Collector Kakinada (@CollectorKakin1) profile picture

Collector & District Magistrate Kakinada

Joined July 2022
Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)Photo by Collector Kakinada (@CollectorKakin1)
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్మారక స్థూపం వద్ద జిల్లా కలెక్టర్ శ్రీ M.S. హరేంధిర ప్రసాద్, IAS., జిల్లా SP శ్రీ G. #BinduMadhavIPS, అధికారులు అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. @APPOLICE100 #PoliceCommemorationDay
1
3
145
పీఠికాపురాభివృద్ధిరస్తు •రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన శ్రీ @PawanKalyan గారు •బహిరంగ సభ వేదిక నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభా వేదికపై రూ.1,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదే సందర్భంగా మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు. పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.200 కోట్ల విలువైన అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు, రోడ్ల అభివృద్ధి, అత్యాధునిక బస్టాండ్, ఫిష్ మార్కెట్, రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ తదితర అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రకటించారు. •విద్యార్థులను ప్రోత్సహిస్తూ… సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. కాకినాడ జిల్లాలో గుర్రపుడెక్కతో తయారు చేసిన అలంకరణ వస్తువుల స్టాల్‌ను పరిశీలించి, వాటి తయారీ విధానం, ఉపాధి అవకాశాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పలకరించి అభినందించారు. వేదికపై 32 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. విద్యార్థులు విద్యలో మరింతగా రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. •మత్స్యకారుల భద్రతకు ప్రాధాన్యం పిఠాపురం నియోజక వర్గంలోని మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన లైఫ్ జాకెట్లు, సీ సేఫ్టీ కిట్లను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఉప్పాడ-కొత్తపల్లి మండలానికి చెందిన 1,258 మంది మత్స్యకారులకు ఈ సేఫ్టీ కిట్లను అందజేశారు. అలాగే లైవ్ ఫిష్, డ్రై ఫిష్ రవాణాకు వినియోగించే ప్రత్యేక బాక్సులతో కూడిన వాహనాలను పరిశీలించారు. సభా వేదికపై 76 మంది మత్స్యకారులకు డ్రై ఫిష్ యూనిట్లు, 30 మందికి కెనటిక్ హోండాలను, ముగ్గురుకి ఆటోలు అందజేశారు. •స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా అండగా నిలిచేలా రూ.120 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కులను అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు నివాస గృహాల క్రమబద్ధీకరణ పట్టాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేశారు. •అంధ విద్యార్థిని ఆశ నెరవేర్చిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం పర్యటన విషయం తెలుసుకున్న స్వాతి అనే అంధ విద్యార్థిని ఆయనను కలిసి, ఒక పాట పాడాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఆమె కోరికను తెలుసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వాతిని ప్రత్యేకంగా సభా వేదిక వద్దకు పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. స్వాతి వేమన శతకంలోని పద్యాన్ని ఆలపించగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆసక్తిగా విని, ఆమెను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, మాజీ శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, కౌడా ఛైర్మన్ శ్రీ తలాటం సత్య తదితరులు పాల్గొన్నారు. #Pithapuram #AndhraPradesh
16
253
4
1,074
14,909
పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం •దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం •ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి •రూ.200 కోట్లతో రహదారులు.. రూ.470 కోట్లతో తాగునీటి పనులు •రూ.225 కోట్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ.. రూ.323 కోట్లతో ఉప్పాడకు రక్షణ గోడ •రూ.86 కోట్లతో ఆసుపత్రులు, ఆరోగ్య వసతుల అభివృద్ధి •పిఠాపురంలో రూ. 1,500 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సభలో శ్రీ @PawanKalyan గారు ‘మన కూటమి ప్రభుత్వం మరింత బలంగా, సమర్థవంతంగా ముందుకు సాగాలన్నదే నా కోరిక. నాకు కృతజ్ఞత చాలా ఎక్కువ. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా నిలబడటం నా స్వభావం, నా గుణం. ఈ విలువలను ఈ నేల నేర్పింది. ప్రజల అభివృద్ధే మన ప్రధాన లక్ష్యం. ప్రజల అవసరాలను ముందుగా గుర్తించి, వాటిని తీర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దాం. వారి ఆశలు, ఆకాంక్షలకు తరువాత ముందుకు తీసుకెళ్దాం. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నా క్యాంపు ఆఫీసును పిఠాపురంలో పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా సంకల్పం. ఆ లక్ష్యంతోనే ఇప్పటికే వివిధ రంగాల్లో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. తాజాగా మరో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని కేవలం ఒక నియోజకవర్గంగా కాకుండా, అభివృద్ధికి నమూనాగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు రాష్ట్ర అభివృద్ధి కే కాకుండా దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచిందని చెప్పారు. మంగళవారం పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “పిఠాపురం నియోజక వర్గంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధిని కళ్లముందు చూస్తున్నాం. వివిధ రంగాల్లో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్లాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా, పిఠాపురం భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ ముందుకు సాగుతున్నాం. •600కు పైగా సీసీ, బీటీ రోడ్లు పూర్తి చేశాం అధికారం