Pinned Tweet
ఇందులో ఒక చోట ఉంటాను చిన్న బిందువు లాగా.. :)
#RSS
#RSSGhosh
#Venu
శరావతి రాగంలో వినపడతాను 🙏🚩
Beautiful to listen till 6min30sec
More beautiful to see and listen after that :)
youtu.be/0izUtZ9vaPE?si=faGh…
వజ్రం वज्र retweeted
చతుర్భుజాం చంద్రనిభాననాం తాం
పద్మాసనాం పద్మకరాం ప్రసన్నామ్
పీతాంబరాం రత్నకిరీటభూషాం
శ్రీవేంకటేశప్రియకామినీం భజే 🙏🏻
విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షఃస్థలస్థితే
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోఽస్తు తే |🙏🏻
🤖 Made with AI
వజ్రం वज्र retweeted
హైదరాబాదుల ఉన్నవారు ఈ అవకాశాన్ని వాడుకోవాలె...
మీపిల్లలతో పాటు పోండి...
రేపటి తెలుగుని మోసేది వాళ్ళే...
వజ్రం वज्र retweeted
ఇది చేద్దమని మొదలుపెట్టేటపుడు తెలివి కంటే తెగువనే ఎక్కువ ఉన్నది... 😁😁🙏🙏
గుండప్ప గారు @విద్యారణ్యర సమకాలీనరు
వజ్రం वज्र retweeted
MR. KEERAVANI-BEFORE AND AFTER!My dearest friend, the Oscar-winning music director M. M. Keeravani sir, has lost an incredible 22 kilos—and his determination is truly inspiring.😳😳
It was so wonderful to meet him during my trip to Hyderabad. He looked fresh, full of energy and ready to take on the world. There was a lovely bounce in his walk, and seeing him so happy and confident made me so proud.
Keeravani sir, you are a genius with music!! And now you’ve shown us what focus and determination can make possible. Here’s to your inspiring new chapter, my friend. So wonderful to see you! Jai Ho!😍😎👏👏 @mmkeeravaani #WeightLoss #Determination
వజ్రం वज्र retweeted
మీకు రామాయణం చాలా సరళమైన భాషలో అర్ధమవ్వాలంటే, ఉషశ్రీ రామాయణము చదవండి.
సుందరకాండ నుండి.
"ఉత్తమురాలయిన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయౌవన సంపన్నుడూ, సర్వాలంకారభూషితుడూ అయిన రావణుని చూస్తూనే పెనుగాలిలో అరటిమొక్కలా కంపిస్తూ, కాళ్ళూ చేతులూ ముడుచుకుని కూర్చుంది.
విపరీత దుఃఖంతో ఉన్న ఆవిడ మహాసముద్రంలో మునిగిపోయిన నావలా ఉంది.
వ్రతనియమంతో, ఏ ఆస్తరణం లేకుండా నేలమీద కూర్చున్న ఆ యిల్లాలు చెట్టునుండి విరిగిపడిన కొమ్మలా ఉంది.
తన మనస్సు ఎరిగిన రాముని దగ్గరకే ఆమె మనస్సు ప్రయాణం చేస్తున్నది. రామునిమీదనే సర్వమూ లగ్నం చేసుకున్నది. మంత్రబద్ధమయిన ఆడత్రాచులా ఉంది. ధూమకేతువు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది.
....... (తరువాత రావణునితో సంభాషణ)"
అకామాం కామయానస్య
శరీర ముపతప్యతే
ఇచ్ఛంతీం కామయానస్య
ప్రీతి ర్భవతి శోభనా
భావం (తెలుగు అర్థం):
తనను ఇష్టపడని (కోరని) స్త్రీని కోరుకునే పురుషుడి శరీరము, మనస్సు నిరంతరం వేదనతో తపించిపోతాయి (బాధను మాత్రమే మిగులుస్తాయి). అందుకు విరుద్ధంగా, తనను ఇష్టపడే స్త్రీని కోరుకునేవాని ప్రేమ ఎంతో ఆనందదాయకంగా, శుభప్రదంగా (సార్థకంగా) ఉంటుంది.
డబ్బులు దేని కోసం ఖర్చు పెట్టాలి అనేది నేర్చుకోవాలి.
మరోమాట:
ఇప్పుడు సమయమే పెద్ద ధనం.
ధర్మానికి మీ సమయం ఇవ్వండి. డబ్బు అదే వస్తుంది.
