Team PSPK (@_TeamPSPK) header
Team PSPK (@_TeamPSPK) profile picture

Here for a Better Society, @PawanKalyan & @JanaSenaParty. ఎదిరించే వాడు లేకపోతే, బెదిరించే వాడే రాజ్యం ఏలుతాడు...

India
Joined February 2022
Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)Photo by Team PSPK (@_TeamPSPK)
ప్రపంచానికి ఒక్కడే @PawanKalyan 🛐🙏
11
1,328
6
5,577
99,023
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం? @PawanKalyan @ncbn @MadhavBJP @JanaSenaParty @JSPShatagniTeam
155
1,718
124
5,053
292,665
పంచాయతీ ఎన్నికల హెల్ప్ డెస్క్
40
378
23
1,155
53,622
గ్రామపంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను జనసేన నాయకులు అడ్డుకోకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము.
155
908
114
3,002
205,921
మొన్నటి వరకు ఆయన Power స్టార్ ఇప్పుడు Empower Star పవన్ కళ్యాణ్ - శ్రీమతి @upasanakonidela #PawanKalyanMarkGovernance
19
1,043
6
5,640
88,097
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development. @PawanKalyan
26
1,088
19
5,504
99,025
సమాజం బాగుండాలని కోరుకున్న దివంగత శ్రీ రామోజీ రావు గారు •⁠ ⁠ ఆయనలో సమాజకాంక్ష బలంగా ఉండేది •⁠ ⁠ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువల కోసం తపించారు •⁠ ⁠ తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు అపారం •⁠ ⁠ సమాజాన్ని చైతన్యవంతం చేయాలని భావించేవారు •⁠ ⁠ శ్రీ రామోజీ రావు గారి పేరు మీద- భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారికి అవార్డులు ఇవ్వడం గొప్ప సంప్రదాయం •⁠ ⁠ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘వ్యక్తి తన జీవితంలో సాధించే విజయం కంటే, సమాజ మార్పు కోసం సాగించే ప్రయాణం చాలా మరపురాని అనుభూతి ఇస్తుంది. చరిత్రలో నిలిచిపోతుంది’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సమాజం కోసం అహర్నిశలు శ్రమించిన ఓ వ్యక్తి గుర్తుగా సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వివిధ రంగాల వారిని సత్కరించుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఒకే వేదికపై విభిన్న ప్రతిభ కలిగిన, సమాజానికి దిక్సూచిగా మారిన వారిని సత్కరిస్తున్న రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం గొప్ప కార్యక్రమంగా నిలిచిపోతుందన్నారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామోజీరావు గారి 90వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని రామోజీ గ్రూప్ సంస్థల ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డు ల కార్యక్రమానికి గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారు, గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారు, కేంద్రమంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ "ఈ అవార్డుల వెనకున్న గొప్ప ఆలోచనకి స్ఫూర్తినిచ్చిన దివంగత పద్మభూషణ్ శ్రీ రామోజీరావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చినా ఆయన కృషి, పట్టుదలతో ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలను నిర్మించారు. ఆసియాలోనే ప్రముఖమైన సినీ నిర్మాణ కేంద్రంగా రామోజీ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేశారు. తెలుగు పత్రికా రంగానికి, భాషకి ఆయన అందించిన సేవలు గుర్తుంచుకోదగినవి. పని పట్ల ఆయనకున్న అంకితభావం, క్రమశిక్షణ, నిరంతరం కొత్తగా ఆలోచించే తత్త్వం నేటి తరానికి కూడా స్ఫూర్తి దాయకం. •⁠ ⁠ పలు విషయాలపై చర్చించేవారు కొన్ని సందర్భాల్లో వారిని నేను ప్రత్యక్షంగా కలిశాను. ఫిల్మ్ సిటీలో షూటింగుల్లో ఉన్నప్పుడు కావచ్చు, కొన్ని సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి గానీ వారితో