Kproffice retweeted
కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి కుట్రలు చేస్తూనే ఉంది.
మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగినప్పుడు అక్కడ బ్లాస్టింగ్ జరిగిందని ఇంజనీర్లు కంప్లైంట్ కూడా ఇచ్చారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్ట వద్ద కూడా గత రెండు నెలల నుండి బ్లాస్టింగ్ జరుపుతున్నారు.. ఆ బ్లాస్టింగ్ కూడా దొంగల్లాగ రాత్రి పూట జరుపుతున్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
Kproffice retweeted
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో పైప్లైన్లు, పంప్‌హౌస్ నిర్మాణం కోసం జలమండలి అనధికారికంగా భారీ బ్లాస్టింగ్స్ చేస్తుండటంతో రిజర్వాయర్ కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని, గ్రామంలో ఇండ్లు కూలిపోతున్నాయని తిప్పారం గ్రామస్తులు.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారికి ఫిర్యాదు చేశారు.
గ్రామస్తుల సమాచారంతో హరీశ్ రావు గారు ఈరోజు మల్లన్న సాగర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్ కట్టను, అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. హరీశ్ రావు గారి వెంట దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తిప్పారం గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...
కాళేశ్వరం ప్రాజెక్టు పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచీ కుట్రలు చేస్తోందన్న విషయం ఇక్కడి పరిస్థితులను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.
గతంలో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా బ్లాస్టింగ్ జరిగిందా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆనాడు ఇంజినీర్లు కూడా బ్లాస్టింగ్ జరిగిందని ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
నిన్న తిప్పారం గ్రామ సర్పంచ్ భద్రప్ప గారు నాకు ఫోన్ చేసి.. అన్నా, మల్లన్న సాగర్ ప్రాజెక్టు దగ్గర మా గ్రామం పక్కనే కట్టకు కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే రాత్రిపూట చీకట్లో దొంగచాటుగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. దీనివల్ల మల్లన్న సాగర్ కట్ట అదురుతోంది. కిలోమీటర్ దూరంలో ఉన్న మా ఊర్లో ఇండ్లు నెర్రెలు బారి కూలిపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లాస్టింగ్ కోసం గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఇవ్వాలని తన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసినా తాను పర్మిషన్ ఇవ్వలేదని సర్పంచ్ భద్రప్ప గారు స్పష్టంగా చెప్తున్నారు.
హైదరాబాద్ మూసీ సుందరీకరణ కోసం మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి ఇక్కడ సంపు, పంప్ హౌస్ కట్టాలని పనులు చేస్తున్నారు. మూసీ సుందరీకరణకు నీళ్లు తీసుకుపోండి, కానీ పనులు చేయడానికి ఒక పద్ధతి, నియమ నిబంధనలు ఉండాలి కదా..
ఇరిగేషన్ నిబంధనల ప్రకారం రిజర్వాయర్ కట్టను ఆనుకుని ఇలాంటి పనులు చేయకూడదు.
మల్లన్న సాగర్ కట్ట ఎత్తు 40 మీటర్లు. నిబంధనల ప్రకారం కట్ట ఎత్తుకు 10 రెట్ల దూరం.. అంటే 400 మీటర్ల దూరం వరకు ఎలాంటి బ్లాస్టింగ్స్ గానీ నిర్మాణాలు గానీ చేయకూడదు.
ఆ 400 మీటర్ల అవతల కూడా ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ శాఖల అనుమతితో కేవలం కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మాత్రమే చేయాలి.
కానీ ఇక్కడ కట్ట నుంచి కేవలం 150 మీటర్ల లోపలనే.. ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ, గ్రామ పంచాయతీ అనుమతులు ఏవీ లేకుండా డైరెక్ట్‌గా జిలెటిన్ స్టిక్స్ పెట్టి గత రెండు మూడు నెలలుగా అడ్డగోలుగా పెద్ద పెద్ద బండలను పేల్చివేస్తున్నారు.
