Kotha Prabhakar Reddy (@KPR_BRS) header
Kotha Prabhakar Reddy (@KPR_BRS) profile picture

MLA From Dubbak Constituency | Former Member Of Parliament Medak | BRS Party Siddipet Dist President

Joined September 2018
Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)Photo by Kotha Prabhakar Reddy (@KPR_BRS)
తెలంగాణ రైతాంగానికి జీవనాధారమైన మల్లన్న సాగర్ భద్రతతో చెలగాటమా? ప్రాజెక్టుకు ముప్పు కలిగించే చర్యలను సహించేది లేదు.. #MallannaSagar #KCR #HarishRao #BRS
7
43
934
Kotha Prabhakar Reddy retweeted
మేడిగడ్డ బ్యారేజీ వద్ద బాంబులు పెట్టి పేల్చినట్టే.. మల్లన్నసాగర్ కట్ట వద్ద కూడా బాంబులు పెట్టి పేల్చి, కూల్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందా? కట్ట పక్కనే అనధికారికంగా బ్లాస్టింగ్ ఎలా చేస్తారు? మల్లన్నసాగర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
2
87
4
206
6,587
Kotha Prabhakar Reddy retweeted
NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. 17 రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘీభావం కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత.. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో గత 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం వైద్య సేవలందిస్తూ, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన NHM ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. డాక్టర్‌ నుంచి అటెండర్‌ వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ వర్గాల ఉద్యోగులను ఆదుకున్నామని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి NHM ఉద్యోగుల కృషి ఎంతో ఉందని, అలాంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. NHMలోని 78 కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి తగిన భరోసా కల్పించాలన్నారు. సంబంధిత నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేడర్‌ ఫిక్సేషన్‌ చేపట్టి పూర్తి వేతనాలు చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల విధానాన్ని పునఃపరిశీలించి ఉద్యోగులను స్టేట్‌ హెల్త్‌ సొసైటీ పరిధిలో కొనసాగించాలని కోరారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు, పెండింగ్‌ లాయల్టీ బోనస్‌ అందించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు బదిలీ చేసే జీఓ 1195ను కూడా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తున్న NHM ఉద్యోగులు నేటికీ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేయాల్సి రావడం విచారకరమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌, హర్యానా, మణిపూర్‌ తదితర రాష్ట్రాల్లో NHM ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను పరిశీలించి, తెలంగాణలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న NHM ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణతో పాటు వేతనాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
4
10
244
Kotha Prabhakar Reddy retweeted
మల్లన్న సాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా ? కట్టపక్కనే అనధికారికంగా ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి బ్లాస్టింగ్ ఎలా చేస్తారు ? మేడిగడ్డను చేసినట్లు ఈ ప్రాజెక్ట్ ను దెబ్బతీయాలని చేస్తున్నారా ? #CongressFailedTelangana
27
238
6
772
27,857
Kotha Prabhakar Reddy retweeted
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు, దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు.
4
5
128
Kotha Prabhakar Reddy retweeted
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ కూల్చాలని కుట్ర చేస్తున్నారా ? కట్టపక్కనే అనధికారికంగా బ్లాస్టింగ్ ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ చేసినట్లు ఈ ప్రాజెక్ట్ ను చేయాలని చేస్తున్నారా? అని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
16
41
711
Kotha Prabhakar Reddy retweeted
ఎన్నికలకు ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడేమో రైతుల సెల్ఫ్ డిక్లరేషన్. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు తెలంగాణలో ఏర్పడింది. జెనరేటర్లు, ట్యాంకర్లతో తెలంగాణ రైతులు పంటలు కాపాడుకుంటున్నారు. క్రాప్ హాలిడే ప్రకటించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం హాలిడే ఇవ్వాలి!