కలిశాను. వారితోనూ కిరణ్ గారితోనూ, ఇతర కుటుంబ సభ్యులతోనూ కరోనా అనంతరం కలిసాను. ఆ సమయంలో రామోజీరావు గారి దగ్గర నుంచి దేశంలోని అన్ని విషయాల పట్ల చర్చ ఉండేది. ఆయన విషయ అవగాహన చూసి నాకు ఆశ్చర్యం వేసేది. శ్రీ రామోజీరావు గారి మనోభావాలు దేశ సమగ్రత, ప్రజాస్వామ్యం కోసం వారు పడ్డ తపన, ఆరోజు వారితో పంచుకున్న భావాలు నాకు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన "ఈనాడు" గురించి చాలా విషయాలు చెప్పారు. వార్తలను ప్రజలకు చేరవేయడంతో పాటు సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. •⁠ ⁠ సమాజంపై ఎంతో బాధ్యత ఉంది శ్రీ రామోజీరావు గారు ఆలోచనలో సమాజం పై బాధ్యత కనిపిస్తుంది. సారా వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కుపై అవగాహన, పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ వంటి అంశాలల్లో ప్రజలకు ఎలా చైతన్యం కల్పించారో ఆయన నాకు వివరించారు. వారి కృషి, కార్యదక్షత, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తి. ఆయన స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ రోజు పురస్కారాలు అందుకుంటున్న వారి జీవితాలు చాలా గొప్ప విలువైన విషయాలు నేర్పుతాయి. శారీరక వైకల్యాన్ని అధిగమించి సంగీతంలో గుర్తింపు సాధించిన వారు, పేదల పిల్ల విద్య కోసం పని చేస్తున్నవారు, గిరిజన హక్కులు, రైతు సమస్యలు, పర్యావరణ పరిరక్షణ కోసం కలంతో పోరాడుతున్న జర్నలిస్టులు, మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, జల సంరక్షణ, వైద్య రంగం, గ్రామీణ మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్న వారు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. వైద్య విద్యలో వివక్షతను ఎదుర్కొని న్యాయ పోరాటంతో విజయం సాధించిన వారి సంకల్పం చాలా అభినందనీయం. వైకల్యం మనిషి శరీరానికి ఉండవచ్చు.. కానీ సంకల్పానికి ఉండకూడదు. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తాయి. మన పట్టుదలే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి విజయం, అతని వ్యక్తిగత ఎదుగుదలతో ఆగిపోకూడదు. ఆ విజయం మరొకరి జీవితంలో వెలుగు నింపినప్పుడే దానికి సంపూర్ణమైన అర్థం వస్తుంది. ఈ రోజు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారం మీ కృషికి లభించిన గుర్తింపు మాత్రమే కాదు.. మీ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే ప్రోత్సాహం కూడా మీ విజయాలు మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను. మన కోసం...మనం సాధించేది విజయం. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందించే స్ఫూర్తి. అలాంటి స్ఫూర్తిని అందించిన రామోజీ రావు గారిని మరోమారు తలుచుకుంటూ వారి అడుగుజాడలు, స్ఫూర్తి, మనందరికీ ఒక బలమైన దారి వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను" అన్నారు.
47
386
5
2,265
25,467
రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. #RamojiExcellenceAwards2026
27
1,086
16
5,839
114,055
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత శ్రీ రామోజీ రావు గారి జయంతి సందర్భంగా నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. అంతకుముందు, ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కేంద్ర హోం మంత్రివర్యులు శ్రీ @AmitShah గారికి డా. బి.ఆర్. అంబేద్కర్ కళావేదిక వద్ద గౌరవ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ncbn గారితో కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు.
4
324
1
1,796
29,720
People's representatives, officials and leaders gave a grand welcome at the airport to the state's Hon'ble Deputy Chief Minister, Sri @PawanKalyan , who arrived in Visakhapatnam to attend the CII conference.
