Pinned Tweet
Thank you, @PawanKalyan Sir, for your wonderful gesture of recognizing me and the countless supporters you have.🫡
We will be with you every step of the way in your journey as Janasenani, as we all understand that your ultimate aim is to serve the public and improve lives .
Dear @sreekanth324, Through you, I would like to reach out to each and every social media handle and all the supporters who has stood by me and @JanaSenaParty and would like to convey my heartfelt gratitude to you all, for standing by me and supporting me through thick and thin.
My love for our ‘Motherland Bharath’ makes me to go against all odds to establish Dharma.
Thank you all once more for being a part of our incredible journey.
He got the opportunity to serve, and he chose the path of development. He stood by the people, worked for progress, and turned their hopes into reality.
Now, it’s our turn to stand by him .
Let our vote be a token of gratitude for his efforts, a voice for our aspirations, and a commitment to continued development.
Remember the work. Honour the commitment. Vote for the Glass Symbol!
#VoteForGlass
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ !!
అర్నాబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, అంటువ్యాధుల నివారణకు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలతో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
🔹 100 ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు కోనసీమకు 55, పశ్చిమ గోదావరికి 45
🔹 475 మంది సిబ్బంది 9 జిల్లాల నుంచి ప్రత్యేక నియామకం
🔹 48 మంది సాంకేతిక సిబ్బంది తాగునీటి నాణ్యత పరీక్షలకు ప్రత్యేక బృందాలు
🔹 నీటి నిల్వల తొలగింపు, మురుగు కాలువల శుభ్రత, బ్లీచింగ్, క్లోరినేషన్‌పై ప్రత్యేక దృష్టి
🔹 కలుషిత నీరు, అంటువ్యాధుల ముప్పును నివారించేందుకు నిరంతర పర్యవేక్షణ
తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కూడా ప్రజారోగ్యానికి ఎలాంటి ముప్పు తలెత్తకుండా, గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పారిశుద్ధ్య, తాగునీటి భద్రతా చర్యలు కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
ప్రజల భద్రతే ప్రాధాన్యం ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు .
#CycloneArnab
ANDHRA PRADESH RANKS NO. 1 IN VBG-RAM-G EXPENDITURE 🇮🇳
₹7,194.87 CRORE - A significant milestone in rural development and employment generation!
Under the leadership of Deputy Chief Minister Sri @PawanKalyan garu, Andhra Pradesh is strengthening rural livelihoods and accelerating village infrastructure development.
April 1 – October 27, 2026
🔹 Total Expenditure: ₹7,194.87 Cr
🔹 Workers’ Wages: ₹5,142.49 Cr
🔹 Material Expenditure: ₹2,052.38 Cr
🔹 All-India Expenditure: ₹38,722.04 Cr
NO. 1 IN EXPENDITURE. STRONGER RURAL LIVELIHOODS.
A NEW MOMENTUM FOR VILLAGE DEVELOPMENT .
This Is What JanaSena Party Has Achieved in Politics !!
More than 4,000 first-time candidates are stepping into electoral politics as Corporators, Councillors, ZPTCs and MPTCs under the banner of JanaSena Party.
This is the emergence of a new generation of grassroots leadership, creating opportunities for fresh voices to enter public life and serve the people.
A movement that opens doors for ordinary people to become public representatives.
JanaSena Party - Creating opportunities for new leaders ✊
@PawanKalyan !! @JanaSenaParty
వీబీజీ రామ్‌జీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం 🇮🇳 !!
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది.
ఏప్రిల్ 1 – అక్టోబర్ 27, 2026 వరకు
🔹 మొత్తం వ్యయం: ₹7,194.87 కోట్లు
🔹 కూలీల వేతనాలు: ₹5,142.49 కోట్లు
🔹 మెటీరియల్ ఖర్చులు: ₹2,052.38 కోట్లు
🔹 దేశవ్యాప్త మొత్తం వ్యయం: ₹38,722.04 కోట్లు
గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పిస్తూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ, ప్రజలకు మెరుగైన జీవనోపాధి అవకాశాలు అందించడమే లక్ష్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది.
ఉపాధి కల్పన నుంచి గ్రామాల అభివృద్ధి వరకు ప్రజా ప్రయోజనాలే ప్రాధాన్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం .
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
పరిశుభ్రమైన గ్రామాలు – ఆరోగ్యకరమైన సమాజం !!
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్‌లో బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇంటి వద్దనే తడి, పొడి చెత్త వేరు చేయడం, ఇంటింటికీ అవగాహన కల్పించడం, చెత్తను సక్రమంగా సేకరించి అప్పగించడం వంటి కార్యక్రమాల్లో పాఠశాలలు, స్థానిక ప్రజలు భాగస్వాములవుతున్నారు.