చేపట్టిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికే రూ.200 కోట్లకు పైగా నిధులు వెచ్చించి, ఇప్పటికే 600 కు పైగా సీసీ రోడ్స్, బీటీ రోడ్స్ నిర్మాణం పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ రోజు మరో 202 రహదారులను ప్రారంభించాం. ఉప్పాడ కొత్తపల్లి మండలంలో దాదాపు రూ.10 కోట్లతో నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ఆధునీకరించి, 97 వేల మందికి తాగునీటి భరోసా కల్పించాం. గ్రామాల్లో జల్ జీవన్ మిషన్, అమరజీవి జలధార నిధులతో దాదాపు రూ.320 కోట్లతో, పట్టణాల్లో అమృత్ 2.0, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ సహకారంతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో దాదాపు రూ.140 కోట్లతో తాగునీటి పనులు చేపడుతున్నాం. - ఆరోగ్య వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం పిఠాపురంతోపాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా రూ.34 కోట్లతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నాం, ఇప్పటికే పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. యు.కొత్తపల్లి, చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుర్వేద డిస్పెన్సరీ ఏర్పాటు చేశాం. రూ.7 కోట్లతో 26 కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నాం. గత ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఆరు గ్రామ ఆరోగ్య కేంద్రాలను పిఠాపురం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (పాడా) నిధులతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రూ.45 కోట్లతో కాకినాడ జీజీహెచ్ లో ఆంకాలజీ బ్లాక్ , అధునాతన లీనియర్ యాక్సిలరేటర్ పరికరం, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. •రూ. 225 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పిఠాపురం ఆధ్యాత్మిక వైభవాన్ని పెంచేందుకు రూ.34 కోట్లతో ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాం. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ సహకారంతో 48 భజన మందిరాలు నిర్మిస్తున్నాం. రూ.2 కోట్లతో శ్రీ కుంతీమాధవస్వామి ఆలయ కోనేరు పునరుద్ధరిస్తున్నాం. పక్కనే ఉన్న రథాలపేటలో మారెమ్మ గుడిని పునర్నిర్మించి, ఖాళీ ప్రదేశాన్ని సుందరవనంగా అభివృద్ధి చేస్తున్నాం. గత పర్యటనలో పిఠాపురం పట్టణంలో మురుగు, చెత్త సమస్యను చూశాను. రూ.225 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోజుకు 72 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 40 టన్నుల తడి చెత్త శుద్ధి ప్లాంట్ ను, 5 చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొగలి సూర్యుడి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించాం. కాలుష్య నియంత్రణ మండలి నిధులతో బేలింగ్ మెషిన్ కాంపాక్టర్ అందుబాటులోకి తెచ్చాం. •రూ.323 కోట్లతో ఉప్పాడ తీరానికి రక్షణ కవచం గతంలో పిఠాపురంలోకి అడుగుపెట్టగానే కనిపించిన డంపింగ్ యార్డ్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపాం. పాదగయ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఆ ప్రాంతంలో రూ.1.83 కోట్లతో సుందరమైన నగరవనాన్ని అభివృద్ధి చేశాం. అలాగే రూ.6 కోట్లతో 11 గ్రామీణ చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలను ఎన్నాళ్లుగానో వేధిస్తున్న సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తున్నాం. రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించాం. దీనికి సంబంధించిన డిజైన్, సర్వేను ఐఐటీ మద్రాస్ పూర్తి చేసింది, ఇక నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నాం. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో పలుదఫాలుగా మాట్లాడి అసాధ్యం అనుకున్న ఈ పనిని సుసాధ్యం చేయగలిగాం. ఈ ప్రయత్నానికి జనసేన పార్టీ చేసిన త్యాగాలు, సంపాదించుకున్న విశ్వసనీయత, గుడ్‌విల్ కూడా కీలకంగా నిలిచాయి. పిఠాపురం ప్రజలు అందించిన ఘన విజయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బలాన్ని అందించడమే కాకుండా, ఉప్పాడ తీర ప్రాంత ప్రజల చిరకాల సమస్య అయిన రక్షణ గోడ నిర్మాణానికి కూడా మార్గం సుగమం చేసింది •రూ. 118 కోట్లతో ఆర్ఓబీకి ఆమోదం మన పిఠాపురం నడిబొడ్డున పీఎం గతి శక్తి పథకం కింద రూ.118 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించేందుకు ఆమోదం లభించింది. అలాగే దాదాపు రూ. 100 కోట్లతో ఆయుష్ మెడికల్ కాలేజ్, సాస్కి నిధులతో రూ.100 కోట్లతో రోడ్ల అభివృద్ధి, అమృత్ భారత్ పథకం కింద రూ.37 కోట్లతో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. అలాగే పాడా నిధులతో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ద్వారా రూ.20 కోట్లతో ఆధునిక బస్సు స్టాండ్, రూ.3 కోట్లతో 4 స్మార్ట్ కిచెన్లు, చేపల మార్కెట్, సిసి డ్రైన్లు, పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, పంచాయతీ భవనాలు, ఉప్పాడ చేనేత కమ్యూనిటీ హాళ్లు , అంగన్‌వాడీ కేంద్రాలు వంటి పనులను కూడా త్వరగా పూర్తి చేస్తున్నాం. •రూ.4 కోట్లతో ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ కళాశాల అభివృద్ధి ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థుల కోరిక మేరకు, ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి, సుమారు రూ. 4 కోట్లతో కొత్త భవనాలు, కాంపౌండ్ వాల్స్, అదనపు తరగతి గదులు, ప్లే గ్రౌండ్ లెవెలింగ్ పనులు చేపట్టబోతున్నాం. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి, గౌరవ రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి, గౌరవ గ్రామీణాభివృద్ధి మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా గారికి, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిఠాపురం అభివృద్ధి ప్రతి అడుగులో కనిపించాలి, ప్రతి కుటుంబం ముందుకు సాగాలి, మన పిల్లల భవిష్యత్తుకు పిఠాపురం ఒక బలమైన పునాదిగా నిలవాలి. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తూ, పిఠాపురాన్ని మరింత గొప్పగా, మరింత అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దే వరకు నా ప్రయాణం ఆగదు” అన్నారు. (1/8)