13
64
627
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
66
2,689
52
9,274
173,681
Heartfelt gratitude to the people of Andhra Pradesh for reposing their trust and confidence in the NDA alliance and delivering a resounding victory in the municipal elections. This mandate reflects the people's faith in the vision of Hon’ble Prime Minister Sri @narendramodi Ji, the leadership of Hon’ble CM Sri @ncbn Garu, and the collective efforts of @JanaSenaParty leadership, along with the dedicated efforts of the BJP, TDP and Janasena cadres. Heartiest congratulations to every Janasena leader, candidate, JanaSainik and Veera Mahila who worked tirelessly on the ground to make this historic victory possible. Your dedication, commitment and unwavering efforts have been instrumental in strengthening the NDA alliance across Andhra Pradesh. This victory reflects our unity, collective leadership and people's faith in development and good governance. Best wishes to all NDA leaders and cadre for the upcoming ZPTC and MPTC elections. I hope the people will appreciate the rural development initiatives undertaken over the past 2.5 years and continue to extend their support to the alliance. - @PawanKalyan #APLocalBodyElectionsResults
42
765
6
4,408
60,363
జై జనసేన, జై జై జనసేన ✊🏼 #JanaSenaStrikesAgain
20
110
872
ఈరోజుకి Man Of The Match Mallappa ! రాయలసీమ ప్రాంతంలో ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గెలవడం, అది కూడా అధికారంలో ఉన్న టీడీపీని వెనక్కి నెట్టి విజయం సాధించడం చిన్న విషయం కాదు Cadre పవన్ కళ్యాణ్‌ను కూడా లెక్కచేయకుండా పనిచేయడం పవన్ కళ్యాణ్‌కు కూడా షాకే! ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో Janasena సీట్లు తక్కువ తీసుకుంటే ఎంతోమంది ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేస్తారు #APLocalBodyElections2026 #APLocalPolls
22
1,022
28
4,443
101,919
Surprisingly, Janasena-backed candidates are winning the municipal chairman race with comfortable majorities in all 12 municipalities where the party contested! The biggest surprise is in Adoni (Kurnool), where Janasena rebel candidate Mallappa's wife is also leading the municipal chairman race against TDP A straight message to TDP that an alliance with Janasena is mandatory! #APLocalBodyElections2026
51
1,525
120
5,480
198,219
Jana Sena Rebels Defeat TDP in Atmakur Ward 12: Gaddam Sandhya Ward 11: Kolagani Sirisha Both won as Independents after missing out on Jana Sena tickets, defeating TDP and YSRCP candidates. #JanaSena #Atmakur #APLocalPolls
21
645
40
1,878
83,435
మురసు తుపాను పట్ల అప్రమత్తతతో వ్యవహరించండి • నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనున్న తుపాను • అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయండి • లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి • వాగులు, వంకల చెంతన జన సంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి • తాగు నీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సమన్వయం చేసుకోవాలి • మురసు తుపాను నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సమీక్ష అర్నబ్ తుపాను విధ్వంసం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోక ముందే మురసు రూపంలో మరో తుపాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉన్న నేపథ్యంలో విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూఎస్ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. మురసు తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఆయా జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అవసరం ఉన్న చోట పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, తాగునీరు, భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లను తక్షణం పునరుద్ధరించడం, రోడ్లపై చెట్లు కూలితే తక్షణం తొలగించడం వంటి చర్యల్లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. మురసు తుపాను ఈ రోజు తీరం తాకనుందన్న హెచ్చరికల నేపథ్యంలో తన పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావం ఉండనున్న జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. మురసు తుపాను మొదట బాపట్ల, మచిలీపట్నం మధ్య తీరం తాకుతుందని అంచనా వేయగా, ప్రస్తుతం తుపాను దిశ మార్చుకుని నెల్లూరుకు సమీపంగా తీరం దాటబోతోందని, తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, మార్కాపురం జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు వివరించారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈ మధ్యాహ్నం తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరాన్ని తాకే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అత్యంత భారీ వర్షాలు కురిసి, ఆకస్మిక వరదలకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్టు వివరించారు. అర్నబ్ తుపాను మాదిరి మురసు తుపానును కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు స్పష్టం చేశారు. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖలతో కలసి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికల ఆధారంగా గ్రామాల్లో ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని తెలిపారు. గ్రామాలకు సమీపంలో ఉండే వాగులు, వంకల్లో నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, ఉదృతంగా ప్రవహించే వాగుల వద్దకు ప్రజలు వెళ్లకుండా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే బ్లీచింగ్, క్లోరినేషన్ చేసేందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు పెద్ద ఎత్తున నేలకొరిగే అవకాశాలు ఉన్న క్రమంలో నష్టం జరిగిన తర్వాత వీలైనంత త్వరగా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ సిబ్బందికి సూచనలు చేశారు. వర్షాలకు రహదారులు దెబ్బతిన్నా, కల్వర్టులు కొట్టుకుపోయినా వెంటనే స్పందించాలని, ప్రమాదకరమైన రహదారులు, లోలెవల్ కాజ్‌వేల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు. తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో తుపాను తాలూకు అలజడి పూర్తిగా తగ్గి, అధికారుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని, తీర ప్రాంత ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. తుపాను సమయంలో అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. పంటల నష్టం తగ్గించేలా రైతులకు ముందస్తు సూచనలు చేయాలని, భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగిన చోట, వర్షపు నీటిని వెంటనే మళ్లించే ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వం నుంచి వచ్చే హెచ్చరికలు పాటిస్తూ, యంత్రాంగానికి హకరించాలని, తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరారు. @PIB_India @IPR_AP @pibvijayawada
9
252
2
986
34,793
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. - అర్నబ్ తుపాను నష్టం, సహాయక చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలను ఉప ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. - ⁠ఉప్పాడ తీరంపైనా అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని, అలల ఉద్ధృతికి యు.కొత్తపల్లి మండలానికి చెందిన మత్స్యకారుల బోట్లకు నష్టం వాటిల్లినట్టు వివరించారు. వీటిలో ఉప్పాడ తీరంలో 40 బోట్లు దెబ్బతినగా, ఉప్పాడ మత్స్యకారులకు చెందిన మరో 117 బోట్లు కోనసీమ జిల్లా పరిధిలోని తీర ప్రాంతంలో దెబ్బతిన్నాయని, వీటికి తగిన నష్టపరిహారం వీలైనంత త్వరగా చెల్లించే ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు కోరారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా రాష్ట్రం మొత్తం తీర ప్రాంతం వెంబడి బోట్లు, వలలు తదితర వేట సామగ్రి నష్టపోయిన మత్స్యకారులందరికీ సాధ్యమైనంత త్వరగా పరిహారం అందజేసేలా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. - ⁠అర్నబ్ తుపాను కారణంగా ఉప్పాడ ప్రాంతంలోని చేనేతలకు జరిగిన నష్టాన్ని కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ముందు ఉంచారు. భారీ వర్షాల కారణంగా మగ్గాల్లోకి నీరు వచ్చేయడం, విద్యుత్ లైన్లు తెగిపోవడం కారణంగా వారి జీవనోపాధికి విఘాతం కలుగుతుందని తెలిపారు. - ⁠నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు తుపాను పరిహారం అందించే ఏర్పాటు చేయాలని కోరారు. - ⁠విపత్తు నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు ప్రశంసనీయంగా ఉందని మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. - ⁠విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ప్రశంసనీయం అన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడినప్పటి నుంచి అన్ని శాఖలను సమన్వయం చేస్తూ నిరంతరం పర్యవేక్షించిన తీరును అభినందించారు. - ⁠పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించడం, అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడం వంటి చర్యలను పకడ్బందీగా సమన్వయం చేశారన్నారు. అలాగే తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసిన మంత్రివర్గ సహచరులను, సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల సిబ్బందిని అభినందించారు.
33
447
7
2,213
45,616
Janasainiks - Go fight @JanaSenaParty is with you
12
45
457
Team PSPK retweeted
Heartiest thanks to you, @PawanKalyan Ji, for your kind wishes.
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
100
2,308
5
17,810
428,290