ప్రఫుల్లా.. మీరు motivate అయ్యి అందర్నీ ఇలానే motivate చేస్తూ ఉండండి
This quoted post is unavailable.
1
6
217
వజ్రం वज्र retweeted
నిజంగనే మీ తాతలు నేతులు తాగినరు...
అది మీరు మరచేటందుకు మీకు కుడితి అలవాటు చేసినరు...
నిజంగనే మీరు, మీ కిందటి తరాలు కుడితే తాగేవారు అని మిమ్మల్ని నమ్మిచ్చినరు...
బలహీనులని చేసినరు...
చేస్తున్నరు...
ఎక్కడ పోయింది తెలుగువారి ధర్మ గుణము, ధైర్య గుణము??
ఒక్కటే గుర్తుపెట్కోవాలె...
ధర్మ ఏవ హతో హన్తి
ధర్మో రక్షతి రక్షితః
వజ్రం वज्र retweeted
ప్రభూ !
మహాసముద్రం లాంటి నీలో
కాగితం పడవలాంటి నా హృదయం
అనంతమైన ఆకాశాన్ని నీలో కలిపేసుకుంటావ్
నేనేమో బంధాల అలలలో ఊగిసలాడుతూ ఉంటాను
#ఈశ్వరుడితోనేను
వజ్రం वज्र retweeted
కార్తీకమాసముల కంటెంటు నెత్తిల క్రియేట్ కావాలె తప్ప యూట్యూబులనో ఇన్స్టాగ్రాములనో ట్విట్టర్లనో కాదు...
ధర్మానికి సంబంధించినంతవరకు క్లిక్ బెయిట్ వీడియోలను ప్రోత్సహించకుండ ఉండడం మీర్జేసే ధర్మ పరిరక్షణలో భాగము...
ధర్మము మిమ్మల్ని శాంతింపజేయడానికి ఉన్నది తప్ప అనవసరంగా ఎగ్జైట్ చేయడానికి కాదు...
ఎగ్జైట్మెంటు కోసము ఎంటర్టెయిన్మెంటు కోసము కాదు ఎన్లైట్మెంటు కోసము పాటించాలె ధర్మము...
జరిగిన నష్టము చాలును...
తప్పులు దిద్దుకుందము...
కృష్ణార్పణమస్తు
చెప్పండి చెప్పండి ఎవరెవరికేం కావాల్నో...
అట్లనే ఇంకో విషయము గుర్తుపెట్కోవాలె...
కార్తీకమాసముల కంటెంటు నెత్తిల క్రియేట్ కావాలె తప్ప యూట్యూబులనో ఇన్స్టాగ్రాములనో ట్విట్టర్లనో కాదు...
ధర్మానికి సంబంధించినంతవరకు క్లిక్ బెయిట్ వీడియోలను ప్రోత్సహించకుండ ఉండడం మీర్జేసే ధర్మ పరిరక్షణలో భాగము...
ధర్మము మిమ్మల్ని శాంతింపజేయడానికి ఉన్నది తప్ప అనవసరంగా ఎగ్జైట్ చేయడానికి కాదు...
ఎగ్జైట్మెంటు కోసము ఎంటర్టెయిన్మెంటు కోసము కాదు ఎన్లైట్మెంటు కోసము పాటించాలె ధర్మము...
జరిగిన నష్టము చాలును...
తప్పులు దిద్దుకుందము...
కృష్ణార్పణమస్తు
వజ్రం वज्र retweeted
మధ్యాహ్న భోజన పథకం కింద అయ్యవారికి తోటకూర పప్పు, వంకాయకూర...
ఇది వారు తిన్నాంక దయ ఏమన్న మిగిలుంటే చారు, పెరుగు తింటరు...
వానికి నైవేద్యం పెట్టినమనుకునే తినాలని...
యే పచంతి ఆత్మకారణాత్ తే పాపం భుంజతే...
వజ్రం वज्र retweeted
నీ ధర్మము గురించి నీకు తెలవనంతవరకు ఎవరుపడితే వారు వారికి తోచినది చెప్తరు...
తెలవని కారణంగా అదే నిజమని మీరు నమ్ముతరు...
కొంతకాలానికి అదే నిజమని మీరే ప్రచారము చేస్తరు...
మెల్లమెల్లగ అవే దగ్గరైతై... నిజాలైతై...
ధర్మశాస్త్రాలు దూరమైతై... అబద్ధాలైతయి...