20
371
2
1,603
16,795
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిరప్రసాద్, కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం శాసన సభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, రాజానగరం శాసన సభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి, మాజీ శాసన సభ్యులు శ్రీ పెండెం దొరబాబు, బీజేపీ నాయకులు శ్రీ కృష్ణంరాజు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. డైరెక్టర్ శ్రీ షణ్ముఖ్, పడా పీడీ శ్రీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (2/4)
4
185
529
4,154
ఆహ్లాదం.. ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ చెరువులు •ఫకృద్ధీన్ పాలెంలో సుందరీకరించిన మైసమ్మ చెరువును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు •ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో మారుతున్న గ్రామీణ ప్రాంత చెరువుల రూపురేఖలు •పిఠాపురం నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ •ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువును మోడల్‌గా తీర్చిదిద్దిన శ్రీ @PawanKalyan గారు •చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్, పిల్లల పార్క్, జెండా స్థూపం, గ్రీనింగ్ ఏర్పాటు •రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం మైసమ్మ చెరువును సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన గ్యాలరీని సందర్శించారు. అనంతరం చెరువు గట్టు వెంబడి వాకింగ్ చేస్తూ, అక్కడ ఉన్న భారీ వృక్షాల వయసు, కొన్ని వృక్షాల శాస్త్రీయ నామం తదితర అంశాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని తెలిపారు. • చిన్నారులతో కలసి చిల్డ్రన్ పార్కు ప్రారంభోత్సవం మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు పరిసరాలను పచ్చటి మొక్కలతో అభివృద్ధి చేసి, గట్టును బలోపేతం చేశారు. అనంతరం గట్టుపై వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా వ్యాయామం చేసుకునేలా ఓపెన్ ఎయిర్ జిమ్‌ను, జాతీయ భావన పెంపొందించేలా జెండా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. చెరువు కుడి వైపున పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్కును చిన్నారులతో కలసి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. చిల్డ్రన్స్ పార్కులో ఆడుకుంటున్న చిన్నారులకు తినుబండారాలు, చాక్లెట్లు అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు మోడల్ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (PMKSY) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. •మైసమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు అంతకుముందు ఎఫ్.కె. పాలెం మైసమ్మ చెరువు ప్రారంభోత్సవానికి ముందు గట్టుపై ఉన్న ఆలయంలో శ్రీ మైసమ్మ అమ్మవారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు మధ్య భాగానికి వచ్చే విధంగా నూతనంగా నిర్మిస్తున్న నందీశ్వరుడి సహిత శివుని విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఫకృద్ధీన్ పాలెంలోని వినాయకుడి గుడిని సందర్శించారు. • గ్రామస్తులతో మమేకం అవుతూ... గ్రామంలో సౌకర్యాల పరిశీలన చెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆప్యాయంగా పలుకరించారు. ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం విడివిడిగా ఏర్పాటు చేసిన కుండీలు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులను పలుకరించి ఫొటోలు దిగారు. (1/4)
17
485
2
2,153
24,039
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు * ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం * రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్ * నవంబర్ నుంచి పనులకు శ్రీకారం * ⁠రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు. • నవంబర్ నుంచి పనులు ప్రారంభం ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. @iitmadras
58
1,355
70
4,687
264,849
ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో 19వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల •పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల రైతులకు ఊరట •పురుషోత్తపట్నం నుంచి ఏలేరు జలాశయానికి నీటి మళ్లింపునకు చర్యలు •ఎల్ నినో, వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగు నీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడిన శ్రీ @PawanKalyan గారు రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి ఏలేరు కాలువ కింద ఉన్న ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసేందుకు జల వనరుల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ నిర్ణయం పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని రైతులకు ఊరట కలిగించనుంది. మే 26వ తేదీన నిర్వహించిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు(IAB) సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీన గోదావరి నది నుంచి, జులై 10వ తేదీన ఏలేరు కాలువకు నీటి విడుదల చేపట్టాల్సి ఉండగా, ఎల్ నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏలేరు జలాశయానికి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహం నమోదు కాలేదు. జలాశయంలో కేవలం 8.68 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఏలేరు కాలువకు నీరు విడుదల కాకపోవడంతో పిఠాపురం నియోజకవర్గం, పరిసరాల రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. ఏలేరు కాలువ కింద ఉన్న దాదాపు 53 వేల ఎకరాల ఆయకట్టులో ఇప్పటికీ నారు మడుల పనులు కూడా ప్రారంభించలేదు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకురాగా, సాగునీటి ప్రణాళికలపై కాకినాడ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ పట్ల రైతుల్లో ఆందోళన, సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించాలని సూచించారు. గోదావరిలో వరద నిర్దుష్ట మట్టానికి చేరుకున్న వెంటనే నీటిని ఎత్తిపోసేందుకు అవసరం అయిన సాంకేతిక చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ అవసరాలకు తగిన విధంగా నీటి నిర్వహణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రివర్యులు చెప్పారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ జల వనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ తో మాట్లాడారు. సానుకూలంగా స్పందించిన ఆ అధికారులు ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు 19వ తేదీ నుంచి ఏలేరు కాలువకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టం చేశారు. @AndhraPradeshCM @CollectorKakin1 @PIB_India @IPR_AP @pibvijayawada
5
260
1,063
40,289
(4/4)
34
81
1,815
(3/4)
1
51
186
2,378
మాది రౌడీలు, గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు •అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం •నాయకులకి ఫ్లెక్సీల ఏర్పాటు మీద కంటే పని మీద శ్రద్ధ ఉండాలి •విద్యార్ధుల ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చే వేధిక అవసరం •కాకినాడలో మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు ‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు. వయసు చిన్నది పోనీలే పాపం అనుకోవడానికి వీల్లేదు. యువత బాధ్యతగా వ్యవహరించాలి. మీరు బలంగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం శాంతిభద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు. కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన శ్రీ గంజాల అరవింద్ బాబు అనే వ్యక్తి కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బందిపెడుతున్న ఆకతాయిల వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై స్పందించారు. కనస్ట్రక్షన్ కంపెనీ చేతిలో మోసపోయిన శ్రీమతి భవానీ అనే మహిళ, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై శ్రీ మహ్మద్ అన్సర్ అనే వ్యక్తి, కళాశాలల్లో గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై శ్రీనివాస్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి, కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను శ్రీ ఎం. హరీష్ బాబు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని శ్రీ యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు, వాహనాలతో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారుతోంది. దీనివల్ల అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్ లు సైతం గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఈ కూడలిలో శాశ్వతంగా ఒక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు. కాకినాడ కార్పోరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లు,ప్రత్యేక క్లినిక్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జాహ్నవి అనే ట్రాన్స్ జెండర్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో 45 సెంట్ల భూమిని కోల్పోయానిని కిర్లంపూడి మండలానికి చెందిన శ్రీ కాకిలేటి వీర్రాజు అనే వ్యక్తి తమ సమస్యలను శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు చదువు పూర్తయ్యాక రాష్ట్రంలోనే ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పలువురు విద్యార్ధులు విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టేందుకు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నారు. ఆ శ్రద్ధ ఏదో పనిలో చూపిస్తే బాగుంటుంది. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధం కావడం లేదు. ఫ్లెక్సీల ఏర్పాటుపై వ్యవస్థల నియంత్రణ ఉండాలి. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పాలి. పాఠశాలల్లో ఆర్టీఈ యాక్ట్ అమలులో ఉన్న లోపాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. విద్యా సంస్థలతో ఏమైనా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదుల రూపంలో అందజేయండి. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చే విధంగా పార్లమెంటు సభ్యులంతా కలసి ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాల’ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాకినాడ కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరీంధ్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ గారు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. (1/4)
7
184
656
5,763
(3/3) •అలా సమర్థించేవాళ్ళతో ప్రమాదం పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు, పాపం పసి వయసులో బీరు బాటిల్ తీసుకుని గొంతు కోసేశాడు, తెలిసి తెలియని పసి వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. అలా సమర్థించేవారితో ప్రమాదం. ఇదే పెద్ద మనిషి నిర్భయ కేసులో తెలంగాణ పోలీసుల చర్యను సమర్థించాడు. ఇక్కడకు వచ్చేసరికి కులం అంటూ మాట్లాడుతున్నాడు. హోమ్ శాఖ మంత్రి గారిని సైతం అతని పార్టీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె మేకప్ గురించి మాట్లాడుతున్నారు. ఇది అక్కడితో ఆగదు. ఇంటిలో మన ఆడబిడ్డలు ఫేస్ పౌడర్ కూడా రాసుకోకూడదా? రేపు ఏదో కాలేజీలో కుర్రాళ్ళు ఆడబిడ్డలను గురించి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే... అప్పుడు పరిస్థితి ఏమిటి? నేను బాధ్యతలు తీసుకున్నాక కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి ఎవరు కలెక్టర్ గా ఉండాలి అనే ఆలోచన చెయ్యలేదు. ఒక్కటే సూచన ఇచ్చాను ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థ బలంగా ఉండాలి. ఇది తప్పా నా దగ్గర నుండి మీకు ఎలాంటి ఫోన్లు రావు. నా పార్టీ వారు అయినా నేను ప్రోత్సహించను. ఎందుకంటే నేను వ్యవస్థలను బలపరచడానికి ఉన్నాను, బలహీనపరచడానికి కాదు” అన్నారు.