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన గ్రామాలు.. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యం .
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత !!
అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు, నిరంతర పర్యవేక్షణలో ఉప్పాడ హైస్కూల్ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న తీర ప్రాంత ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ అధికారులు, యువకులు అండగా నిలుస్తున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సహాయక చర్యలను సమర్థవంతంగా కొనసాగిస్తూ, వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.
ఆపదలో ప్రజలకు అండగా నిలవడం.. జనసేన ప్రజాసేవా సంకల్పం .
@PawanKalyan !! @JanaSenaParty
ప్రకృతి విపత్తుల వేళ ప్రజలకు భరోసాగా.. ఆపదలో ఉన్నవారికి అండగా.. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా ముందుకు సాగుతున్న జనసేనాని, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. ✊
అర్నాబ్ తుపాను నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ, ముందస్తు చర్యలు, సహాయక చర్యలతో ప్రజలకు అండగా జనసేన పార్టీ.
ప్రజాసేవే లక్ష్యం.. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యం.
#CycloneArnab
ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత !!
అర్నాబ్ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, జిల్లాల వారీగా తుపాను తీవ్రతను అంచనా వేస్తూ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైన వారికి సహాయక శిబిరాల ద్వారా పునరావాసం, అవసరమైన సదుపాయాలు కల్పిస్తోంది.
తుపాను ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అత్యవసర సహాయం కోసం సంప్రదించవలసిన హెల్ప్‌లైన్ నంబర్: 9552300009
#CycloneArnab
ఉప్పాడ రక్షణ గోడపై విమర్శలు చేసేవారు ఈ వాస్తవాలను తెలుసుకోవాలి 🌊 !!
దశాబ్దాల సముద్ర కోత సమస్యకు ₹323 కోట్లతో శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.
ఉప్పాడలో రెండున్నరేళ్లుగా ఏమీ జరగలేదని ప్రశ్నించే వారు, గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.
ఉప్పాడ సముద్ర కోత తీవ్రత అధికారిక గణాంకాలు:
🔹 1989 నుంచి ఏటా సగటున 1.23 మీటర్ల మేర తీరరేఖ కోతకు గురవుతోంది.
🔹 2017–18 ఒక్క ఏడాదిలోనే 26.3 మీటర్ల తీరప్రాంతం సముద్రంలో కలిసిపోయింది.
🔹 ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
🔹 గతంలో 2010లో ఏర్పాటు చేసిన ₹12.16 కోట్ల జియోట్యూబ్ రక్షణ వ్యవస్థ కూడా సముద్ర అలల ధాటికి విఫలమైంది. అంటే ఇది సాధారణ గోడ కట్టేస్తే సరిపోయే సమస్య కాదు శాస్త్రీయ అధ్యయనంతో కూడిన పరిష్కారం అవసరం.
📌 ₹323 కోట్ల ప్రాజెక్టు వెనుక ఉన్న కీలక పరిణామాలు:
▪️ కేంద్ర ప్రభుత్వ స్థాయి: 2025 జూలై 22న లోక్‌సభలో ఇచ్చిన అధికారిక సమాధానం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం ₹323 కోట్ల ఆర్థిక సాయం కోసం ప్రతిపాదన సమర్పించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం SC-NEC పరిశీలన, హై లెవల్ కమిటీ ఆమోద ప్రక్రియ కీలకం.
▪️ కేంద్ర నిధుల నేపథ్యం: 15వ ఆర్థిక సంఘం 2021–22 నుంచి 2025–26 కాలానికి దేశవ్యాప్తంగా తీర, నదీ కోత నివారణకు National Disaster Mitigation Fund (NDMF) కింద ₹1,500 కోట్లు సిఫార్సు చేసింది.
▪️ ఆగస్టు 12, 2026: ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో IIT మద్రాస్‌తో ఒప్పందం కుదిరింది. ₹323 కోట్ల ప్రాజెక్టుకు డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను IIT మద్రాస్‌కు అప్పగించారు.
▪️ సెప్టెంబర్ 2026: IIT మద్రాస్‌కు చెందిన ఐదుగురు నిపుణుల బృందం క్షేత్రస్థాయి సర్వే ప్రారంభించింది. డ్రోన్లు, Trimble R980 GNSS RTK పరికరాలతో తీరరేఖ మ్యాపింగ్, అలల ప్రభావం, సముద్ర ప్రవాహాలు, సముద్రగర్భ పరిస్థితులు, ఇసుక నమూనాలు, తీర కోత తీవ్రతను అధ్యయనం చేసింది.