దాదాపు అర కిలోమీటర్ నుంచి కిలోమీటర్ పొడవునా, 16 నుంచి 20 మీటర్ల లోతున తవ్వి టన్నుల కొద్దీ బండరాళ్లను గుట్టలు గుట్టలుగా కుప్పలు పోశారు.
ఈ భారీ పేలుళ్ల ధాటికి ఇక్కడి నుంచి ముప్పావు కిలోమీటర్, కిలోమీటర్ దూరంలో ఉన్న తిప్పారం గ్రామంలో అనేక ఇండ్లు నెర్రెలు బారాయి.
రాత్రిపూట పడుకుంటే మట్టి పెళ్లలు విరిగి మీద పడుతున్నాయని, పేలుళ్ల తీవ్రతకు ఇంట్లో మంచాలు ఎగిరి పడుతున్నాయని, బోర్లు, గిన్నెలు కింద పడుతున్నాయని గ్రామస్తులు చెప్తున్నారు.
కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామంలోనే ఇండ్లు కూలిపోతుంటే.. కేవలం 150 మీటర్ల దూరంలో ఉన్న మల్లన్న సాగర్ కట్ట పరిస్థితి ఏమిటి?
ఇక్కడ పనిచేసే గ్రామ రైతులు, కూలీలు, గొర్రెలు కాసే శంభులింగం, బాలయ్య, సాయిలు తదితరులు చెప్తున్న మాటలు వింటుంటే ఆందోళన కలుగుతోంది.
గతంలో ఎప్పుడూ లేనిది ఈ బ్లాస్టింగ్స్ జరిగిన తర్వాత కట్ట పక్క నుంచి సీపేజీ పెరిగి నీళ్లు బయటకు లీక్ అవుతున్నాయని, పేలుళ్ల ధాటికి కట్ట పక్కన ఉండే రాళ్లు అర్ధ గజం మేర ఎగిరిపడి కూలిపోయాయని, కట్ట అదిరి కుంగినట్లు అనిపిస్తోందని ప్రత్యక్ష సాక్షులైన గ్రామస్తులు చెప్తున్నారు.
అసలు ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ జరగడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారని నేను ఇక్కడి నుంచే పోలీస్ అధికారులకు ఫోన్ చేసి అడిగాను.
కుక్కునూరుపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే పర్మిషన్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదు సార్ అంటున్నారు.
వాస్తవానికి నెల రోజుల క్రితమే సర్పంచ్ గారు ఎస్ఐకి ఫోన్ చేసి ఊర్లో ఇండ్లు దెబ్బతింటున్నాయని చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు.
తొగుట సీఐ గారికి ఫోన్ చేస్తే నేను కొత్తగా వచ్చాను, నా నోటీసులో లేదు అన్నారు.
డీఎస్పీ గారికి ఫోన్ చేస్తే దరఖాస్తు పెట్టారు గానీ పర్మిషన్ వచ్చిందో లేదో నాకు తెలవదు, సీపీ గారికి తెలుస్తుంది అన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే నాకు ఐడియా లేదు సార్, వెరిఫై చేస్తాను అన్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫోన్ చేసి ప్రశ్నిస్తే.. సార్, ఏ అనుమతి లేకుండా బ్లాస్టింగ్స్ చేయొద్దని, వెంటనే పనులు ఆపేయాలని మేము HMWS&SB అధికారులకు లేఖ రాశాం. కానీ వాళ్లు మా మాట పట్టించుకోకుండా బ్లాస్టింగ్స్ చేసుకుంటూ పోతున్నారు, మేమేం చేయాలి అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులను అడిగితే మాకు అసలు ఐడియానే లేదంటున్నారు.
ఇరిగేషన్ అనుమతి లేదు, పోలీస్ పర్మిషన్ లేదు, రెవెన్యూకు తెలియదు, గ్రామ పంచాయతీ తీర్మానం లేదు.. మరి ఎవరి అండతో అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ చేస్తున్నారు?
ఇవన్నీ చూస్తుంటే మల్లన్న సాగర్ ప్రాజెక్టును దెబ్బతీయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేస్తోందన్న బలమైన అనుమానాలు కలుగుతున్నాయి.