2
94
311
4,303
(2/3) •వితంతువుల ఇళ్ల పట్టాలను వదల్లేదు కాకినాడ చిన్నస్వామి నగర్‌లో 63 మంది నిరుపేదలకు గతంలో ప్రభుత్వం ఇళ్లపట్టాలను మంజూరు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాకా బాధితుల్లో ఉన్న వితంతువులు, దివ్యాంగులు, క్యాన్సర్ బాధితుల పట్టాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు బలవంతంగా లాక్కున్నారు. ఆ పట్టాలను అక్రమంగా వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్పిడి చేశారు. దీనితో పాటు, ఇదే ప్రాంతంలోని ఒక మార్వాడి కుటుంబానికి చెందిన విలువైన ఆస్తులను కూడా సదరు నేత అనుచరులు ఆక్రమించుకున్నారు. వైసీపీ నాయకుల వేధింపులు, ఒత్తిళ్లను తట్టుకోలేక సదరు మార్వాడి కుటుంబం కాకినాడ నగరాన్ని వదిలి వేరే ప్రాంతానికి వలస వెళ్లిపోయింది. •ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిపై బెదిరింపులకు పాల్పడితే కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇళ్లల్లోకి వస్తామని, ఆడబిడ్డలను వేధిస్తామని బెదిరించే వారిని వదిలిపెట్టేది లేదు. గతంలో కోనసీమ జిల్లాకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడంపై వ్యతిరేకత తెలిపేందుకు వెళ్లిన వారిని కొందరిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇళ్లలోకి వచ్చి దాడులు చేస్తామని హెచ్చరించినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అప్పట్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. క్రిమినల్స్ కు నేను ఒకటే చెబుతున్నాను. ఎలాంటి తప్పులు చేసినా మమ్మల్ని రక్షించే వారు ఉన్నారు అనే ఆలోచన ఉంటే మరిచిపోవడం మంచిది. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. తప్పు చేసిన వారికి మళ్లీ ఆ తప్పు చేయాలనే ఆలోచన కూడా రాకుండా చేస్తాం. స్వార్థ రాజకీయాల కోసం రౌడీయిజానికి, నేరగాళ్లకు మద్దతు ఇస్తే దేశం బాగుపడదు. •కులానికి పరిమితం చేయకండి నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దామంటే నా దురదృష్టం నన్ను తిరిగి కుల చట్రంలోకి తీసుకువస్తారు. దేశాన్ని ప్రేమించే వాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. వ్యవస్థలు బాగుండాలని కోరుకునే నన్ను కుల చట్రంలోకి పట్టుకువస్తారు. అయితే నన్ను బంధించలేరన్న విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాలి. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా మీ గళం బలంగా వినిపించండి. •కులాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకొంటే ఉపేక్షించను లా అండ్ ఆర్డర్ వ్యవహారంలో కులాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే నేను ఉపేక్షించను. దయచేసి నన్ను కులానికి పరిమితం చేయకండి. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ప్రజలు బాగుండాలని కోరుకుంటే నన్ను కులానికి కట్టేస్తున్నారు. ఎవడో క్రిమినల్ తప్పు చేస్తే నేను బాధ్యత తీసుకోవాలా? 14 ఏళ్ల ఆడబిడ్డపై అత్యాచారం చేస్తే నేను వెనకేసుకురావాలా? అది పోలీస్ కేసు. సీఐ మీద కేసులు వెళ్తాయి. చంపిన వ్యక్తులు కూడా అదే కులం. నేరాలు చేసేవారిని కుల కోణం నుండి చూడకండి, కుల పరంగా సమర్థించకండి. ఎమ్మెల్సీ అనంతబాబు కాపు కలస్తుడంట, అతను దళిత కులానికి చెందిన డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఎవరికీ కులాలు గుర్తుకు రావు. ఒక క్రిమినల్ చనిపోతే దానికి నన్ను లాగుతారు. మనకి 164 సీట్లు వచ్చాయంటే యువత రోడ్ల మీదకి వస్తేనే వచ్చాయి. ప్రతిదానికీ కులం ఓట్లు పోతాయంటే ఎలా? ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేస్తే అది కాపులందరికీ చెడ్డపేరా? కులం దరిద్రం వదిలితే తప్పు ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. యువత భవిష్యత్తు అడుగుతుంటే, నాయకులు అవన్నీ ఆలోచించడం లేదు. ఆ కులం ఓట్లు, ఈ కులం ఓట్లు పోతాయని ఆలోచిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ని కాపాడితే కులం ఓట్లు పోతాయా? ప్రతి అడుగులో భయపడతా ఉంటే ఎవరు పని చేస్తారు. నేరం జరిగినప్పుడు బాధితులకి హక్కులు ఉండవా? మానభంగం చేసిన వాడికే హక్కులు ఉంటాయా? రోడ్డు మీద వెళ్లే ఆడబిడ్డని చెయ్యి పట్టుకుని లాగితే చెంప మీద కొట్టాలి. అప్పుడే క్రిమినల్స్ భయపడతారు.