▪️ అమలు వ్యవస్థ: రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SDMA) నోడల్ ఏజెన్సీగా, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నిర్మాణ పనుల అమలు సంస్థగా వ్యవహరించనున్నాయి.
▪️ తదుపరి దశ: సాంకేతిక అధ్యయనం, డిజైన్, DPR ఆధారంగా తగిన తీర రక్షణ నిర్మాణాలను ఖరారు చేసి పనులు చేపట్టే ప్రక్రియ ముందుకు సాగుతోంది.
ఇదే అసలు విషయం .
కేంద్ర ప్రభుత్వ నిధులతో, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, IIT మద్రాస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ పర్యవేక్షణలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అంటే కేవలం ఒక ప్రకటనతో పూర్తయ్యే పని కాదు.
₹323 కోట్లు అనేది కేవలం ఒక సంఖ్య కాదు సముద్ర కోత ముప్పును ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాల భద్రత, ఇళ్ల రక్షణ, వారి భవిష్యత్తుతో ముడిపడిన ప్రాజెక్టు.
పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. కానీ ఇప్పటికే జరిగిన అధికారిక చర్యలను విస్మరించి, అసలు ఏమీ జరగలేదని చెప్పడం వాస్తవాలను పూర్తిగా ప్రతిబింబించదు.
విమర్శలు చేయడం కన్నా, దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే ప్రక్రియను వాస్తవాలతో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఉప్పాడ ప్రజలకు కావాల్సింది రాజకీయ ఆరోపణలు కాదు సమర్థవంతమైన తీర రక్షణ, భద్రమైన నివాసాలు, శాశ్వత పరిష్కారం .
పంట నష్టపోయిన రైతులకు అండగా ఏపీ ప్రభుత్వం !!
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా పంటల వారీగా పరిహారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
🔹 పత్తి, గోధుమ, చెరకు: ఎకరాకు ₹25,000
🔹 వరి: ఎకరాకు ₹20,000
🔹 సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు: ఎకరాకు ₹15,000
🔹 అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్: ఎకరాకు ₹35,000
🔹 కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్: ఎకరాకు ₹25,000
🔹 తమలపాకు తోటలు: ఎకరాకు ₹75,000
🔹 కొబ్బరి, ఆయిల్ పామ్: ఒక్కో చెట్టుకు ₹15,000
రైతు కష్టానికి అండగా నిలిచి, పంట నష్టాల నుంచి కోలుకునేందుకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా ఈ పరిహారం ప్రకటించినట్లు సమాచారం.
రైతు సంక్షేమమే లక్ష్యం… వ్యవసాయానికి భరోసానే ధ్యేయం .
@ncbn !! @PawanKalyan
“డిప్యూటీ సీఎం ఎక్కడ?” అని ప్రశ్నించే ముందు.. ఆయన ఇస్తున్న ఆదేశాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్యలను గమనించండి .
అర్నాబ్ తుపాను నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తూ, సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావం తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
దెబ్బతిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, వరద ప్రవాహాలపై నిరంతర నిఘా ఉంచాలని, పంటలు, ఇళ్లు, ప్రభుత్వ ఆస్తుల నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గాల్లో పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించి, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
నాయకత్వం అంటే ప్రతి చోట కెమెరాల ముందు కనిపించడం కాదు.. సరైన సమయంలో సరైన ఆదేశాలు ఇవ్వడం, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, ప్రజలకు సహాయం అందేలా పర్యవేక్షించడం .
ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసుకోకుండా ప్రశ్నించడం సులభం. కానీ విపత్తు వేళ రాజకీయ విమర్శల కంటే ప్రజల ప్రాణాలు, భద్రత, పునరుద్ధరణ చర్యలే ముఖ్యం.
ప్రశ్నించే ముందు వాస్తవాలు తెలుసుకోండి. ప్రజలకు అండగా నిలుస్తున్న యంత్రాంగం పనితీరును గుర్తించండి. విపత్తు వేళ రాజకీయం కాదు.. ప్రజా సంక్షేమమే ప్రాధాన్యం .
#ArnabCyclone
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత.. బాధితులకు అండగా ప్రభుత్వం !!
అర్నాబ్ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమీక్షిస్తూ, పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్, తాగునీటి సరఫరాను పునరుద్ధరించడం, పంటలు, ఆస్తి నష్టాన్ని అంచనా వేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టాన్ని నివారించగలిగామని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటే.. వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శలు చేయడం బాధ్యతాయుత వైఖరి కాదు. విపత్తు వేళ ఎవరు ఎక్కడ ఉన్నారనే ప్రశ్నల కంటే, ప్రజలకు అందుతున్న సహాయం, సమస్యల పరిష్కారం, ప్రాణాల రక్షణే ముఖ్యం.