ధర్మానికి సంబంధించినంతవరకు క్లిక్ బెయిట్ వీడియోలను ప్రోత్సహించకుండ ఉండడం మీర్జేసే ధర్మ పరిరక్షణలో భాగము...
ధర్మము మిమ్మల్ని శాంతింపజేయడానికి ఉన్నది తప్ప అనవసరంగా ఎగ్జైట్ చేయడానికి కాదు...
ఎగ్జైట్మెంటు కోసము ఎంటర్టెయిన్మెంటు కోసము కాదు ఎన్లైట్మెంటు కోసము పాటించాలె ధర్మము...
జరిగిన నష్టము చాలును...
తప్పులు దిద్దుకుందము...
కృష్ణార్పణమస్తు
కార్తీకమాసముల కంటెంటు నెత్తిల క్రియేట్ కావాలె తప్ప యూట్యూబులనో ఇన్స్టాగ్రాములనో ట్విట్టర్లనో కాదు...
ధర్మానికి సంబంధించినంతవరకు క్లిక్ బెయిట్ వీడియోలను ప్రోత్సహించకుండ ఉండడం మీర్జేసే ధర్మ పరిరక్షణలో భాగము...
ధర్మము మిమ్మల్ని శాంతింపజేయడానికి ఉన్నది తప్ప అనవసరంగా ఎగ్జైట్ చేయడానికి కాదు...
ఎగ్జైట్మెంటు కోసము ఎంటర్టెయిన్మెంటు కోసము కాదు ఎన్లైట్మెంటు కోసము పాటించాలె ధర్మము...
జరిగిన నష్టము చాలును...
తప్పులు దిద్దుకుందము...
కృష్ణార్పణమస్తు
వజ్రం वज्र retweeted
ఇదిగో అసిస్టెంటూ.. మొన్నామధ్య ఫ్లైట్‌లో వస్తూ 'ది అదర్స్' అనే సినిమా చూశా. ఎప్పుడూ ఒక విషయాన్ని మన వైపు నుంచే చూడటం కాదు, వాళ్ల వైపు నుంచి కూడా చూస్తే ఎలా ఉంటుంది? అలా మనకు బాగా తెలిసిన ఒక విషయాన్ని వేరే కోణంలో తీస్తే ఎలా ఉంటుందని ఓ ఐడియా వచ్చింది. ఏమంటావ్?
బావుంటుంది డైరెక్టర్ గారూ.. ఇంతకీ ఏమనుకుంటున్నారు?
రామాయణం అయితే ఎలా ఉంటుంది?
రామాయణమా? ఎలా?
రావణాసురుడి బ్యాక్‌గ్రౌండ్ అణచబడి, నలిగిపోయి, చితికిపోయిన అసురకులం. కానీ ఎటువంటి రివెంజ్ ఎమోషన్స్ లేకుండా వీణ వాయించుకుంటూ ఉంటాడు. మమ్మీ వచ్చి కనువిప్పు చేస్తుంది. అప్పుడు రావణుడు చేగువేరాలా ఎదిగి లంకకు రారాజు అవుతాడు. మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్. ఫెమినిస్ట్ కూడా!
అక్కడ అయోధ్యలో దశరథుడు యాగం చేస్తే పాయసం వస్తుంది.
నో నో.. పాయసం వెరీ ఓల్డ్. అందరికీ నచ్చదు. దాన్ని మార్చి హోలీ వాటర్ పెడతాం.
మరి కౌసల్యకు సగం కప్పు, కైకేయికి సగం కప్పు కదా.. అప్పుడు వాళ్లిద్దరూ చెరో సగం తమ వాటా సుమిత్రకు ఇస్తారు.
నో నో.. మనది ఈక్వాలిటీ చూపించాల్సిన సినిమా. మనమే ముగ్గురికీ ఒక్కో చెంచా ఇద్దాం. సమానత్వం కోసం!
అలాగే, కైకేయి ఎప్పుడూ స్ట్రెయిట్ హెయిర్‌తో ఉంటుంది. ఫ్లాట్ ఐరన్ ఇంపార్టెంట్.
మరి రాముడు సీతను పెళ్లి చేసుకోవడానికి జనక నగరం వెళ్తే, దశరథుడు వెళ్లి పెళ్లి చేయించి తీసుకొస్తాడు కదా?
నో నో.. మనది జెండర్ ఈక్వాలిటీ సినిమా. దశరథుడు అండ్ హిస్ త్రీ వైవ్స్ అందరూ వెళ్లి పెళ్లి చేస్తారు.