11
195
2
725
27,461
Kotha Prabhakar Reddy retweeted
Live: సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు nitter.cf/i/broadcasts/2ZBYPPgeK…
8
1
30
891
NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. 17 రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘీభావం కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత.. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో గత 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం వైద్య సేవలందిస్తూ, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన NHM ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. డాక్టర్‌ నుంచి అటెండర్‌ వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ వర్గాల ఉద్యోగులను ఆదుకున్నామని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి NHM ఉద్యోగుల కృషి ఎంతో ఉందని, అలాంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. NHMలోని 78 కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి తగిన భరోసా కల్పించాలన్నారు. సంబంధిత నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేడర్‌ ఫిక్సేషన్‌ చేపట్టి పూర్తి వేతనాలు చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల విధానాన్ని పునఃపరిశీలించి ఉద్యోగులను స్టేట్‌ హెల్త్‌ సొసైటీ పరిధిలో కొనసాగించాలని కోరారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు, పెండింగ్‌ లాయల్టీ బోనస్‌ అందించాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు బదిలీ చేసే జీఓ 1195ను కూడా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తున్న NHM ఉద్యోగులు నేటికీ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేయాల్సి రావడం విచారకరమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌, హర్యానా, మణిపూర్‌ తదితర రాష్ట్రాల్లో NHM ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను పరిశీలించి, తెలంగాణలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న NHM ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణతో పాటు వేతనాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
4
10
244
Kotha Prabhakar Reddy retweeted
కన్నెపల్లి పంపులు ఆన్ చేయకుండా.. కరువు తెచ్చిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం! మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ గురించి స్పష్టంగా వివరించిన కేసీఆర్ గారు.
9
182
5
700
17,395
Kotha Prabhakar Reddy retweeted
లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి! కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మూడు గంటల పాటు మార్చురీ ఎదుట బాధిత కుటుంబంతో కలిసి ఆందోళన.. విచారణ జరిపించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని దావులగళ్ల లాస్య అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలను నిష్పక్షపాతంగా వెలికితీసి, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో లాస్య మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, సంతోష్‌లను పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అనంతరం బాధిత కుటుంబంతో కలిసి సుమారు మూడు గంటల పాటు మార్చురీ ఎదుట ఆందోళనలో పాల్గొని, లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటల వరకు బాగానే ఉన్న విద్యార్థిని తెల్లవారుజామున 5 గంటలకల్లా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షేమ గురుకులాలు ఎంతో కీలకమని, అలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, కనీస వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ప్రహరీ గోడలు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ హేమావతి స్పందిస్తూ, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని, లాస్య మృతి ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. #DubbakMLA #JusticeForLasya #Siddipet
5
21
545

When KCR Garu threw an open challenge to the Congress party, NOT A SINGLE LEADER had the guts to step forward !! @KCRBRSPresident
8
48
598
Kotha Prabhakar Reddy retweeted
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుడికందుల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని లాస్య మృతదేహాన్ని ఎమ్మెల్యే @KPR_BRS గారు పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
1
3
3
82
అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే ! భూ సమస్యల పరిష్కారానికి గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి.. మంత్రి పొంగులేటి గారికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి విజ్ఞప్తి ప్రజాపాలన సర్వేలో జరిగిన పొరపాట్ల కారణంగా అర్హులైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని, ఎల్‌-1తో పాటు ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల్లో ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. సంగారెడ్డిలో నిర్వహించిన ప్రజాపాలన–ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు. ప్రజాపాలన సర్వేలో చిన్నచిన్న పొరపాట్ల కారణంగా అనేకమంది అర్హులు ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల్లోకి వెళ్లారని, అటువంటి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాలను వేగవంతం చేసేందుకు అధికారులకు నిర్దిష్ట గడువు విధించాలని కోరారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు పొందిన వారిలో ప్రస్తుతం అర్హులైన వారికి నిబంధనల ప్రకారం కొత్త ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించాలని సూచించారు. అదేవిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న అర్హులకు పట్టా ధ్రువీకరణ పత్రాలు అందించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి గ్రామగ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్, ఉల్లిదిమ్మాయిపల్లి, దుబ్బాక మండలంలోని రఘోత్తంపల్లి, ఆకారం తదితర గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తులపై స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు న్యాయం జరిగేలా ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న అర్హుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, నిబంధనల ప్రకారం పట్టా ధ్రువీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
7
29
976
ముఖ్యమంత్రి ఫోటోకే చోటు లేని సమావేశం.. ఇదేనా కాంగ్రెస్ పాలనలో గౌరవం ?? #CongressfailedTelangana
1
46
1
362
21,239
Kotha Prabhakar Reddy retweeted
శాతగాని రేవంత్! కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి లాంటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే పాలించలేక నాశనం చేస్తుండు!
