
Author. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu | #Nanigadu | #OkaEndakalapuMadhyahnam | Team @PremaluBooks
Hyderabad, India.
Joined March 2015
- Tweets14.4K
- Following614
- Followers8.2K
- Likes27.2K
Pinned Tweet
పోయినేడాది నాన్న చనిపోయినప్పుడు నేనిక్కడ హైదరాబాద్‌లో ఊపిరి సలపని పని వల్ల అమ్మతో మూడు నాలుగు రోజులు కూడా ఉండలేకపోయా. ఆ తరువాతి ఆరు నెలలూ అలాగే గడిచింది.
మార్చిలో అజు పబ్లికేషన్స్ నుంచి బయటికొచ్చేసాక కొన్ని నెలలు అమ్మతో ఉందామని ఇంటికెళ్ళిపోయా. అప్పటికి అమ్మ యాభై ఏళ్ళు కలిసి ఉన్న మనిషి వదిలేసి వెళ్ళిన ఖాళీతనంలో బతుకుతోంది. నేనూ అమ్మ కలిసి ఆమెకు నచ్చే సీరియల్స్ చూస్తూ, నచ్చింది చేసుకొని తింటూ ఉన్నాం.
నా ఎగ్జిట్ ఏవేవో కాంప్లికేషన్స్‌తో నెలలకు నెలలు సాగుతుంటే, ఏం చెయ్యాలో తోచకుండా ఉన్న రోజుల్లో అమ్మతో ఉన్నానన్న ఆలోచనొక్కటే హాయి. అలాగే ఈ పుస్తకమొకటి రాస్తూ ఉండటం కూడా.
నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే, ఏమాలిచిస్తున్నవురా అని అడిగేది అమ్మ. ఈ పుస్తకం గురించి అని చెప్పేవాడ్ని. ఇప్పుడీ పుస్తకం రాస్తున్న ఆలోచన దూరమవ్వడం కూడా బాధే. నేనిది రాసి ఇలా పుస్తకంగా బయటికి రావడం కంటే రాయడాన్నే ఎక్కువ ఆనందించానేమో అని ఇప్పుడనిపిస్తోంది.
గత ఏడాదిన్నరగా నేనూ అమ్మా చాలా చూసొచ్చి ఇప్పుడు అమ్మ చేతుల మీదుగానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం ఒకరకంగా ఇద్దరికీ విజయమే.
ఎంతో నిజాయితీగా ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. చదివి ఏం చెప్తారోనని ఎదురుచూస్తుంటా.
మీకు నా ప్రేమ. 💙
Oka Endakalapu Madhyahnam is all yours now 🤗
V Mallikarjun retweeted
ఎనభైలు, తొంభైలలో పెరిగిన మా తరం కుర్రాళ్లందరిలాగే నేను కూడా మణిరత్నం సినిమాలకు పెద్ద అభిమానిని. ఈ పుస్తకంలో భరద్వాజ్ రంగన్ రాసినట్టు ఆయన కేవలం సినిమాలు తీసిన దర్శకుడు మాత్రమే కాదు, మా తరం ఆలోచనలను, కలలను తెర మీద బొమ్మలుగా గీసిన మాంత్రికుడు. ముఖ్యంగా 1989లో వచ్చిన 'గీతాంజలి' సినిమా నా జీవితంలో ఒక పెద్ద మలుపు. అప్పటివరకూ నేను సినిమాలు చూసే విధానాన్ని ఆ సినిమా పూర్తిగా మార్చేసింది. అసలు నాలో సినిమా మీద ఇంత ప్రేమ పుట్టడానికి, ఫిల్మ్ మేకింగ్ వైపు అడుగులు వేయడానికి ఆ సినిమానే మెయిన్ కారణం అనుకుంటా. ఆ తర్వాత వచ్చిన 'బొంబాయి' సినిమాని అయితే నేను ముప్పై సార్లకు పైగా చూసుంటాను. మణిరత్నం ఫ్రేమ్స్, ఇళయరాజా, రెహ్మాన్‌ల మ్యూజిక్, పి.సి. శ్రీరామ్ కెమెరా పనితనం... ఇవన్నీ మా తరానికి సినిమా అంటే ఏంటో కొత్తగా నేర్పించాయి.
గీతాంజలి సినిమా నాకు కేవలం ఒక గొప్ప సినిమా మాత్రమే కాదు, నా సొంత జీవితంలో కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా నాకు బతకడం మీద ఆశని, ధైర్యాన్ని ఇచ్చిన సినిమా అది. ముఖ్యంగా అందులో గిరిజ వేసిన గీతాంజలి క్యారెక్టర్, చావు ఎదురుగా ఉన్నా సరే జీవితాన్ని అంత హుషారుగా, చిరునవ్వుతో ప్రేమించే ఆ అమ్మాయి పాత్ర నా మనసులో బలంగా ముద్రపడిపోయింది. ఆ పాత్ర మీద ఉన్న ఇష్టంతో, అసలు గిరిజని జీవితంలో ఒక్కసారైనా స్వయంగా కలవాలని నాకు బలమైన కోరిక ఉండేది.