2
106
1
359
5,585
నేరస్థుడికి కులం, మతం ఉండవు •రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కులాల దరిద్రం పోవాలి •క్రిమినల్స్ చేతికి అధికారం వస్తే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుంది •శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు •నేరం చేసినవాళ్ళను కుల కోణంలో చూడొద్దు •తప్పు చేస్తే మిమ్మల్ని ఏ పార్టీ రక్షించలేదు •కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ‘సమాజంలో నేరస్థులను కేవలం క్రిమినల్స్‌ గా మాత్రమే చూడాలని, వారికి కులాల చాటున చూడకూడదు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే ఆంధ్రప్రదేశ్ కు కులాల దరిద్రం వదిలిపోవాలన్నారు. తప్పు చేసిన వాడికి, నేరాలకు పాల్పడేవారికి ఎలాంటి కులం, మతం ఉండవని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అటువంటి నీచమైన శక్తులను ఏ ఒక్కరూ సమర్థించకూడదని చెప్పారు. క్రిమినల్ గ్యాంగ్‌ల సహాయంతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. క్రిమినల్స్ అధికారంలోకి వస్తే ప్రజల భవిష్యత్తు మంటగలుస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోదని, శాంతికి విఘాతం కలిగిస్తూ, తప్పులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కులాలు, మతాల పరంగా వాట్సాప్ గ్రూపులు ఉన్నట్లే... లా అండ్ ఆర్డర్ కోసం, స్థానిక సమస్య కోసం వాట్సాప్ గ్రూపులు ఉండాలని, ఆ దిశగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. శనివారం రాత్రి కాకినాడలో మన ఊరు – మాట మంతి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ... “నేరపూరిత నేపథ్యం ఉన్న వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులను అధిష్టించి, ప్రజల జీవితాలను శాసించాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. అటువంటి శక్తులపై నిరంతరం తిరగబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటాను. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజల కోసం నిరంతరం పోరాడతాను. •అంబేద్కర్ గారిపై గౌరవం ఉంటే తప్పుడు కేసులు పెట్టరు నిజమైన ఎస్సీ, ఎస్టీ కేసులను ఎంత బలంగా సమర్థిస్తామో, తప్పుడు కేసులను కూడా అంతే బలంగా అడ్డుకోవాలి. తప్పుడు కేసుల వల్ల అసలైన బాధితులకు అన్యాయం జరగకూడదు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారిపై నిజమైన గౌరవం ఉన్నవారెవరూ తప్పుడు కేసులు పెట్టరు. కూటమిలో ఉన్న నాయకులు ఇలాంటి తప్పుడు కేసులను ప్రోత్సహించవద్దు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం దుర్వినియోగంపై కీలక తీర్పులను ఇచ్చింది. చట్టం దుర్వినియోగం కాకుండా, అమాయకులు తప్పుడు కేసులతో నలిగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే న్యాయస్థానం ఈ నిబంధనలను చేర్చింది. •సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా చెరిపేశారు 2017లో సుగాలీ ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ దాదాపు లక్షన్నర మందితో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. ఈ ఒత్తిడితోనే కేసును సీబీఐ విచారణకు అప్పగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. 2019-2024 మధ్య అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం సీబీఐ విచారణ కోరుతూ కేవలం తూతూ మంత్రంగా లేఖ రాసి వదిలేసింది. తాము అధికారంలోకి రాగానే మొదటి కేసుగా దీనిపైనే దృష్టి పెట్టాలని భావించాం. అయితే గత ప్రభుత్వం ఈ కేసులోని కీలక సాక్ష్యాధారాలన్నింటినీ పూర్తిగా తుడిచిపెట్టేసింది. కోర్టులు ఎప్పుడూ సాక్ష్యాధారాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. ఈ కేసులో అత్యంత కీలకమైన డీఎన్ఏ నమూనాలను కూడా మాయం చేసి నిందితులను రక్షించే ప్రయత్నం చేశారు. అలాగే మాజీ మంత్రి శ్రీ వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన సొంత నివాసంలోనే అతి దారుణంగా నరికి చంపారు. ఈ హత్య ఎవరు చేశారనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, కోర్టులో నిరూపించడానికి కచ్చితమైన సాక్ష్యాధారాలు ఉండాలి. చట్టం ముందు సాక్ష్యాలు లేకపోతే ఏమీ చేయలేము. ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుంది. ఇందులో ఎక్కడా కుల ప్రస్థావన లేదు. క్రిమినల్స్ ను చూసేటప్పుడు కుల కోణాన్ని జోడించడం ఏ మాత్రం సరికాదు. క్రిమినల్స్ ను లేదా బాధితులను వారి కులాన్ని బట్టి కాకుండా, జరిగిన నేరాన్ని బట్టి మాత్రమే చూడాలి. (1/3)
27
342
4
1,187
13,419