2
60
1
154
1,824
మంత్రి సమావేశానికి మీడియాకు అనుమతి నిరాకరణ.. పోలీసులతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి వాగ్వాదం! మంత్రి సమావేశానికి మీడియాను అనుమతించబోమని పోలీసులు చెప్పడంతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిలదీశారు. మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారు? ప్రజలకు వాస్తవాలు తెలియకూడదా? అంటూ ప్రశ్నించారు. #CongressfailedTelangana
2
22
169
5,614
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు.. జీవక స్టీల్ ఫ్యాక్టరీ వద్ద స్థానికుల ఆందోళన.. కాలుష్య నివారణ చర్యలు చేపడతామని యాజమాన్యం హామీ చేగుంట మండల కేంద్రం : పరిశ్రమల నిర్వహణలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. చేగుంట మండలంలోని జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు వ్యక్తం చేసిన ఆందోళనకు ఆయన స్పందించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవక స్టీల్ ఫ్యాక్టరీ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురవుతున్నాయని ఆరోపిస్తూ అనంత సాగర్, ఉల్లి తిమ్మాయిపల్లి, కొండాపూర్, గొల్లపల్లి, చేగుంట, బోనాల, పులి మామిడి, పొలంపల్లి, చిన్న శివనూర్, కర్ణాల్ పల్లి, మక్కారాజ్ పేట, కరీంనగర్ తదితర గ్రామాల రైతులు, స్థానిక ప్రజలు ఫ్యాక్టరీ ఎదుట వంటావార్పు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గత రెండు రోజులుగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, ప్రాంత అభివృద్ధికి దోహదపడే మరిన్ని పరిశ్రమల ఏర్పాటును స్వాగతిస్తామని తెలిపారు. అయితే పరిశ్రమల నిర్వహణ వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీవక స్టీల్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో గాలి, నీటి నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఫ్యాక్టరీ నుంచి తరలించే మట్టి కారణంగా కూడా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని వారు పేర్కొంటున్నారని తెలిపారు. దుమ్ము, ధూళి కారణంగా రహదారి ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారని వివరించారు. నీటి నాణ్యతలో మార్పుల వల్ల వ్యవసాయంపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా పరిశీలించి, వాస్తవ పరిస్థితులను నిర్ధారించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు అవసరమైన భద్రతా సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్మికులకు భద్రతా పాదరక్షలు, హెల్మెట్లు, రక్షణ దుస్తులు, తాగునీరు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలతో పాటు బీమా కల్పించాలని కోరారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని యాజమాన్యానికి సూచించారు.. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యజమాని మోహన్ అగర్వాల్ ప్రజల సమక్షంలో ఎమ్మెల్యేతో చర్చించారు. కాలుష్య నివారణకు అవసరమైన చర్యలు చేపడతామని, స్థానిక కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని, పరిసర గ్రామాల్లో సీఎస్ఆర్ నిధుల ద్వారా సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తాత్కాలికంగా నిరసన విరమించారు. యాజమాన్యం ఇచ్చిన హామీలను నిర్ణీత గడువులోగా అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. హామీల అమలులో పురోగతి లేకపోతే తిరిగి ఆందోళన చేపడతామని స్థానికులు తెలిపారు. చేగుంట మండలంలోని అన్ని పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిశ్రమల నిర్వహణ కొనసాగాలని, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు, యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తమ సమస్యలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కారంపై ఆశాభావం ఏర్పడిందని ఆందోళనలో పాల్గొన్న రైతులు, స్థానిక ప్రజలు తెలిపారు. తమ సమస్యలపై స్పందించి చర్చల్లో పాల్గొన్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటన నేపథ్యంలో చేగుంట మండలంలోని పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు, కాలుష్య నియంత్రణ ప్రమాణాల అమలుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
7
27
502
Kotha Prabhakar Reddy retweeted
జయలక్ష్మి నగర్ ఫేజ్-2లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రాభిషేకం, పుష్పార్చన కార్యక్రమాల్లో మాజీ మంత్రి @BRSHarish గారితో కలిసి పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు, పటాన్‌చెరు ఎమ్మెల్యే @GMRMLAPTC గారు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు. 130 మంది వేద పండితులతో మహా రుద్రాభిషేకం, 5 లక్షల పుష్పాలతో పుష్పార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
3
5
78