తర్వాత నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ యూకేలో ఉంటున్న రోజుల్లో, గిరిజ కూడా యూకేలోనే ఉంటున్నారని ఏవో ఇంటర్నెట్ ఫోరమ్స్‌లో చదివాను. ఎలాగైనా ఆమెను కలవాలనే పట్టుదలతో కష్టపడి ఆమె ఈమెయిల్ ఐడీ సంపాదించాను. మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని పర్మిషన్ అడుగుతూ ఒక మెయిల్ పెట్టాను. అదృష్టవశాత్తూ ఆమె ఒప్పుకున్నారు. ఆ తర్వాత మేము చాలాసార్లు కలిశాం, కలిసి ఆర్ట్ షోలకు వెళ్లాం, గంటల తరబడి కూర్చుని బోలెడు కథలు మాట్లాడుకున్నాం. మన టీవీ ఛానెళ్లు, మీడియా వాళ్లు ఆమె ఎక్కడున్నారో కనిపెట్టి ఇంటర్వ్యూలు చేయడానికి చాలా కాలం ముందే ఇదంతా జరిగింది. నాకు ఇష్టమైన పాత్రకు ప్రాణం పోసిన మనిషితో అలా గడిపిన ఆ రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు.
యూకేలో ఉన్న ఆ రోజుల్లోనే సినిమా మీద ఇష్టంతో ప్యాషన్ ఫర్ సినిమా అనే బ్లాగ్‌లో వ్యాసాలు రాస్తుండేవాడిని. 2007లో మణిరత్నం గురు సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో, ఆయన మొదటి సినిమా పల్లవి అనుపల్లవి నుంచి ఇద్దరు దాకా ఆయన సినిమాలన్నిటినీ విశ్లేషిస్తూ ఇరవై ఐదు పేజీల ఒక పెద్ద వ్యాసం రాసి ఆ బ్లాగ్‌లో పెట్టాను. ఆ వ్యాసం చదివి, స్వయంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆ బ్లాగ్ పోస్ట్ కింద కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చూసినప్పుడు నాకు కలిగిన కిక్ అంతా ఇంతా కాదు.
ఆ తర్వాత నా జీవితంలో జరిగిన మరో అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఏంటంటే, 2013 ఫిబ్రవరి 1న మణిరత్నం కడలి సినిమా రిలీజ్ అయింది. సరిగ్గా అదే రోజున నా మొదటి సినిమా కూడా రిలీజ్ అయింది. మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తెరిచి చూస్తే, సినిమా రివ్యూల పేజీలో మణిరత్నం 'కడల్' రివ్యూ పక్కనే నా మొదటి సినిమా రివ్యూ కూడా అచ్చయింది! ఏ దర్శకుడినైతే ఆరాధిస్తూ నేను సినిమాల్లోకి వచ్చానో, ఆయన సినిమా రివ్యూ పక్కనే నా సినిమా రివ్యూ కనిపించడం చూసి ఆ రోజు నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిది.
యూకే నుంచి ఇండియాకి తిరిగి వచ్చి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలనుకున్నప్పుడు నా గోల్ కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాదు. సినిమా మేకింగ్‌లోని దాదాపు అన్ని విభాగాల్లోనూ పనిచేస్తూనే, తెలుగులో సాహిత్యానికీ, సినిమాకీ మధ్య ఉన్న గ్యాప్ తగ్గించాలని నేను ఎప్పుడూ బలంగా కోరుకునేవాడిని. ఆ ఆలోచనతోనే ఫ్రెండ్స్‌తో కలిసి తెలుగులో 'నవతరంగం' అనే ఫిల్మ్ క్రిటిసిజం వెబ్‌సైట్ మొదలుపెట్టాను. అలాగే సత్యజిత్ రే రాసిన Our Films, Their Films పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంతో నా పబ్లిషింగ్ ప్రయాణం మొదలైంది.