రాజకీయ విమర్శలు తర్వాతైనా చేసుకోవచ్చు.. కానీ విపత్తు వేళ ప్రజలకు భరోసా ఇవ్వడం, బాధితులకు అండగా నిలవడం మనందరి బాధ్యత!
#ArnabCyclone
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత !!
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ముఖ్యం. ఎవరు ఎక్కడ ఉన్నారనే విమర్శల కంటే, ప్రజలకు అందుతున్న సహాయం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్యలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలి.
విపత్తు వేళ రాజకీయ విమర్శలు కాదు.. ప్రజలకు భరోసా, భద్రత, సహాయమే ముఖ్యం .
#ArnabCyclone
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిన PD శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావిత ప్రజలకు తక్షణ సహాయం అందించడంతో పాటు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణను వేగవంతం చేయాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అండగా నిలుస్తూ, సహాయక చర్యలు మరియు పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
#ArnabCyclone
ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యత !!
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా పర్యవేక్షిస్తూ, అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడం ముఖ్యం. ఎవరు ఎక్కడ ఉన్నారనే విమర్శల కంటే, ప్రజలకు అందుతున్న సహాయం, క్షేత్రస్థాయిలో జరుగుతున్న చర్యలు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలి.
విపత్తు వేళ రాజకీయ విమర్శలు కాదు.. ప్రజలకు భరోసా, భద్రత, సహాయమే ముఖ్యం .
#ArnabCyclone
Uppada, Mulapeta, Konapapeta cyclone ki allaadipotunte ma MLA gaaru duppati kappukuni Hyd lo padukunnaru🤦♂️
#CycloneArnab
#uppada
ఒకవైపు ప్రభుత్వం, SDRF, NDRF, పోలీస్ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు అర్నాబ్ తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతగా పనిచేస్తున్నారు.
మరి మీరు మాత్రం గతంలో విజయవాడ సింగ్ నగర్‌లో బుడమేరు వరదల సమయంలో నమోదైన వీడియోలను ఇప్పుడు అర్నాబ్ తుఫానుకు ఆపాదిస్తూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం?
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వ్యవస్థలు పోరాడుతుంటే.. పాత వీడియోలతో ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం మీ బాధ్యతా?
విమర్శలు చేయడం మీ హక్కు. కానీ వాస్తవాలను వక్రీకరించడం కాదు. విపత్తు సమయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా నిలవాలి.. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించకూడదు.
ప్రజలకు భరోసా ఇద్దాం.. తప్పుడు ప్రచారాన్ని ఖండిద్దాం .
This quoted post is unavailable.
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన PD ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఎన్.వి. శివరాం ప్రసాద్ గారు.
తుఫాన్ ప్రభావంతో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని, దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
ప్రజలకు అండగా.. విపత్తు వేళ నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో సహాయక చర్యలు.
రూ.1.50 లక్షల కోట్లతో గ్రామీణాభివృద్ధికి బాటలు !!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా రూ.1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు వెల్లడించారు.
🔹 పల్లె పండుగ: రూ.20,390 కోట్లతో 16,000 కి.మీ. సీసీ రోడ్లు, 19,500 కి.మీ. బీటీ రోడ్లు.
🔹 అడవితల్లి బాట: రూ.3,458 కోట్లతో 3,630 కి.మీ. రహదారులు, 45 వంతెనలు, 2,199 గిరిజన ఆవాసాలకు రహదారి అనుసంధానం.
🔹 అమరజీవి జలధార: రూ.30,156 కోట్లతో 50,300 పనులు.
🔹 ఉద్యోగుల బకాయిలు: రూ.30,000 కోట్ల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి.
పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి గిరిజన ప్రాంతాలకు రహదారి అనుసంధానం వరకు గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ గారు వివరించారు.
జనసేన వీరమహిళ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా… !!
ఏలూరు 28వ డివిజన్ నుంచి ప్రజాసేవకు ముందడుగు వేసిన తేజస్వికి శుభాకాంక్షలు. జనసేన సిద్ధాంతాలపై నమ్మకం, @PawanKalyan గారి నాయకత్వంపై విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, ప్రజాసేవలో అవకాశం లభిస్తాయనే నమ్మకం ఉంది.
ఓపికగా ప్రయాణం కొనసాగించాలి… సమయం వచ్చినప్పుడు ప్రతి కృషికి తగిన ఫలితం దక్కుతుంది .
#VoteForGlass #APLocalBodyElections
























