులు వాళ్లు కాపాడుకున్నారు. #AndhraPradeshNews #AndhraPradesh #LocalBodyElectios #YSRCP #TDP #JanaSena @YSRCParty @YSRCPAmerica @YSRCPCommanders @YSRCPWomenVoice @YSRCPEurope
1
2
15
969
విజయవాడ : మురసు తుఫాన్ ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతోన్నాయి. బుధవారం ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ . కృష్ణాజిల్లాలోనూ భారీ వర్షాలు పడుతోన్నాయి. వర్షాలతో పాటు జిల్లా పరిషత్ ఎన్నికల నేపధ్యంలో కృష్ణాజిల్లాలో బుధవారం అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించిన కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ. #MurasuCyclone #Murasu #NTRDts #KrishnaDts #Machilipatnam
306
ఏపీలో ఎల్లో స్వామ్యం గెలిచి.. ప్రజాస్వామ్యం ఓడిపోయింది...! రెండున్నరేళ్ల కూటమి పాలనలో ఇదిగో మేం ఈ అభివృద్ది చేశాం.. ఈ సంక్షేమం అందించాం అని ఏమాత్రం చెప్పుకోకుండా.. హింస, దాడులు దౌర్జన్యం, దమనకాండ, కుట్రలు, కతంత్రాలతో ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ గెలిచామని, సంబరాలు కూడా చేసుకోలేని విజయాన్ని కూటమి నేతలు సాధించారు. #YSRCP #TDP #JanaSena @ysjagan @YSRCParty @YSRCPCommanders @YSRCPAmerica @YSR_America
2
4
12
689
2029లో #YSRCP గెలుపుకు నవసూత్రాలు 2029 ఎన్నికల మీద #YSRCP దృష్టి పెట్టాలి. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా ఉంది. #YSRCP వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. 1.బీజేపీని చంద్రబాబుకు దూరం చేయాలి. 2.కాపుల్లో పవన్‌ కల్యాణ్ మీద మరింత అపనమ్మకం కలిగేలా #YSRCP వ్యూహాలు రచించాలి. 3.పవన్‌ కల్యాణ్ తనకు తానే కూటమి నుంచి బయటకు వచ్చేలా #YSRCP చేయగలగాలి. 4.#YSRCP తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకోవాలి.#YSRCP కమ్యూనిస్టులకు దగ్గర కావాలి. 5.#CPM #CPIకి #YSRCP దగ్గరవడం ద్వారా క్షేత్రస్థాయిలో బలంగా పోరాడవచ్చు. 6.YSRCP తన సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేసుకోవాలి. 7.YSRCP అనుబంధ విభాగాలను మరింత వ్యూహాత్మకంగా తీర్చిదిద్దాలి. ముఖ్యంగా విద్యార్థుల్లోకి, కార్మిక సంఘాల్లోకి చొచ్చుకెళ్లాలి. 8. మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల ఓట్లు ఆకట్టుకునేలా #YSRCP పోరాటాలకు సిద్ధం కావాలి. 9. #YSRCP తన కార్యకర్తల్లో మరింత నమ్మకం కలిగించాలి. జగన్ 2.oలో కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత అనే మెస్సేజ్ బలంగా పంపాలి. #YSRCP @ysjagan @YSRCPAmerica @YSRCParty @YSRCPEurope
104
78
8
606
71,963