అదే ప్రయాణంలో మేము 'అన్వీక్షికి పబ్లిషర్స్' స్థాపించాక, భరద్వాజ్ రంగన్ రాసిన ఈ Conversations with Mani Ratnam పుస్తకాన్ని కచ్చితంగా తెలుగులోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యాం. నిజానికి ఈ పనిని ఎవరైనా మంచి అనువాదకులకు అప్పగిద్దామని నేను చాలా ప్రయత్నించాను. కానీ ఈ పుస్తకానికి పూర్తి న్యాయం చేయగల మనుషులు నాకు దొరకలేదు. ఎందుకంటే ఇది కేవలం ఇంగ్లీష్ వాక్యాలను తెలుగులోకి మార్చే మామూలు అనువాదం కాదు. ఇది పూర్తిగా ఫిల్మ్ మేకింగ్ గురించిన పుస్తకం. స్క్రిప్ట్ రాయడం, కెమెరా యాంగిల్స్, లెన్సింగ్, ఎడిటింగ్ కట్స్, సౌండ్ మిక్సింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరింగ్... ఇలా సినిమా క్రాఫ్ట్ మీద లోతైన అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే దీన్ని అనువదించగలరు. దాంతో చివరికి ఆ బాధ్యతను నేనే నా భుజాల మీద వేసుకున్నాను.
ఇంత పెద్ద పుస్తకాన్ని అనువదించడం అంత సులభంగా ఏమీ జరగలేదు. వేరే పనుల ఒత్తిడి వల్ల, ఇది చాలా కష్టమైన పని అవ్వడం వల్ల మధ్యలో ఎన్నోసార్లు పక్కనపెట్టేశాను, ఇక నావల్ల కాదేమో అని వదిలేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మణిరత్నం సినిమాల మీద ఉన్న ప్రేమ నన్ను మళ్లీ మళ్లీ ఈ పుస్తకం దగ్గరికి లాక్కొచ్చింది. ఇన్నాళ్లకు ఈ పని పూర్తయినందుకు నాకు కేవలం సంతోషంగా మాత్రమే కాదు, ఎంతో గర్వంగా, ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఎందుకంటే ఇది మార్కెట్లోకి వచ్చే మరో మామూలు పుస్తకం కాదు. సినిమాని ప్రేమించే వాళ్లకి, సినిమా తీయాలనుకునే వాళ్లకి ఇదొక ఫిల్మ్ స్కూల్. ఎంత కాలం గడిచినా చరిత్రలోఎప్పటికీ నిలిచిపోయే పుస్తకం ఇది. మణిరత్నం సినిమాల ప్రయాణాన్ని తెలుగు పాఠకుల చేతుల్లో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ... వెంకట్ శిద్దారెడ్డి.
నవంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో జరుగుతున్న ఛాయ లిటరేచర్ ఫెస్టివల్‌కి అందరూ వస్తున్నట్టే కదా?
కలుద్దాం 💙🤗
@chaayalitfest
V Mallikarjun retweeted
పదో తరగతయ్యాక సైకిల్ తొక్కుకుంటూ ఇంటింటికీ పేపర్లు వేసా. తర్వాత కొన్నాళ్ళు విశాఖ ఆంధ్రజ్యోతిలో పని చేసా. హైదరాబాద్ వచ్చాక బోరబండ దగ్గర ఇదే కొట్టులో రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ కొనేవాణ్ణి. ఇప్పుడదే కొట్లో నేను పడ్డ పేపర్ కొన్నాను.
life comes full circle🖤
V Mallikarjun retweeted
నమస్తే తెలంగాణ’ పత్రిక ‘బతుకమ్మ మ్యాగజైన్’లో ఈరోజు మన‘తలపు’ గురించి ప్రచురించారు. ఎంతో ఆనందంగా ఉంది చదువుతూంటే. ఇంతందంగా రాసిన రాజు గారికి ప్రేమపూర్వక కౌగిలింతలు🫂🤗
V Mallikarjun retweeted
అమ్మాయిలూ..
మరి మీ మీ బాయ్‌ఫ్రెండ్స్‌తో 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివించి, చర్చ పెట్టండి! 💙🤗
Happy reading!
#OkaEndakalapuMadhyahnam
అమ్మాయిలూ..
మరి మీ మీ బాయ్‌ఫ్రెండ్స్‌తో 'ఒక ఎండాకాలపు మధ్యాహ్నం' నవల చదివించి, చర్చ పెట్టండి! 💙🤗
Happy reading!
#OkaEndakalapuMadhyahnam
నిన్న నా పుట్టినరోజున ఎంతో ప్రేమగా నన్ను తల్చుకొని శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ప్రేమ. వర్షిణి అని ఒక పాఠకురాలు ఇన్‌స్టాలో ఇది రాసి పోస్ట్ చేసింది. ఎంత ప్రేమ, ఎంత అభిమానం!
ఇలాంటివి చదివినప్పుడల్లా - రాస్తున్నందుకు, రాయగలుగుతున్నందుకు గర్వంగా ఉంటుంది.
మీకు నా ప్రేమ. 💙🤗
V Mallikarjun retweeted
“నల్గొండ” తీస్కపోయి “ఎండాకాలం మధ్యాహ్నం “ మనకి “ఇరానీ చాయ్ “ తాగిపించి, సాయంత్రం వర్షం లో “కాగితం పడవలు “ చేసి ఆడించిన మా మల్లన్న @insidemalli కి
పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు…
Always my brother , all the love to you !!