మల్లన్న సాగర్ అనేది యాదాద్రి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు 16,23,000 ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తో సహా 10 జిల్లాలకు తాగునీరు అందించే వరప్రదాయని లాంటి ప్రాజెక్టు.
కేవలం చిల్లర రాజకీయాల కోసం ఇంతటి మహత్తర ప్రాజెక్టుపై కుట్ర చేయడం దుర్మార్గం.
మరోవైపు ఇక్కడ 60 ఎకరాల భూసేకరణలోనూ కలెక్టర్, గజ్వేల్ ఆర్డీవో రైతులను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్ర అన్యాయం చేశారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం పట్టా రైతులకైనా, అసైన్డ్ రైతులకైనా ఒకే విధమైన పరిహారం ఇవ్వాలి. పెరిగిన రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మూడింతలు చెల్లించాలి.
కానీ ఇక్కడ పట్టా రైతులకు ఒక రేటు, ఎస్సీ అసైన్డ్ రైతులకు మరో రేటు ఇచ్చి వివక్ష చూపారు. ఇచ్చే 10 లక్షలు తీసుకోకపోతే అవి కూడా రావు, భూములు గుంజుకుంటాం అని కలెక్టర్, ఆర్డీవో బెదిరించి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని రైతులు వాపోతున్నారు.
కలెక్టర్, ఆర్డీవో గారు తక్షణమే భూసేకరణ పరిహారంపై రివ్యూ చేయాలి. 2013 చట్టం ప్రకారం అసైన్డ్, పట్టా అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ ఎకరాకు కనీసం రూ. 20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుంది.
మల్లన్న సాగర్ భద్రతపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడే బహిరంగ లేఖ రాసి విడుదల చేస్తున్నాం.
మంత్రి గారు తక్షణమే స్పందించి ఈ అక్రమ బ్లాస్టింగ్స్పై రివ్యూ చేయాలి, నిపుణులైన ఇంజినీర్లతో కట్టను పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలి.
Kproffice retweeted
తక్షణమే ఈ బ్లాస్టింగ్ పనులను నిలిపివేయాలి. తిప్పారం సర్పంచ్, గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే FIR నమోదు చేసి, అక్రమ బ్లాస్టింగ్స్ చేసిన కాంట్రాక్టర్, ఏజెన్సీపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలి.
అనుమతులు లేకుండా పనులు చేయించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి.
బ్లాస్టింగ్స్ వల్ల తిప్పారం గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను మేము ఇప్పుడు వెళ్లి పరిశీలిస్తున్నాం. ఇండ్లు నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలి.
మల్లన్న సాగర్ కట్టకు ఏ చిన్న నష్టం జరిగినా దానికి పూర్తి బాధ్యత జలమండలి HMWS&SB అధికారులదేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
Kproffice retweeted
తెలంగాణ రైతాంగానికి జీవనాధారమైన మల్లన్న సాగర్ భద్రతతో చెలగాటమా? ప్రాజెక్టుకు ముప్పు కలిగించే చర్యలను సహించేది లేదు..
#MallannaSagar #KCR #HarishRao #BRS
Kproffice retweeted
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు, దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు.
సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్ట పక్కన జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ పనులను పరిశీలించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు, దుబ్బాక ఎమ్మెల్యే @KPR_BRS గారు.
Kproffice retweeted
లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి!
కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
మూడు గంటల పాటు మార్చురీ ఎదుట బాధిత కుటుంబంతో కలిసి ఆందోళన.. విచారణ జరిపించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ
తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన దళిత విద్యార్థిని దావులగళ్ల లాస్య అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలను నిష్పక్షపాతంగా వెలికితీసి, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో లాస్య మృతదేహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఆమె తల్లిదండ్రులు యాదమ్మ, సంతోష్‌లను పరామర్శించి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. అనంతరం బాధిత కుటుంబంతో కలిసి సుమారు మూడు గంటల పాటు మార్చురీ ఎదుట ఆందోళనలో పాల్గొని, లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
రాత్రి 10 గంటల వరకు బాగానే ఉన్న విద్యార్థిని తెల్లవారుజామున 5 గంటలకల్లా మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షేమ గురుకులాలు ఎంతో కీలకమని, అలాంటి విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, కనీస వసతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో సమగ్ర తనిఖీలు నిర్వహించి, తాగునీరు, మరుగుదొడ్లు, లైటింగ్, ప్రహరీ గోడలు, నాణ్యమైన భోజనం వంటి కనీస సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థిని లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ హేమావతిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక పరిహారం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటనలో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై కలెక్టర్ హేమావతి స్పందిస్తూ, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇన్చార్జి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని, లాస్య మృతి ఘటనపై వాస్తవాలు వెలుగులోకి వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
#DubbakMLA #JusticeForLasya #Siddipet
Kproffice retweeted
NHM ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
17 రోజులుగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘీభావం
కేసీఆర్ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత.. రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి..
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో గత 20 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న NHM ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రజలకు నిరంతరం వైద్య సేవలందిస్తూ, కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన NHM ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. డాక్టర్ నుంచి అటెండర్ వరకు వివిధ కేడర్లలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వివిధ వర్గాల ఉద్యోగులను ఆదుకున్నామని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి NHM ఉద్యోగుల కృషి ఎంతో ఉందని, అలాంటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకొని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
NHMలోని 78 కేడర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి తగిన భరోసా కల్పించాలన్నారు.
సంబంధిత నిబంధనలు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేడర్ ఫిక్సేషన్ చేపట్టి పూర్తి వేతనాలు చెల్లించాలని, ఔట్సోర్సింగ్ ఏజెన్సీల విధానాన్ని పునఃపరిశీలించి ఉద్యోగులను స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగించాలని కోరారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలు చెల్లించడంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్లు, పెండింగ్ లాయల్టీ బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.
మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలని, విధుల్లో ఉండగా ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు బదిలీ చేసే జీఓ 1195ను కూడా పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందిస్తున్న NHM ఉద్యోగులు నేటికీ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేయాల్సి రావడం విచారకరమని కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లో NHM ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను పరిశీలించి, తెలంగాణలోనూ ఉద్యోగులకు న్యాయం చేయాలని సూచించారు.
ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న NHM ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని, వారి న్యాయమైన డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి ఉద్యోగ భద్రత, క్రమబద్ధీకరణతో పాటు వేతనాలు, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Kproffice retweeted
#NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ఎమ్మెల్యే @KPR_BRS గారి మద్దతు!
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలందించిన NHM ఉద్యోగుల సేవలు మరువలేనివి.
ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం నిరవధిక సమ్మె చేయాల్సిన పరిస్థితి రావడం ఆందోళనకరం.
ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి, NHM ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. NHM ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మద్దతు తెలిపారు.
Kproffice retweeted
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుడికందుల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని లాస్య మృతదేహాన్ని ఎమ్మెల్యే @KPR_BRS గారు పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో గుడికందుల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని లాస్య మృతదేహాన్ని ఎమ్మెల్యే @KPR_BRS గారు పరిశీలించి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మార్చురీ ఎదుట జిల్లా కలెక్టర్ వెంటనే అక్కడికి రావాలని, బాధిత కుటుంబానికి ఘటనపై స్పష్టమైన సమాధానం చెప్పాలని కోరారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Kproffice retweeted
మొన్న ఈనాడు.. నేడు కొండా సురేఖ.. రామన్నపై చేసిన అబద్ధపు ప్రచారానికి వారు చెప్పిన క్షమాపణలే సమాధానం!
ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా.. ఎన్ని కుట్రలు పన్నినా.. నిజం కోసం నిలబడి పోరాడుతున్న @KTRBRS అన్న పోరాటం స్ఫూర్తిదాయకం! ✊
Kproffice retweeted
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిపై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను.
అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు.
ఆనాడు నేను చేసిన కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది.
కేటీఆర్ గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గాని నాకు ఎంతమాత్రం లేవు.
నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబ సభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను.

