(2/2) * రూ.9.05 కోట్లతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఉప్పాడ మత్స్యకారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం ప్రముఖ ఫార్మా సంస్థలు రూ.9.05 కోట్లకు పైగా భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఈ నిధులతో యు.కొత్తపల్లి మండలంలోని మత్స్యకార కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు కొత్త ఆదాయ మార్గాలు చూపనున్నారు. దివీస్ ల్యాబొరేటరీస్ రూ.4.50 కోట్లు, అరబిందో ఫార్మా కంపెనీలు రూ. 4.55 కోట్లు అందించాయి. ఈ నిధులతో సముద్రపు నాచు సాగు, సీవీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, సముద్రంలో కృత్రిమ రీఫ్‌లు, చేప పిల్లల నర్సరీలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల దాదాపు 500 మందికి ప్రత్యక్షంగా, మరో 2000 మందికి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. మాటా మంతి సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయా సంస్థల ప్రతినిధులు తమ సహాయాన్ని అందజేశారు. * రూ. 2 కోట్లతో 50 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి డియాజియో గ్రూప్ — టార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యు.కొత్తపల్లి మండలంలోని 50 అంగన్‌వాడీ కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం సుమారు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తో సంస్థ ప్రతినిధులు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండేళ్లపాటు సాగే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలను అందించనున్నారు. దీనికంటే ముందే నియోజకవర్గంలోని మరో 110 అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ తో అపోలో సంస్థ ఎంఓయూ చేసుకుంది. దీని ద్వారా నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ లింగమనేని రమేష్ గారు, శ్రీ సానా సతీష్ బాబు గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, కూటమి పార్టీలకు చెందిన ప్రభుత్వ విప్ లు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
3
95
229
2,794
మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి బలమైన అడుగులు •100 రోజుల ప్రణాళికతో ఉప్పాడ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు •అమీనాబాద్ హార్బర్ బాధితులకు చెక్కుల పంపిణీ •రూ. 10 కోట్లకు పైగా నిధులతో సబ్సిడీ యంత్రపరికరాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల సృష్టికి చర్యలు •సీఎస్ఆర్ నిధులతో అంగన్ వాడీల బలోపేతం •కాకినాడలో మన ఊరు మాట-మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు కాకినాడ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి బాటలు వేసే దిశగా బలమైన అడుగులు వేశారు. ఇచ్చిన మాట మేరకు అలల తీవ్రత కారణంగా జరిగిన నష్టానికి పరిహారం అందించారు. రూ. 10 కోట్లకు పైగా నిధులు వెచ్చించి సబ్సిడీలో యంత్రపరికరాలు, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల సృష్టికి చర్యలు చేపట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ఇచ్చిన మాట మేరకు 100 రోజుల ప్రణాళిక కార్యరూపం దాల్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై శిక్షణ ఇప్పించిన ఉప ముఖ్యమంత్రివర్యులు, శనివారం రాత్రి కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటా - మంతి కార్యక్రమంలో మొదటి అడుగుగా అమీనాబాద్ హార్బర్ డిజైన్ లోపంతో దెబ్బతిన్న సుమారు 29 బోట్లకు పరిహారాన్ని చెక్కుల రూపంలో మత్స్యకారులకి అందించారు. హార్బర్ డిజైన్ లోపాలను సవరించేందుకు మరో రూ. 80 కోట్లు మంజూరుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఒకేసారి పరిహారం, సంక్షేమం అందడం, కోత నివారణ చర్యలకు ఉపక్రమించడం పట్ల ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. * రూ.80 కోట్లతో అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్ పనులు డిజైన్ లోపాల కారణంగా అమీనాబాద్ ఫిషింగ్ హార్బర్‌లో అలల తాకిడికి 16 పడవలు పూర్తిగా, 13 పడవలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బాధితులకు తక్షణ ఉపశమనం కలిగిస్తూ మొత్తం 29 పడవలకు గానూ రూ.75,52,800 ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో అలాగే హార్బర్ డిజైన్ లోపాలను శాశ్వతంగా సరిచేసేందుకు అదనంగా మరో రూ.80 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో హార్బర్‌ను పూర్తిగా పునర్నిర్మించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మత్స్యకారులకు రక్షణ కల్పించనున్నారు. * అధునాతన బోటు ఇంజన్లు పంపిణీ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద యు.కొత్తపల్లి మండలానికి చెందిన వంద మంది మత్స్యకారులకు అధునాతన బోటు ఇంజన్లను పంపిణీ చేశారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే ధ్యేయంగా రూ.1.42 కోట్ల విలువైన 10 హెచ్.పి. 20 హెచ్.పి. ఇంజన్లను అందించారు. మత్స్యకారులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ ఇంజన్లను సమకూర్చారు. ఒక్కో ఇంజన్ ధరపై 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిర్ణయించారు. లబ్ధిదారులు చెల్లించాల్సిన మిగిలిన 50 శాతం నిధులను పిఠాపురం నియోజకవర్గం నిధుల నుండి చెల్లించాలని అధికారులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
9
262
1
950
8,087