V Mallikarjun retweeted
తమ్ముడు మల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
🥰🎉❤️🥳🎊🎂🎈
@insidemalli
V Mallikarjun retweeted
తను కేవలం కథా రచయిత మాత్రమే కాదు. మనసు విలువ తెలిసిన స్వచ్ఛమైన ప్రేమికుడు. నిరాటంకంగా ప్రేమ ఇస్తూ పోవడం తప్ప మరేమీ తెలియని గంధపు చెక్క వంటి @insidemalli కి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు 🤗🥳
నిన్ను మొదటిసారి కలిసిన రోజును కూడా నేను చాలా విలువైనదిగా భావిస్తాను మల్లీ..🤗🤩
శతమానం భవతి 🙌
V Mallikarjun retweeted
Replying to @insidemalli
@insidemalli ✨ "నీకు నా ప్రేమ" అంటూ ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే నీ స్వచ్ఛమైన మనసు పసిడి వర్ణం...💛
ప్రేమను పంచడంలో నీకంటే మిన్న ఎవరూ లేరు!
ఈ రోజే కాదు, నీ జీవితంలో ప్రతి క్షణం ఒక సూపర్ హిట్ సినిమా డైలాగ్‌లా, ఎవర్ గ్రీన్ రీల్‌లా మెరిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! 🎥🍿🎈
🌟 Wish you a blockbuster year ahead with endless happiness & ultimate success! 🌟
💙
పుట్టినరోజు శుభాకాంక్షలు @insidemalli అన్నయ్య.🤗
మళ్ళీ ఎప్పుడు ఎండాకాలపు హృదయాలని హత్తుకుంటావ్?🖤
2
6
571
Mafia don 😂😂
Thank you Akhilaa. నీకు నా ప్రేమ 🤗
Wish you many more happy returns of the day- the mafia don @insidemalli 😝😝😝తెలుగు సమకాలిన సాహిత్యంలో -చాలా పుస్తకాల్లో ముందుమాటలో మల్లికార్జున్ పేరు లేకుండా ఉండదు. అలాగే కొత్తగా రాయాలనుకునే వారికి, పబ్లిషింగ్ పెట్టాలనుకునే వాళ్ళకి, అమెజాన్లో list చెయ్యాలనుకునే వాళ్ళకి first point of contact and encouragement అన్నీ మల్లి అన్ననే.
అంతెందుకు నాకు social media create చేసింది కూడా అన్ననే-ఈ ట్విట్టర్ పేజీతో సహా.
అందుకే నేనంటాను “ మల్లికార్జున్ మాఫియా అన్నా ఇది” అని. 😝😝😝😝😝
ఈ మాఫియా ఇలానే మిగతా భాషల్లోనూ కొనసాగాలని కోరుకుంటూ-పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా 🥳🥳🥳
Thank you soo much for supporting all of us with your selfless deeds and guidance.
#mallikarjun #teluguliterature #books
3
498
V Mallikarjun retweeted
నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక, హైదరాబాద్ ఎడిషన్❤️🥹
ఆలస్యం చేయకుండా వచ్చేయండి. పుస్తకాల గురించి మాట్లాడుకుందాం. తలపులను పంచుకుందాం🤗💙
#talapubookhome #tbh #andhrajyothi #telugubookstores #ameerpethyderabad
నా నవలను రెండోసారి చదువుతున్నామని చెప్తున్నారు చాలామంది. కొంతమంది మూడు, నాలుగోసారి చదువుతున్నామని చెప్పారు. ఈ పుస్తకానికి వస్తున్న రివ్యూలు చూస్తే ఒక్కోసారి నాకే ‘నేనింత రాసిన్నా?’ అనిపిస్తుంది.
Truly blessed to have such beautiful readers for Oka Endakalapu Madhyahnam. 💙🤗
🤖 Made with AI
'తలపు బుక్ హోమ్' అని అమీర్‌పేట్‌లో కొత్త బుక్ షాప్ వచ్చింది.
AAA Cinemasకి దగ్గర్లోనే. మనందరం ఎప్పడు ఎటాక్ చేద్దామో చెప్పండి! 🤗
Congratulations team @TalapuBookHome 💙
V Mallikarjun retweeted
నచ్చిందా?
బాధ పెట్టిందా?
ఏం మాట్లాడాలో తెలియడం లేదా?
.
.
"ఇంకోసారి చదవాలని ఉంది" 🙋🏻♂️😄
Thank you to all OEM readers for your love and support. 🤗
@insidemalli
🤖 Made with AI









