సరే గానీ, అంతా రామమయం అయ్యేలా ఇళయరాజానో, కీరవాణినో పెడదామా సంగీతానికి?
వద్దు. మనది గ్లోబల్ సినిమా. అందరికీ అందుబాటులో ఉండాలి. మధ్యలో కొంచెం సూఫీ, కవ్వాలీ లాంటి సంగీతం, అలాగే కొంచెం వెస్ట్రన్ మిక్స్. తెలుసుగా, ఆ ఇద్దరినీ పెట్టేద్దాం.
మరి సీతమ్మ క్యారెక్టర్ ఈ జనరేషన్‌కి సెట్ అయ్యేలా ఎలా చేద్దాం?
సీతమ్మ వారియర్ ప్రిన్సెస్. కత్తి, కర్రసాము, కరాటే అన్నీ వచ్చి ఉండాలి.
కరాటే అంటే అప్పటికి లేదేమో కదా..
అదే అదే.. పల్టీలు కొట్టడం అని నా ఉద్దేశం.
అలాగే, శూర్పణఖ. చాలా మంచి లేడీ. ఏదో వాళ్లాయనతో గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు హస్బెండ్ డెడ్ వల్ల, బ్రదర్ రావణ్ చెప్తాడు.. నువ్వెళ్లి జనస్థానంలో హ్యాపీగా ఉండు. నీ మనసుకు ఎవరు నచ్చితే చెప్పు. నేను పెళ్లి చేస్తాను అని.
రావణ్ వెరీ వెరీ బిగ్ ఫెమినిస్ట్!
కైకసి కూడా చాలా హ్యాపీ.
ఇంతలో చాలా మంది రాక్షసులు రాముడి మీదకు ఫైటింగ్‌కి వస్తారు.
డైరెక్టర్ గారూ.. ఇక్కడ మనం చాగంటి గారు రాములవారి గురించి చెప్పిన ఎలివేషన్స్ మాదిరిగా షూట్ చేద్దాం. అక్షయ బాణతూణీరాలు.. ఎప్పుడు బాణం తీస్తాడో, ఎలా తీస్తాడో, ఎప్పుడు ఎక్కుపెడతాడో, ఎప్పుడు రాక్షసులు పడిపోతారో.. కాలానికి కూడా కనపడనంత వేగంగా బాణాలు వేస్తాడు! ఎలా ఉంది?
నా మొహంలా ఉంది! రాముడు మాత్రమే హైలైట్ అవుతాడు. అక్కడ సీత కత్తి తీసుకుని రన్నింగ్, జంపింగ్ చేసుకుంటూ అందరినీ నరికేస్తూ వెళ్తుంది. మార్వెల్‌లోలా ఉండాలి ఫైటింగ్. చివరకు రాముడు అందరినీ ఒక్క టొర్నాడో బాణంతో చంపేస్తాడు.
శూర్పణఖ జనస్థానానికి వెళ్తే, అక్కడ రాముడు ఫ్యామిలీతో ఆక్యుపై చేసి ఉంటాడు. పాపం శూర్పణఖ రాముడితో చెప్తుంది.. మీరు చక్కగా మా అంతఃపురానికి వచ్చి ఉండండి. అలాగే నన్ను పెళ్లి చేసుకో అని. చాలా జెన్యూన్‌గా అడుగుతుంది.
సీత రాముడితో, "హే బ్రో! షీ హాస్ ఎ క్రష్ ఆన్ యూ" అంటుంది. లక్ష్మణుడు ఫెమినిస్ట్ కాదు. అందుకే శూర్పణఖ ముక్కు కోసేస్తాడు. సీతకి చాలా కోపం వస్తుంది. "నువ్వు ఫెమినిస్ట్‌వి కాదు. వెరీ బ్యాడ్ నువ్వు!" అని తిడుతుంది.
మనం శూర్పణఖ ముక్కు కోసినట్టు చూపించాలి. కానీ గ్లామర్ ఎంత మాత్రం తగ్గకూడదు.
రావణుడికి కోపం వస్తుంది.
మాయజింకను పంపిస్తాడు.
బంగారు జింక కదా?
కాదు. మనం కమ్యూనిజం కదా! బంగారం ఉండకూడదు. నార్మల్ జింకను పెట్టండి.
మరి కైకసి, శూర్పణఖ, మండోదరి బోలెడు బంగారం వేసుకుంటారు కదా?