తొలి విడత 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' నిధులు విడుదల •కాకినాడ జిల్లా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా 2.73 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, రూ. 99.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. శనివారం మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో ప్రాధాన్యతాంశంగా 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్'ను తీసుకున్నారు. రైతులతో కలసి ఈ మొత్తం నిధులు విడుదల చేశారు. తొలి విడత ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు అందజేస్తుంది. అన్నదాత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు అందజేస్తుండగా, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో రూ. 14,000 కలిపి ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది అన్నదాతకు అండగా నిలవడం రైతు సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న సంకల్పానికి నిదర్శనమని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రైతులతో కలసి నిధులు విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ లింగమనేని రమేష్ గారు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
1
258
1
1,071
7,372
Collector Kakinada retweeted
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్థానిక కల్లుగీత కార్మికుడు సింహాచలం నివాసాన్ని సందర్శించారు. సింహాచలం కుటుంబంతో ముచ్చటించి రూ. 4,000 పింఛను సొమ్మును అందజేశారు. సింహాచలం బంధువు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. కల్లు గీత విధానాన్ని సీఎం పరిశీలించారు. తాటి చెట్టుపై నుంచి ముసలయ్య తెచ్చిన తాజా కల్లును రుచి చూశారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #AndhraPradesh
4
31
1
210
5,466
Collector Kakinada retweeted
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో పేదలో సేవలో కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #AndhraPradesh
2
20
1
143
3,543
Collector Kakinada retweeted
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నేతలు నేడు ఘన స్వాగతం పలికారు. #AndhraPradesh
2
40
442
10,067
Collector Kakinada retweeted
కాకినాడ జిల్లాపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక దృష్టి •రెండు నెలలకి ఒకసారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటన •ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరానికి కృషి •కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు •జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై దిశానిర్దేశం •నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి •జిల్లా పరిధిలో ఏ ఒక్క రోడ్డుపై గుంతలు కనబడరాదు •వర్షాకాలానికి ముందే కాకినాడ జిల్లా పరిధిలో గ్రేట్ గ్రీన్ వాల్ పూర్తి చేయాలి ఇక మీదట కాకినాడ జిల్లా పరిధిలో రెండు నెలలకి ఒకసారి ప్రత్యేకంగా పర్యటిస్తానని, కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతూ నేరుగా వారి సమస్యలు తెలుసుకుంటానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారితో సమావేశం అయ్యారు. కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. •అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కాకినాడ జిల్లాతోపాటు పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. డొంక రోడ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందాలి. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు. జిల్లా పరిధిలో ఉన్న రోడ్లన్నీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించండి. రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిన చోట కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టాలి. చిన్న చిన్న గుంతలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో అందుతున్న సేవలపై పర్యవేక్షణ పెంచాలి. ఆసుపత్రుల్లో వసతుల కల్పనపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గ్రామ స్థాయిలో పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠశాలలు, హాస్టళ్లను సందర్శిస్తూ విద్యార్ధులకు అవసరం అయిన సౌకర్యల కల్పన పైగా ఆలోచన చేయాలి. యువతకు క్రీడలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. నైపుణ్యాన్ని వృద్ధి చేసి వారిలో ఉన్న శక్తిని ద్విగుణీకృతం చేయాలి. గ్రంథాలయాలను బలోపేతం చేయాలి. యువతలోని నైపుణ్యాన్ని, కొత్త ఆవిష్కరణలను వెలికితీసి ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాల”ని కలెక్టర్ కు సూచించారు. •రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. వర్షాకాలం లోపు కాకినాడ జిల్లా పరిధిలో తీర ప్రాంతం వెంబడి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టుని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలు సూచనలు చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రేషన్ మాఫియాని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
29
670
6
3,297
42,422