మర్చిపోయావా? వాళ్లు అణచబడ్డ, నలిగిపోయి పైకి వచ్చిన కేటగిరీ. వాళ్లు వేసుకోవచ్చు!
మళ్లీ కథలోకి వెళ్తే, రావణుడు వచ్చి సీతమ్మ పెట్టిన టెస్ట్ పాస్ అయిపోయి, పుష్పక విమానంలో తీసుకెళ్లిపోతాడు. సీతకి ఏ ఎక్స్‌ప్రెషన్ పెట్టాలో మనం చెప్పం. జనాల్ని కన్‌ఫ్యూజన్‌లో పెట్టాలన్న మాట.
సీత, రాముడు గుర్తుపట్టాలని ఒక్కో నగ కిందకు వదిలేస్తూ ఉంటుంది.
రావణుడు ఫెమినిస్ట్ కదా! పాపం సీత కష్టపడుతోందని తాను కూడా ఒక నెక్లెస్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఒక్కొక్కటీ విసిరేసి హెల్ప్ చేస్తాడు.
అసిస్టెంట్ డైరెక్టర్ కళ్లల్లో నీళ్లు తుడుచుకుంటూ..
ఇంత కమ్యూనిజం, ఫెమినిజం ఉన్న రామాయణం తీయాలంటే ఎంత విజన్ ఉండాలి సార్! మీ దగ్గర పని చేయడం నా అదృష్టం!
డైరెక్టర్: సరే సరే.. ఇదేం చూశావు! పార్ట్ 2లో ఇంకా చూపిద్దాం. ముందు నిర్మాతకు ఫోన్ చెయ్.
అసిస్టెంట్: సార్, మరి రాముడి మీద, రామాయణం మీద భక్తి, పిచ్చి ఉన్న భక్తుల సంగతి ఏంటి? ఊరుకుంటారా?
అందుకే చివరగా టైటిల్స్ పడగానే హనుమాన్ చాలీసా పెడతాం. అందరూ లేచి నిలబడి, వాళ్లు కూడా కలిసి పాడి, జై శ్రీరామ్ అనుకుంటూ హాల్ నుంచి బయటకు వస్తారు!
వజ్రం वज्र retweeted
#ధన్వంతరీజయంతి
#ధన్వంతరీ_జలగ
🔱ధన్వంతరి క్షీరసాగరమధనం జరిగినపుడు సముద్రం లోంచి అమృత కలశంతో బైటికి వచ్చాడు .
🔱అలా వచ్చిన ధన్వంతరి నాలుగు చేతుల్లో
అమృత కలశం,జలగ శంఖం,చక్రం ఉన్నాయి.
వజ్రం वज्र retweeted
నేన్ పెట్టిన పోస్టుకి కింద ఫోటోలో పోస్టు చేసిన కొశను ఒకరడిగినరు...
మిగతావారికీ అట్లాంటి ప్రశ్నలుండొచ్చని ఇక్కడనే రాస్తున్న...
---
డబ్బులు మీ చేతులతో మీరే ఆ కార్యక్రమానికి ఖర్చుపెట్టాలి, ఇంకొకరికి ఇయ్యడం కాదు, నాకియ్యడం కాదు...
ధర్మము నిలబడి ఉండేటందుకు ఏమేం కారణమైతున్నయి అనేది గుర్తుతెప్పించడము వరకే నా బాధ్యత...
మీకంటూ ఓ ఊరు ఉన్నప్పుడు దాన్ల మటుకే మీ ఫోకసు ఉండాలె...
అందరూ తిరుపతికే పోతము, సింహాచలముకే పోతము, భద్రాచలముకే పోతము, యాదాద్రికే పోతము అంటె మిమ్మల్ని, మీ ముందు తరాలని కాపాడిన మీ ఊర్ల తిరిగిన ధర్మము ఏమైతది అనేది ఆలోచించాలె...
స్వధర్మాచరణ శ్రేయస్కరము అని చెప్పిరి కద వారు...
అది సొంతఊరిలనే చేయమని సపరేటుగా చెప్పకపోయినా దానర్థం అదే...
డబ్బులు సంపాదించేటందుకు కన్న ఊరిని ఒదిలిపెట్టి వేరే ఊరుని పట్కోవడంలో తప్పేం లేదు..
డబ్బులు ఒచ్చినాక కూడా కన్న ఊరిని పట్టించుకోకపోవడమే తప్పు...
1) ఊర్ల మీరు చిన్నప్పుడు ఆడుకున్న గుడికి మంది ఒస్తున్నరా?? దాన్ల దీపానికి, నైవేద్యానికి డబ్బులు సరిపోతున్నయా??
2) ఊర్ల ఉన్న యువకుల దృష్టి గుడికి, ధర్మానికి కనెక్ట్ అయ్యి ఉన్నదా??
3) కడుపు కాలుతుంటే ధర్మం ఎట్ల గుర్తొస్తది?? ఊర్ల యువకులకి ఉద్యోగాలపరంగా మీరేమన్న సహాయము అందించగలరా??
4) తెలుగు, సంస్కృత భాషలపై ఆసక్తి ఉన్న ఊరి యువకులకు ఆర్థికంగా సహకరించి, మన ప్రాచీన ధార్మిక పుస్తకాలను రీప్రింట్ చేయడానికి లేదా డిజిటలైజ్ (మళ్లీ టైప్) చేయడానికి ముందుకు రాగలరా???
మీ ఊరిని మీరు బాగ చూసుకోవాలె...
ఊరి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి మీ స్వహస్తాలతో చేసే ప్రయత్నమే నేనడిగిన ధర్మ ప్రచారం...
ఈ విషయంలో మీ ఊరికి మీరు ఏం చేయగలరో ఆలోచించండి...
ఏమన్న కొశ్శన్లుంటే అడగండి.. తోచినది చెప్త.. చాతనైనది చేస్త...
ముందుకు రావాలె...
ధర్మాచరణ అనేదాన్ల ఓ ముఖ్యమైన స్టెప్పు ఓ విషయాన్ని దూరం చేసుకోగలగడం..
ఏమేం దూరం చేసుకునేందుకు సిద్ధంగ ఉన్నరు???
నెల నెల ఒ ఐదొందలు ఓ ఊరి గుడిలో దీపం నూనెకి దూరం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నరా???
సంవత్సరానికి కనీసం ఐదు సార్లన్న తిరుపతికి పోతము అనే గర్వపడే స్థితిని దూరం చేసుకునేందుకు సిద్ధంగ ఉన్నరా??
మీ మీ స్థితిని బట్టి ఏ ధర్మాచరణ సులభమో, దానికీ అడ్డమొస్తున్న మీకున్న టెంప్టేషన్లను దూరం చేసుకునేటందుకు సిద్ధంగ ఉన్నరా??
వజ్రం वज्र retweeted
నవల: దేవతల యుద్ధము
రచనా కాలం: 1947
అరెరే! యీదేశాన్ని ఏదో ఒక చిత్రమైన ఆర్థిక వ్యూహం చుట్టుకుంది.
పూర్వసంప్రదాయం అంటే, పూర్వాచారాలంటే, పూర్వ సంస్థలంటే, పూర్వ దేవతలంటే ఒక లెక్క లేనితనం. అవన్నీ దోషభూయిష్టాలనటం, పూర్వపు సంఘవ్యవస్థ అంటే ఒక నిరాదరణ, ఒక తిరస్కారం, ఒక నింద, ఒక విప్లవం. ఆ సంఘ వ్యవస్థలో ఉన్న భిన్నైక దేశాలను ముక్కలు ముక్కలుగా చేయుట.
ఈ సృష్టిలో నీవెంత క్రొత్తదైనా తీసుకురా మంచి ఉంటుంది; చెడ్డా ఉంటుంది. గుణాలు ఉంటవి, దోషాలు ఉంటవి, ఈ దోషాలు ఆదర్శాలలో ఉండవు. అసలు మూల సూత్రాలలో ఉంటవి. ఆ మూలసూత్రాలు చాలా ఆలోచించి లోక కళ్యాణం కొరకు చేసినవే.
కాని అవి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆ ఆచరణ కొన్ని వందల యేండ్లు సాగేటప్పటికి మనుష్య స్వభావంలో వున్న దోషాలు ఆ సూత్రాలను ఆ ఆదర్శాలను ఆవరించినట్లు కనిపిస్తుంది.
సర్వ దోషము మానవ ప్రకృతిలో ఉంది.
వజ్రం वज्र retweeted
బాలభారతి - శృంగేరి @AhammBrahmaasmi వారు చేస్తున్న మహత్కార్యముకై నాకు చేతనైనది 🙏🙏
youtube.com/shorts/mksBo2H8L…























